Travel Blog by Thomas Cook India

మీ గుండె చప్పుడు ఆపేయగల అద్భుతమైన 10 వంతెనలు

మీ రక్తాన్ని మరిగించే ఏ పని అయినా చేయడం అంటే, అది సరైనదే – హంటర్ ఎస్ థాంప్సన్

ఉత్కంఠ కలిగించే పనులు మనలోని దాగున్న జీవనాన్ని యవ్వనాన్ని తట్టి లేపుతాయి. బంగీ జంపింగ్, జిప్ లైనింగ్ లాంటి ఉత్తేజకరమైన అనుభవాలు మీ హృదయాన్ని పరుగులు పెట్టిస్తాయి. మీరు ఎత్తైన ప్రాంతాలకు భయపడకపోవచ్చు. మీరు ఆక్రోఫోబియా (ఎత్తు అంటే భయం) లేదా జిఫిరోఫోబియా (వంతెన అంటే భయము) లేని వ్యక్తి అయితే, అప్పుడు క్రింద ఉన్న ఈ భయానక వంతెనలను సందర్శించండి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంతెనలు

1. కానోపి వాక్, ఘనా

చెట్ల పైభాగం నుంచి నడుస్తూ ఉంటే మీకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందా? ఘనాలోని కాకుమ్ నేషనల్ పార్క్‌లోని కానోపి వాక్ ద్వారా మీరు దీనిని అనుభవించవచ్చు. 1000 అడుగుల పైన విస్తరించి ఉన్న, ఏడు రోప్-స్టైల్ సస్పెన్షన్ వంతెనలు ఇక్కడ కనిపిస్తాయి.ఉష్ణమండల అడవిలో ఇవి ప్రమాదకరంగా ఉంటాయి. ఈ వంతెనలు అడవి ఉన్నత ప్రాంతాల గుండా ఒక కాలిబాటను ఏర్పరుస్తాయి. ఈ వంతెనలు లేకపోతే పక్షులకు మరియు కోతులకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రాంతం ఇది. ఇరుకైన కాలిబాటను నడిపేటప్పుడు మీరు భూమికి 130 అడుగుల కంటే ఎక్కువలో ఉంటారు. అత్యంత భద్రత కోసం వల మాదిరి అమరిక కలిగి ఉంటుంది. నిలబడేలా ఉంటుంది. భయమును జయిస్తే అందాన్ని ఆస్వాదించవచ్చు.

2. లంకావీ స్కై బ్రిడ్జ్, మలేషియా

డాన్ మూవీ క్లైమాక్స్‌ను లంకావీ స్కై బ్రిడ్జ్ పైనే చిత్రీకరించారు. లష్ రెయిన్ అడవులకు 100 మీటర్ల ఎత్తుకు ఇది తీసుకువెళుతుంది. 1.8 మీటర్ల వెడల్పు ఉన్న ఈ 125 మీటర్ల పొడవైన వంతెనను, 81.5 మీటర్లు ఎత్తు గల పైలాన్ నుంచి కేవలం 8 కేబుల్స్ ద్వారా లింక్ చేయబడి ఉంటుంది. ఇది సురక్షితం అనిపించకపోయినా, పర్వతాల యొక్క అందమైన దృశ్యాలు మరియు దిగువ వర్షారణ్యాలను చూసేందుకు వీలుగా అతి తక్కువ రూపకల్పనతో కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఇతర వంతెనల వలె కాకుండా, లంకావీ స్కై వంతెనకు 3 వంపులు ఉంటాయి. రెండు ఉక్కు రెయిలింగ్లు మరియు ఒక ఉక్కు తీగ మెష్ మీరు పడిపోకుండా నిరోధిస్తుంది. ఇది బహుశా బోన్ ఛిల్లింగ్ ఛాలెంజ్‌కు సవాలుకు ఖచ్చితమైన నిర్వచనం!

3. మౌంట్ టిట్లిస్ బ్రిడ్జ్, స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్లో మౌంట్ టిట్లిస్ వంతెనపై మీరు నిలబడాలని అనుకుంటే మీ నరాలు ఉక్కు తీగల వలె స్థిరంగా ఉండాలి. సముద్ర మట్టానికి 3,041 మీటర్లు మరియు భూమిపై నుంచి 500 మీటర్ల ఎత్తున ఇది నిర్మించారు. 1 మీటరు వెడల్పు మాత్రమే ఉండే ఈ వంతెన పొడవు.. కేవలం 100 మీటర్లు. మీరు దాదాపు 150 అడుగులలో మొత్తం వంతెనను దాటేయగలిగినా, గాలి ప్రతిఘటన కారణంగా ప్రతి ఒక్కరికీ గుండె వేగంగా కొట్టుకోవడం ఖాయం. జల్లెడ మాదిరి నడక ప్రాంతం అమరిక, చుట్టూ అమర్చిన కంచె మధ్యలో నుంచి చుట్టుపక్కల సౌందర్యాన్ని చూసే అనుభూతి వర్ణనాతీతం.

