Travel Blog by Thomas Cook India

సెలవులను అద్భుతంగా గడిపేందుకు అత్యంత అందమైన 11 మారిషస్ బీచ్‌లు

మారిషస్‌ను సందర్శించేందుకు ముందే మాయ చేసే సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం కావాలి. వివిధ ఉష్ణ మండలీయ ద్వీపాలకు నెలవైన ఈ ప్రదేశం పచ్చని ఆకుపచ్చ వివిధరకాల వృక్షాలను ఏడాది పొడుగునా కలిగి ఉంది. పోర్ట్‌లూయిస్‌(దేశం యొక్క రాజధాని కూడా) వంటి ఒక సుసంపన్నమైన మారిషస్ నగరం యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం సందర్శకులకు ఏడాది పొడవునా ఆహ్వానం పలుకుతుంది. మెరిసిస్ తీరప్రాంత బీచ్‌లు, ప్రశాంతమైన పరిసరాలతో కలిసి అనేక నీటి కార్యకలాపాలను అందిస్తాయి. ప్రకృతి ఒడిలో చెట్ల మధ్య ఒక పుస్తకం చదివుతూ, సంగీతం వింటూ,, సరదాగా గడపడం, తీరప్రాంత బీచ్లో ఉల్లాసభరితంగా ఆస్వాదిస్తే.. సమయం అస్సలు గడిచినట్లే తెలియదు. మీ మారిషస్ హాలిడే ప్యాకేజీల్లో మీరు చేర్చవలసిన టాప్ మారిషస్ బీచ్‌లను గురించి తెలుసుకోండి.

టాప్ 11 మారిషస్ బీచ్‌లు

1. ట్రౌ ఆక్స్ బీచ్‌లు:

ఇది మారిషస్ నగరంలోని ఉత్తమ బీచ్‌లలో ఇది ఒకటి. స్నార్కెలింగ్ మరియు ఈత కోసం సరైన ప్రాంతం. నీటిలో నిస్సారమైన, స్పష్టమైన మరియు ప్రశాంతత కలిగి ఉంటుంది. ఇది కుటుంబాలకు మరియు వివిధ వ్యక్తుల సమూహాలకు ఆదర్శంగా ఉంటుంది. మీరు కొన్ని స్ట్రీట్‌ఫుడ్ స్టాండ్‌లు, తీర రహదారుల వెంట ఉన్న రెస్టారెంట్లు మరియు కేఫ్‌లను కూడా చూస్తారు.

2. ఐల్ ఆక్స్ సెర్ఫ్స్:

ఐల్ ఆక్స్ సెర్ఫ్స్ మీ కుటుంబ సభ్యులకు వినోదభరిత ద్వీపంగా ఉంటుంది. అయితే వారాంతాల్లో ఇది సందడిగా ఉంటుంది. ఇక్కడ మీరు నీటి ఆధారిత కార్యకలాపాల్లో దాదాపు అన్ని పనుల్లో పాల్గొనవచ్చు. కాబట్టి మీరు ఉత్తేజకరమైన వాటర్‌స్పోర్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే బీచ్‌ను చుట్టేయండి. మౌరిషస్ టూరిజంలో స్నార్కెలింగ్ కోసం సిఫార్సు చేయబడిన ఉత్తమమైన ప్రదేశం ఇల్ ఆక్స్ సెర్ఫ్స్.

3. బ్లూ బే బీచ్:

మీరు మీ జ్ఞాపకాలను ఫోటోలుగా భద్రపరచుకోవాలని అనుకుంటే, మీరు ఈ స్థలాన్ని తప్పక సందర్శించాలి. ఇక్కడి వైవిధ్యాలు అద్భుతమైనవి. మీరు బ్లూ బే బీచ్ వద్దకు వచ్చినప్పుడు, దాని పేరు ఎలా వచ్చిందని అర్ధం చేసుకుంటారు. ప్రతి కోణం నుంచి ప్రకాశిస్తూ వివిధ నీలం రంగులను కలిగి ఉంటుంది. వారాంతాలలో ఈ బీచ్ చాలా సుందరమైనదిగా ఉంటుంది. అయితే, వీక్‌డేస్‌లో ఈ స్థలం ఎంతో ఖాళీగా ఉంటుంది. మరియు మీ కోసం ఈ సుందరమైన దృశ్యాలను కలిగి ఉంటుంది.

4. బెల్లె మారే:

ద్వీపంలో అత్యంత ఆకర్షణీయమైన బీచ్‌లలో ఒకటిగా ఉన్న ఈ 10 కిలోమీటర్ల పొడవైన తెల్లని ఇసుక బీచ్ వద్ద సమయాన్ని ఆనందంగా గడపండి. ఈ ప్రదేశంలో అలలు మరింత బలంగా ఉంటాయని గుర్తుంచుకోండి. మారిషస్‌లోని ఇతర ప్రాంతాల కంటే ఈ ప్రదేశం చురుకైనది.

5. మాంట్ చాయిసీ బీచ్:

మాంట్ చాయీస్ పాయింటే ఆఖ్స్ కానరీస్ మధ్య మాంటీ చాయిసీ ఉంది. ట్రౌ ఆక్స్ బీచ్‌లకు ఈశాన్యంగా 3 కిలో మీటర్ల దూరంలో, గ్రాండ్‌బేకు నైరుతిగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంది
ఈ బీచ్ 3 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి ఉంటుంది. మారిషన్ సూర్యుడి నుండి నీడను అందించే కాసురీనా చెట్లతో కప్పబడిన ఆహ్లాదకరమైన ప్రాంతం.

