Travel Blog by Thomas Cook India

పర్ఫెక్ట్‌ సెల్ఫీ కోసం ప్రపంచంలో 10 అద్భుతమైన ప్రదేశాలు

ప్రకృతి అందంతో అలరారే అద్భుత ప్రాంతం లేదా మానవ నిర్మిత అద్భుత ప్రదేశాల నుంచి మీరే తీసుకున్న ఫోటోలను షేర్ చేయడం కంటే తృప్తిని ఇచ్చే అంశం మరొకటి ఏదైనా ఉంటుందా?సెల్ఫీలపై మీకు ఇలాంటి క్రేజ్ ఉంటే, కింద ఇవ్వబడిన జాబితాలో ఉన్న ప్రదేశాలలో ఒకదానిని ఎంచుకుని పర్యటించాల్సిందే. ఈ ప్రాంతాలలో తీసుకున్న చూడముచ్చటైన సెల్ఫీలను మీరు షేర్ చేయకుండా ఉండలేరు.

1. ట్రాల్‌టుంగా, నార్వే

సెల్ఫీలను తీసుకునేందుకు నార్వేలోని ట్రాల్‌టుంగా అత్యంత ప్రఖ్యాతి చెందిన ప్రాంతం. దీని సరైన అర్ధం ట్రాల్ టంగ్. కొండనుంచి నిలువగా చీలిన అధ్భుతమైన ఓ పెద్ద కొండ రాయి ఇది. భూమిపై నుంచి 700 మీటర్ల ఎత్తున మీరు నిలుచుని ఉండగా.. రింగ్‌దల్‌స్వనెట్ లేక్, ఫోల్జ్‌ఫొన్నా గ్లేసియర్‌, హార్దంగర్ లోయలు.. మీ సెల్ఫీలో కనిపిస్తాయి. ట్రాల్‌టుంగా పైకి చేరడానికి 10-12 గంటల సమయం పడుతుంది. అందుకే ఉదయం 10 గంటలలోపు బయలుదేరాల్సి ఉంటుంది.

2. విక్టోరియా ఫాల్స్‌లో డెవిల్స్ పూల్, జింబాబ్వే

 

డెవిల్స్‌ పూల్ అంటే జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్‌లో ఉన్న ఒక రాతి కొలను. ఒక అంచున జీవితాన్ని ఆస్వాదించాలంటే ఇక్కడికి చేరి ఓ సెల్ఫీ తీసుకోవాలి. ఏడాదిలో పొడిగా ఉన్న నెలలలో మాత్రమే ఇక్కడకు రావాల్సి ఉంటుంది. పాక్షికంగా కలిసి రాళ్ల మధ్య నుంచి 100 మీటర్ల లోతున ప్రదేశం మీకు కనిపిస్తుంది. నీటిలోకి దుమకడం ద్వారా మీరు కూడా వాటర్ ఫాల్స్‌తో పాటు ప్రయాణించవచ్చు. అంచునకు కొన్ని అంగుళాల దూరంలో ఉన్నపుడు, రాళ్లతో నీటి రాపిడికి అతి సమీపంలోకి చేరుకుంటారు. జలపాతం ఆరంభంలో మీరు గైడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా డెవిల్స్‌ పూల్‌ను సురక్షితంగా సందర్శించవచ్చు.

3. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్, యూఎస్ఏ

యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో ఎక్కడ నుంచి అయినా సరే, మీరు అద్భుతమైన సెల్ఫీ తీసుకుని షేర్ చేసుకోవచ్చు. గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్, యెల్లోస్టోన్ లేక్, ఓల్ట్ ఫెయిత్‌‌ఫుల్, లయన్, బీహైవ్ గీజర్.. ఏదైనా సరే మీరు తీసుకున్న సెల్ఫీలు సూపర్ కూల్‌‌గా ఉంటాయి. స్నేహితులు, కుటుంబంతో పంచుకునేందుకు ఆహ్లాదంగా ఉంటాయి. యెల్లోస్టోన్ పార్క్‌లో మిస్ కాకూడని మరో ప్రాతం గ్రాండ్ కాన్యన్. 3,468 మైళ్ల దూరం కనిపించే అద్భుతమైన సెల్ఫీని మీరు తీసుకోవచ్చు.

4. కేప్‌టౌన్ సమీపంలోని బౌల్డర్స్ బీచ్, దక్షిణ ఆఫ్రికా

చిన్న చిన్న పెంగ్విన్స్‌ను మీరు ఇష్టపడితే, తప్పనిసరిగా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో బౌల్డర్స్ బీచ్‌ను సందర్శించాలి. 3వేలకు పైగా ఆఫ్రికా పెంగ్విన్స్ ఇక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని, నెమ్మదిగా వచ్చే అలల తీరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అద్భుతమైన పక్షులతో సెల్ఫీలు తీసుకోవడం ఓ మరిచిపోలేని అనుభూతి.