4. ఐగుయిల్ డూ మిడి బ్రిడ్జ్, ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లోని ఐగుయిల్ డూ మిడిలో అడుగుపెట్టిన పాదాల వంతెన గుండా నడవడం.. అత్యంత ధైర్యవంతులకు కూడా భీతి కల్పిస్తుంది. ఈ చిన్న, ఉక్కు వంతెన సముద్ర మట్టానికి సుమారు 12,500 అడుగుల ఎత్తులో ఉండగా.. వందల అడుగుల లోతైన ప్రాంతంపై నిర్మించారు. సన్నని, చల్లని గాలితో మీరు ఫ్రెంచ్, ఇటాలియన్, మరియు స్విస్ ఆల్ఫ్స్ పర్వాతాల ప్రఖ్యాత మోంట్ బ్లాంక్ యొక్క అద్భుతమైన వీక్షణకు గురి అవుతారు.

5. మిల్లావు వయాడక్ట్, ఫ్రాన్స్

వేగంగా డ్రైవింగ్ చేయాలనే ఆలోచన మీకు ఉంటే, అప్పుడు మిల్లావు వయాడక్ట్ మీ జాబితాలో ఉండాలి. మాసిఫ్ సెంట్రల్‌పై నిర్మించబడిన కేబుల్ వంతెన మొత్తం 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, దీనిపై మీ వాహనం ద్వారా గంటకు 110 కి.మీ వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఎత్తైన ప్రదేశంలో, వంతెన దాదాపు 270 మీటర్ల ఎత్తులో ఉంది. స్పష్టమైన రోజున మీరు ఫ్రెంచ్ గ్రామీణ ప్రాంతం యొక్క ఒక అద్భుతమైన వీక్షణ అందుతుంది. మబ్బులు ఉంటే, మేఘాలు మీరు డ్రైవ్ చేసేటపుడు బ్రిడ్జ్ కింద మేఘాలు కనిపిస్తాయి. మిల్లౌ వయాడక్ట్ మీద డ్రైవ్ చేయడానికి, మీరు జూలై-ఆగస్టులలో 8.90 యూరోల టోల్ ఛార్జ్ చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన సంవత్సరం, అదే ఛార్జ్ 7 యూరోలు. మేఘాలపై ప్రయాణం చేసే సౌకర్యం కల్పించే ఈ డ్రైవ్ కోల్పోవద్దు. ఇది ఖర్చు చేసే ప్రతీ పైసాకు తగిన విలువ అందించే ప్రయాణం ఇది.

6. జాంగ్జియా గ్రాండ్ కాన్యన్ గ్లాస్ బ్రిడ్జ్ (చైనా)

పై భాగం అంతా స్పష్టమైన గాజు ఉపయోగించిన ఒక వంతెన గుండా నడవడానికి ధైర్యం చేస్తారా? మీ సమాధానం అవును అయితే, మీరు చైనాలో జాంగ్జియా గ్రాండ్ కాన్యన్ గ్లాస్ బ్రిడ్జ్ సందర్శించాలి. ఇది ప్రపంచంలో ఎత్తైన మరియు అతి పొడవైన గాజు బేస్ వంతెనగా రికార్డును కలిగి ఉంది. స్పష్టమైన గాజు పలకలు మీ కాళ్ళ క్రింద 60 మీటర్ల దట్టమైన అడవిని చూడడానికి అనుమతిస్తాయి. దురదృష్టవశాత్తు, ఈ 1,410 అడుగుల పొడవైన వంతెనను.. ప్రతిరోజూ దాదాపు 80,000 మంది సందర్శకులు వీక్షించే దశకు చేరుకున్న తర్వాత మూసివేశారు.