6. పెరీబెర్:

స్థానికులతో బాగా ప్రాచుర్యం పొందిన పెరీబ్.. కాప్ మాలెయ్యూక్స్ మరియు గ్రాండ్‌బే ల మధ్య ఉంది. ప్రత్యేకంగా స్కూల్ సెలవులు సమయంలో, అన్ని వయస్సుల పిల్లలు ఆహ్లాదకరమైన ఆటలు ఆడుతూ గడిపేందుకు ఈ ప్రదేశానికి వస్తారు. ఇక్కడ, పలు మారిషస్ బీచ్‌ల కంటే నీరు లోతుగా ఉంటుంది. అయినా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే మీరు ఒక మాస్క్ మరియు స్నార్కెల్‌‌ను ఎంజాయ్ చేసందుకు ఇష్టపడతారు. స్వచ్ఛమైన నీరు మీకు సముద్ర జీవితం యొక్క అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి.

7. ఫ్లిక్ ఎన్ ఫ్లాక్:

భూమిపై అత్యంత సుందరమైన తీరాలలో ఒకటైన ఇక్కడ, స్వర్గం యొక్క అనుభవాన్ని పొందండి. మీ మారిషస్ హాలిడే ప్యాకేజీలలో ఫ్లిక్ ఎన్ ఫ్లాక్ తప్పనిసరి. ఇది కేవలం ఒక అందమైన పేరు కలిగి ఉండడమే కాదు, మారిషస్ అందాలలో ఒకటి పరిగణించబడుతుంది.

సమీపంలోని సరస్సు అనేక పర్యాటకులను మెప్పించే అనేక ఆకర్షణీయమైన అందాలను కలిగి ఉంది. ఈ బీచ్‌లో చాలామంది సన్ డైవర్స్ కనిపిస్తారు. ఇది అత్యంత పొడవైన బీచ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.

8. లా కువెట్టే:

గ్రాండ్‌బే లో చిన్న లా కువెట్టే అద్భుతమైన ఆభరణంలా ఉంటుంది. దీన్ని అతిచిన్న బీచ్‌గా చెప్పవచ్చు. 80 మీటర్ల పొడవుతో, లా కువెట్ట్ ఇప్పటికీ కొన్ని రహస్యాలు, ఫుడ్ స్టాండ్స్, బండరాళ్లు మరియు శిఖరాలతో ప్రశాంతతను కలిగి ఉండేలా చేస్తుంది. ఏకాంతం అనుభవించాలని కోరుకునే ప్రజలకు నచ్చే ప్రాంతం.

9. టామరిన్ బీచ్:

బ్లాక్‌రివర్ పర్వత శ్రేణి నేపథ్యంలో టామరిన్‌బే బీచ్ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. టామరిన్ బీచ్‌లో విహారం ఆనందకరమైన మరియు గుర్తుండిపోయేలా చేస్తుంది. ఈ ప్రదేశం బ్లాక్ నది మరియు ఫ్లిక్ ఎన్ ఫ్లాక్ మధ్య ఉన్న గ్రామంలో టామరిన్‌బే ఉంది.
ఈ బీచ్ ఇసుక పసుపు రంగులో ఉంటుంది మరియు చిన్న రాళ్లను కలిపి మృదువైన ఇసుకను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో సముద్రం పగడాలు, సముద్రపు అర్చిన్లు మరియు శిలలు స్పష్టంగా కనిపిస్తాయి.

10. గ్రిస్‌గ్రిస్ బీచ్:

మారిషస్ తీరాల యొక్క విస్తృత భాగాలలో గ్రిస్‌గ్రిస్ బీచ్ ఒకటి. నల్లని అగ్నిపర్వత శిలలతో చుట్టుముట్టబడి ఉంది. ఈ బీచ్ చాలా సంక్లిష్టమైనది. అందుకే ఇది ఏ నీటి క్రీడలకు సరిపోదు. ఈ ప్రదేశం యొక్క నీరు చాలా కఠినమైనది మరియు అల్లకల్లోలంగా ఉంటుంది. అందువల్ల ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్‌గా పరిగణించబడుతుంది.

11. లా కాంబూస్:

మీరు సాహసోపేత వ్యక్తి మరియు మంచి స్విమ్మర్ అయితే, మారిషస్ సెలవులు ప్యాకేజీలో అందమైన లా కాంబూస్ పబ్లిక్ బీచ్‌కి వెళ్ళటానికి ఇది సిఫార్సు చేయబడింది. ఈ విమానాశ్రయం యొక్క తూర్పున ఉంది. ల్లని ఇసుక మరియు ఆకర్షణీయమైన నీటితో ఉన్న ప్రశాంతత అందుతుంది. ఈ ప్రదేశంలో ప్రవాహాలు శక్తివంతమైనవి. అందువలన ఇది సమర్థమైన స్విమ్మర్లకు మాత్రమే సిఫార్సు చేయబడింది.

ఈ నమ్మశక్యం తీరాలలో మీ మారిషస్ పర్యనను ఇప్పుడే బుక్ చేసుకోండి.