Travel Blog by Thomas Cook India

లడఖ్‌లో అద్భుతమైన 20 స్థలాల సందర్శన

ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటి లడఖ్. ఇది ఒక ఉత్కంఠభరితమైన సెలవు విడిది. లెహ్‌తో పాటుగా అందమైన ఆరామాలు, సువాసన వెదజల్లే హిమాలయన్ వంటకాల రుచులు ఆస్వాదించవచ్చు. చూడముచ్చటైన గ్రామాలలో ఒక మనోహరమైన సెలవుదినం గడపవచ్చు. మీ హిమాలయాల టూర్‌‌ను పరిపూర్ణం చేసేందుకు లడఖ్‌లో సందర్శించాల్సిన ఉత్తమ స్థలాల జాబితా ఇక్కడ ఉంది.

లడఖ్‌లో సందర్శించడానికి అగ్ర స్థలాలు

1. బంగారు బుద్ధుడిని పలకరించండి:

 

బుద్ధుని ఈ విగ్రహాన్ని నిజంగా స్వచ్ఛమైన బంగారంతో రూపొందించారా? బుద్ధ విగ్రహాన్ని చూస్తే అలా అనిపించక మానదు. లడఖ్‌లో సందర్శించడానికి అత్యంత ఆసక్తికరమైన స్థలాలలో సీమో గొంపా ఒకటి. ఒక చిన్న కొండ ఎక్కి మీరు విగ్రహాన్ని సందర్శించవచ్చు.

2. షే ఆరామానికి వెళ్ళండి:

 

లెహ్ నుండి ఒక రాయి విసిరేసినట్లుగా ఈ ప్రాంతం ఉంటుంది. పోస్ట్ కార్డ్‌ను చూసినట్లుగా పవిత్ర జెండాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో ఈ ఆరామం ఉంటుంది. బౌద్ధ శాసనాల ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తూ, ఆ ప్రాంతం యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు.

3. ఈ సూప్‌లతో సేద తీరండి:

 

లడఖ్ వాతావరణం కంటే ఏదీ పెద్దది కాదంటే అదేమీ అతిశయోక్తి కాదు. ఒక ప్రత్యేక రుచిని అందించే మూలికలు మరియు స్థానిక సుగంధాల మిశ్రమంతో తయారైన ఒక సూప్ థుక్పా. లెహ్ యొక్క చాప్‌స్టిక్స్ నూడిల్ బార్‌తో లేదా టిబెటన్ కిచెన్‌లో దీనిని ప్రయత్నించవచ్చు

4. డ్రాంగ్-డ్రంగ్‌కు ట్రెక్కింగ్:

 

మీరు వెంట్రుకలు నిక్కబొడిచే సాహసాలను ఇష్టపడే వ్యక్తులు అయితే, అప్పుడు డ్రాంగ్-డ్రంగ్ గ్లేసియర్‌కి ట్రెక్కింగ్ చేయండి. జన్స్‌కర్ రేంజ్‌లో ఇది ఒక భాగం. మంచు గాలులను తాకిన నీరు.. విస్తృతంగా సుదీర్ఘంగా స్తంభించిన నది వలె కనిపిస్తుంది.

5. గుహలలో ఆరామాన్ని అన్వేషించండి – లడఖ్‌లో సందర్శించడానికి అగ్రస్థానాలలో ఒకటి:

 

లింగ్‌షెడ్‌లో సందర్శించడానికి అత్యంత ఆకర్షణీయ ప్రదేశాలలో ఒకటి. జన్స్‌కర్ లోయలో ఉన్న ఒక నక్షత్ర గుహ మఠం. అందమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఈ ప్రాంతం ఆహ్వానిస్తోంది.

6. కహ్వా సిప్ చేయండి:

 

లెహ్ యొక్క ప్రధాన మార్కెట్లలోని రెస్టారెంట్లలో అందించే ఒక పానీయం కహ్వా. ఇది ఖచ్చితంగా మీకు కొత్త రుచిని అందిస్తుంది. కుంకుమ మరియు దాల్చినచెక్కతో అలంకరించబడిన ఈ పానీయం.. చల్లని కొండలలో వణుకు తగ్గిస్తుంది.