7. రాయల్ జార్జ్ బ్రిడ్జ్, యూఎస్ఏ

నేలకు అనేక వందల అడుగుల ఎత్తున నిలబడగలిగితే, కొలరాడోలోని రాయల్ జార్జ్ వంతెనకు మీరు వెళ్ళి తీరాల్సిందే. ఇది 2001 వరకు ప్రపంచంలోని అత్యధిక ఎత్తయిన వంతెనగా ఉంది. ఈ దిగ్గజ సస్పెన్షన్ వంతెన 1,200 అడుగుల పొడవున కలిగి ఉంది. అర్కాన్సాస్ నదికి 955 అడుగుల ఎత్తులో ఉంది. ఈ వంతెన పైన, మీరు కొలరాడో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూడవచ్చు. 5 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ అద్భుతం.. ఒక మర్చిపోలేని అనుభవం.

8. ప్యూంటే డే ఒజూలా, మెక్సికో

మీరు ఒక ఘోస్ట్ టౌన్‌కు ఎడారిలో నిర్మించిన ఇరుకైన వంతెన గుండా నడిచి ధైర్యం చేయగలరా? మెక్సికోలోని ప్యూంటే డే ఒజులా వంతెన మీకు అద్భుత వీక్షణలను ఎదుర్కునేందుకు వీలు కల్పిస్తుంది. ఇంకా ఇది అందుబాటులోనే ఉంది. చెక్కతో నిర్మించిన హ్యాండ్ రెయిల్స్, మరియు విస్తృతంగా అమర్చిన పలకలు మీరు పడిపోకుండా నిరోధిస్తాయి. ఈ వంతెన చిన్నపాటి కదలకలకు గురి కావడం ఈ అనుభవం మరింత పులకరించేలా చేస్తుంది. ఇంకా ఏమిటి? మీరు ఈ భీతి గొలిపే నిర్మాణంలో ఎదురు నుంచి వచ్చే వారికి దారి ఇవ్వాల్సి ఉండడంతో మరింత భయం కలుగుతుంది. వంతెనపైకి అడుగుపెట్టిన తర్వాత 360 అడుగుల కింద ఉన్న లోతైన లోయ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు.

9. విటిమ్ రివర్ బ్రిడ్జ్, రష్యా

పైన చెప్పిన వంతెనల కంటే సైబీరియాలోని విటెమీ నది వంతెన భిన్నంగా ఉంటుంది. ఇది ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. ఈ వంతెనపై భయం కలిగించే అంశం ఏంటంటే.. ఇది పూర్తిగా పాత లోహ నిర్మాణం. ఇది చెక్కతో కప్పబడి ఉంటుంది. ఈ వంతెనపై తరచుగా మంచు చేరడం వలన జారుడుగా ఉంటుంది. మరియు అది ఎటువంటి రైలింగ్ ఉండదు. ఈ వంతెనపై నుంచి పడిపోతే నేరుగా గడ్డకట్టించే చల్లని విటిమ్ నదిలో పడిపోతారు. ఈ నిర్మాణాన్ని అధిరోహించి ప్రయాణిస్తే.. ఈ గ్రహం మీద కష్టతరమైన వంతెనలలో ఒకదానిపై నడిచినందుకు గర్విస్తారు.

10. కోపస్ బ్రిడ్జ్, కోస్టా రికా (CtG)

ఒక విషయంలో మిమ్మల్ని హెచ్చరించాలి. కోస్టా రికాలోని క్యూపోస్ బ్రిడ్జ్‌ను బ్రిడ్జ్ ఆఫ్ డెత్ లేదా ఓహ్ మై గాడ్ బ్రిడ్జ్ అని అంటారు. విటిమ్ రివర్ బ్రిడ్జ్ వలె, ఈ నిర్మాణం ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది చాలా ఇరుకైనది మరియు అది స్వల్ప పీడనం కారణంగా.. విడిపోతుందనే భ్రమ కలుగుతుంది. ఈ దెబ్బతిన్న వన్ వే వంతెనపై వాహనం ప్రయాణం చేసినపుడల్లా.. దానిలో వదులుగా ఉన్న స్లాట్లు మరియు నిర్మాణం వణుకుతుంది. ఈ పురాతన వంతెనపై ప్రయాణించే ప్రయాణీకులు దిగువ నదిలో బురదతో ఆడడదం మానుకోవాలి. ఈ నిర్మాణంపై ప్రయాణం అంటే మీ బలమైన మనోశక్తి, ధృమైన ఏకాగ్రత గురించి ప్రగల్భాలు చేయాల్సి ఉంటుంది.

మీకు ఉత్సాహం, భీతి, మరియు నేలపై నుంచి ఎంతో ఎత్తులో ఉండే అనుభవాలను పొందాలంటే ఈ ఈ వంతెనలపై ప్రయాణం చేయాల్సిందే.