5. ప్లిట్విస్‌ లేక్స్ నేషనల్ పార్క్, క్రొయేషియా

ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్.. క్రొయేషియాలో అతి పెద్ద నేషనల్ పార్క్. ఆగ్నేయ యూరోప్‌లో ఇది అతి ప్రాచీనమైనది కూడా. కాస్కేడ్స్ మాదిరిగా ఏర్పాటు అయిన 16 కాలువల అమరిక.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. కొండలకు సమీపంలో వీటి దిగువ, ఎగువ ప్రాంతాలు అమర్చబడ్డాయి. మరి ఈ ప్రాంతాన్ని పర్ఫెక్ట్ సెల్ఫీలకు అనువుగా మార్చినది ఏది? ఈ కాలువల రంగులు తరచుగా మారిపోతూ ఉంటాయి. గ్రీన్ నుంచి అజూర్‌కు, బ్లూ నుంచి గ్రే కలర్‌కు.. సూర్య కాంతి ఆధారంగా వీటి రంగులు మారుతాయి. ఇందుకు కారణం ఆ నీటిలో ఉన్న రసాయనాలు.

6. మాచుపిచు, పెరు

సముద్ర మట్టానికి 2,430 మీటర్ల ఎగువన ఉన్న కొండపై ఉన్న మాచుపిచు, ప్రపంచాన్ని చుట్టాలనే ప్రతీ పర్యాటకుడు సందర్శించాల్సిన జాబితాలో తప్పనిసరిగా ఉండాల్సిందే. శిఖరాన్ని చేరుకునేందుకు మీరు తప్పనిసరిగా 26 మైళ్ల పాటు నడవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన నడకల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. దారిలో కనిపించే చిన్న చిన్న లామాలతో ఫోటోలు దిగడం, సెల్ఫీలను షేర్ చేసుకోవడం మరచిపోలేని అనుభూతి.

7. మాలైన్ లేక్, కెనడా

కెనడాలోని జాస్పర్ నేషనల్ పార్క్‌లో మాలైన్ కాలువ ఉంది. ఇది గ్లేసియర్లతో కూడిన నీటి ప్రవాహం కనిపించే ప్రపంచంలో రెండో అతి పెద్ద కాలువ. మాలైన్ లేక్‌లో పడవలో ప్రయాణిస్తున్నపుడు కెనడియన్ రాక్స్‌ను ఫోటోలు తీసుకోవడం మరపురాని అనుభవం. వివిధ రంగులతో ఆకట్టుకునే ఈ కాలువకు సమీపంలోనే ఉన్న స్పిరిట్ ఐల్యాండ్, ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీసుకునే ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది.

8. సినిక్ టెర్రే, ఇటలీ

ఇటలీ అద్భుతాలలో ఒకటిగా నిలిచే ప్రాంతం సినిక్ టెర్రే. దీని అర్ధం ఐదు దీవులు. ఇటాలియన్ రివియెరాపై ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. విశాలమైన మైదనాలు, అద్భుతమైన పైకప్పులు సినిక్ టెర్రానా సెల్ఫీలకు పర్ఫెక్ట్ ప్లేస్‌గా మార్చేశాయి. ఫోటోలకు, సెల్ఫీలకు అనువైన ప్రాంతం.

9. చిత్తోర్‌ఘడ్ కోట, ఇండియా

4 ప్యాలెస్ కాంప్లెక్స్‌లు, 4 మెమోరియల్స్, 19 ప్రధాన ఆలయాలు, 20 నీటి మడుగులు రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘడ్ ఈ కోటలో ఉంటాయి. అద్భుతమైన సెల్ఫీలు, మనసును హత్తుకునే ఫోటోలు తీసుకునేందుకు ఇది అనువైన ప్రాంతం. 7వ శతాబ్దానికి చెందిన ఈ కోటను దేశంలోనే అత్యంత ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఇది శిథిలం కాకముందు, చరిత్రలో ఈ కోటనుంచి అనేక మంది రాజులు పరిపాలించారు. అదృష్టవశాత్తూ 1905లో దీన్ని పునరుద్ధరించారు.

10. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పర్యటన

అద్భుతమైన సందర్శన ప్రాంతాల్లో ఒకటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ప్రపంచ వింతల్లో ఒకటైన దీనిపై టొబాగన్ రైడ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తీసుకునే సెల్ఫీలు, ఫోటోలు చిరకాలం పదిలంగా దాచుకోవాల్సిందే. మీరు ప్రయాణించే స్లెడ్స్‌పై ఒకేసారి ఇద్దరు రైడర్లు పయనించవచ్చు. మీ మోకాళ్లకు చేరువలో ఉన్న లివర్‌ను ముందుకు నెడితే బ్రేక్ పడుతుంది. దీన్ని వెనకకు లాగితే స్లెడ్ ఆగిపోతుంది. దాదాపు 1 మైలు దూరంపాటు అడవుల గుండా సాగే ఈ ప్రయాణంలో పలు మార్లు ఆగి అద్భుతమైన సెల్ఫీలు, వీడియోలు తీసుకోవచ్చు.

ఈ ప్రాంతాలలో తీసుకునే అద్భుతమైన సెల్ఫీలలో బ్రహ్మాండమైన బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్న ఫోటోలు టాక్-ఆఫ్-ది-టౌన్‌గా మారిపోతాయి.