7. ప్యాలెస్ సాహసం చేయండి:

 

మీ కుటుంబాన్ని లేహ్ ప్యాలెస్‌కు తీసుకువెళ్లండి. ఇది మీకు గంభీరమైన రాజరిక దృశ్యం అందిస్తుంది. అందంగా రూపకల్పన చేసిన ఈ భవనం అద్భుతమైన కుడ్యచిత్రాలు, కళలు మరియు ప్రాచీన లిఖిత పూర్వక అంశాలను కలిగి ఉంది. లడఖ్ ప్యాకేజీలో ఇది తప్పకచూడాల్సిందే.

8. పత్తర్ సాహిబ్ వద్ద గురుద్వారాలో ప్రార్ధించండి:

 

పత్తర్ సాహిబ్ వద్ద అందంగా రూపకల్పన చేసిన గురుద్వారా, అద్భుతమైన ఆకట్టుకునే లంగర్ కలిగి ఉంది. రుచికరమైన రాజ్మా బియ్యంతో చేసిన భోజనం మీ హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ప్రతీరోజు ఈ ప్రాంతాన్ని సందర్శకులు సందర్శిస్తారు. గురుద్వారా వంటశాలలు చూడడానికి కూడా అద్భుతంగా ఉంటాయి.

9. ఉత్తరాది జంతువులు:

 

వైల్డ్ మార్మోట్లు మరియు నీలం గొర్రె వంటి అంతులేని జంతువులకు ఆవాసం ఈ ప్రాంతం. లడఖ్ శిఖరాలు మనోహరంగా కనిపిస్తాయి. స్కర్ లేదా ఖల్సర్ ట్రెక్ వంటి ట్రెక్కింగ్‌వి చేయండి. టిబెట్ నక్కను దాని సహజ నివాస స్థలంలో చూడవచ్చు.

10. గడ్డకట్టే జన్‌స్కర్‌ నదిపై తెప్ప ప్రయాణం:

 

మీరు థ్రిల్ ఆశించే వ్యక్తి అయితే, లడక్‌లో సందర్శించాల్సిన స్థలాల జాబితాలో జన్‌స్కర్ లోయకు వెళ్లాలి. స్విఫ్ట్ ర్యాపిడ్స్, చల్లని నీరు మీకు గొప్ప అనుభూతులు పంచుతుంది.

11. వెన్నతో చేసిన టీ ప్రయత్నించండి!

 

ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన, వెన్నతో చేసిన తేనీరుని.. మీరు లెహ్‌లో పొందవచ్చు. ఈ తేయాకును మీ లడఖ్ పర్యటనలో గడ్డకట్టే శీతాకాలంలో సద్వినియోగం చేసుకోవచ్చు.

12. లేహ్‌లో ఒక యాక్ రైడ్:

 

ఒక గుర్రం లేదా ఒక ఒంటెపై ప్రయాణం చేసి ఉంటారు.. లేదా విని ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా యాక్‌పై ప్రయాణించారా? మీరు లెహ్‌లో ఉన్నట్లయితే, వాటిపై ఒక ప్రత్యేక రైడ్ తీసుకొని జీవితకాల అనుభవం మిగుల్చుకోండి.

మా లడఖ్ సెలవు ప్యాకేజీలు మీకు లడఖ్ యొక్క అందాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తాయి.

13. నుబ్రా లోయ యొక్క సహజ అద్భుతం:

 

చిత్రలేఖనంకు స్ఫూర్తి అందిస్తూ.. విభ్రాంతి కలిగించే నుబ్రా లోయకు ప్రయాణం చేయకుండా లడఖ్ నుండి తిరిగి బయలుదేరడం అంటే దైవదూషణ చేయడం కంటే తక్కువేమీ కాదు. లోయకు ఒక వైపు చల్లని ఎడారి మరియు మరోవైపు నిద్రిస్తున్న మాదిరి పచ్చిక బయళ్లు ఉన్నాయి.

14. మోమోస్‌ను మెచ్చండి:

 

ఫుడ్‌ లవర్స్‌కు లడఖ్ ఆహ్వానం పలుకుతుంది. లేహ్‌లోని లామయురు లేదా గెస్మో వంటి తినుబండారాలలో హిమాలయన్ మోమోలను ప్రయత్నించడం మర్చిపోవద్దు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వైవిధ్యాలు ఇక్కడ ఉంటాయి. ఉడకబెట్టిన కుడుములు మరియు గొర్రె మోమోలు లడఖ్ పర్యాటక రంగం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతాయి.

15. స్పిటుక్ గొంప వద్ద కనుల విందు:

 

లడఖ్‌లో సందర్శించడానికి సిఫార్సు చేయబడిన ప్రదేశాలలో ఇది ఉన్నత స్థానంలో ఉంటుంది. అందమైన కళారూపాలు, వాస్తుకళ మరియు సంప్రదాయ పండుగ ముసుగుల ప్రదర్శన కోసం స్పిటుక్ గొంపాకు వెళ్లాలి. కాళి దేవి గంభీరమైన విగ్రహాన్ని చూడాలి. ఆమె ఏడాదికోమారు మాత్రమే రంగప్రవేశం చేస్తుంది! స్థానికంగా పండుగ జరిగే సమయంలో ఈ విగ్రహ సందర్శించడం సరైన పని.

16. లడఖి పండుగలలో ఆనందించండి:

 

లడఖ్ ఫెస్టివల్ నిర్వహణ సాంప్రదాయం మిమ్మల్ని ఎంతగానో మెప్పిస్తుంది. స్పిటుక్ ఫెస్ట్ సమయంలో మీ హాలిడే ప్లాన్ చేసుకుంటే నిజమైన ట్రీట్ లభించినట్లే. ముసుగులు ధరించిన పురుషులు కొన్ని మంత్రముగ్ధమైన నృత్యాలతో అలరిస్తారు. ప్రతి సంవత్సర విహారయాత్రకు చాలా మందిని ఆకర్షించే, మరియు మీరు మిస్ చేయలేని మరో పండుగ షీయ్ రుప్లా. పులిని పోలిన వస్త్రాలు ధరించిన ప్రజలు ప్రదర్శించిన విశేషమైన నృత్యం ఆకట్టుకుంటుంది.

17. పాంగోంగ్ సరస్సు వద్ద ప్రశాంతత:

 

హిమాలయ పర్వతాలలో అత్యంత అద్భుతమైన ప్రాంతాలలో శాంతియుతమైన పాంగోంగ్ సరస్సు ఉంది. నీలిరంగు నీళ్ళు, పర్వతాలు మరియు పాంగోంగ్ సరస్సు వద్ద ఉంటే ఆ అనుభూతే వేరు.

18. సన్యాసులతో సమయం:

 

లడఖ్‌లో సందర్శించాల్సిన స్థలాలలో థిక్సే అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇవి మీకు అసమానమైన అనుభవాన్ని అందిస్తాయి. అద్భుతమైన నిర్మాణం మరియు శాంతియుత ప్రదేశం ఇది. మీరు ఈ ప్రదేశాలలో ప్రశాంతత గల ప్రకాశంలో ఊపిరి పీల్చుకోవచ్చు. కేవలం హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ లోతైన నిర్మాణ అద్భుతాలను చూసి విస్మయం చెందేందుకు.. మీ పర్యటనలో ఒక విరామం తీసుకోండి. మీరు ‘ఓం మణి పద్మేహం’ అంటూ సన్యాసులతో జపించవచ్చు. పర్వతాల నుంచి తిరిగి వినిపిస్తున్న ప్రతిధ్వని వినవచ్చు.

19. బౌద్ధమత మూలాలను కనుగొనండి:

 

మీరు వేదాంతశాస్త్రం ద్వారా ఆకర్షించబడితే, అప్పుడు ఆరామాన్ని దర్శించండి. ఇది బౌద్ధమతంలో సూచించిన విభిన్న ఆచారాలు మరియు సాంస్కృతిక అభ్యాసాలపై మీకు సంగ్రహావలోకనం అందిస్తుంది.

20. టింగ్మోస్ మరియు ఛుర్పిని ప్రయత్నించండి:

 

తింగోల్ వద్ద టింబోస్ వంటి ఉత్సాహభరితమైన తినుబండారాలను లేహ్ యొక్క ఆహార మార్కెట్లు అందిస్తున్నాయి. ఈ ఉడికించిన రొట్టెని ఒక రుచికరమైన వంటకంలో ముంచి తినాలి. లడఖ్‌లో చేయాల్సిన పనులలో ఇది ప్రత్యేకమైనది. చాలా సరళంగా యక్ చీజ్‌గా ఉంటుంది!