Travel Blog by Thomas Cook India

ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజీ 20 హిప్పీ పట్టణాలు

హిప్పీ సంస్కృతి 1960వ దశకంలో ప్రారంభంలో గుర్తించబడింది. ఎంతో స్వేచ్ఛతో ప్రజలు ఎటువంటి బంధాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంచరించిన సమయం. నెమ్మదిగా, ఈ ప్రయాణంలో వారు ఒకదానితో ఒకరు కలుసుకున్నారు, బృందాలుగా ఏర్పాటు అయ్యారు. దీంతో త్వరలోనే హిప్పీ విప్లవం మొదలయింది. 60లు దాటి పోయాయి, కానీ హిప్పీ సంస్కృతి ఇప్పటికీ జీవించి ఉంది. ఆసక్తికర మరియు ఉత్తేజకరమైన ధ్వనులు, ఆకట్టుకుంటాయి కదా? ఈ ప్రాంతాలలో హిప్పీ జీవనశైలిని ఆచరించే అవకాశం మీకు ఉంది!

ప్రపంచంలోని 20 హిప్పీ నగరాలు సందర్శించాల్సిన జాబితాలో ఉన్నాయి:

1. హిప్పీ పారడైజ్-ఐబిజా, స్పెయిన్:

కాలేజ్ విద్యార్ధుల పార్టీల కంటే ఇబిజా చాలా ఎక్కువ. ఇది హిప్పీల కోసం స్వర్గంగా ప్రసిద్ధి చెందింది. అనేక మార్కెట్ ప్రదేశాలు, షాపింగ్ స్థలాలు ఇక్కడ ఉన్నాయి. మీరు హిప్పీ సంస్కృతి ఇక్కడ చూవచచ్చు. 60వ దశకంలో యూరోపియన్ హిప్పీల ప్రారంభానికి ఐబిజా మూల ప్రాంతం.

2. ఆకట్టుకునే హిప్పీ స్థలం – గోవా, భారతదేశం:

గోవా నిస్సందేహంగా ప్రతి యువత కల, లక్ష్యం. ఇప్పటికే అనేక మంది సందర్శించి ఉంటారు కూడా. పోర్చుగీసు సంస్కృతి, సముద్ర తీరాలు, చర్చిల అందం మరియు రాజరిక ఆనవాళ్లతో పాటు హిప్పీ కల్చర్.. అన్నీ కలిసి గోవాను గమ్యస్థానంగా మార్చేశాయి.

3. ఆత్మను తట్టి లేపే ప్రాంతం- నెగ్రిల్, జమైకా:

నెగ్రిల్ ప్రపంచంలో అత్యంత తక్కువగా అంచనా వేయబడిన హిప్పీ గమ్యస్థానాలలో ఒకటి. బాష్పీభవనం లేని బీచ్లు, స్వచ్ఛమైన నీలి జలాలు మరియు విశ్రాంతిగా అనిపించే వెలుగులతో మీరు అంతర్గత స్వేచ్ఛను పొందుతాయి. నెగ్రిల్ కచ్చితంగా ఆకట్టుకునే ప్రదేశం!

4. హిప్పీ పర్వతారోహకులు- ఖాట్మండు, నేపాల్:

నేపాల్ యొక్క రాజధాని, ఖాట్మండు, ఎల్లప్పుడూ పర్వతారోహణ అభిరుచి గల హిప్పీల ప్రదేశంగా ఉంది. ప్రశాంతత, శాంతి మరియు ఆధ్యాత్మికత కోసం అన్వేషణలో భాగంగా, తమ సొంత ప్రపంచాన్ని విడిచిపెట్టిన ప్రజలు ఖాట్మండు సందర్శిస్తున్నారు. హిమాలయాలకు మంచు కప్పివేయబడిన పర్వత మార్గం హిప్పీ ప్రయాణికులకు నిలయం.

5. స్వేచ్ఛాయుత గమ్యం – కంబోడియా:

అంతగా ప్రచారం పొందని ఓ ప్రాంతాన్ని హిప్పీలు పాపులర్ చేసేయగలరు. అవును, మేము కంబోడియా గురించే మాట్లాడుతున్నాం. ప్రసిద్ధిచెందిన మరియు విపరీతమైన వాణిజ్యానికి థాయ్‌ల్యాండ్ పేరెన్నిక గన్నపుడు.. హిప్పీలు కంబోడియాకు ఇప్పటికీ పక్షుల కోసం, ప్రకృతి వాతావరణం మరియు అంతర్గత అందంకోసం వెళ్లిపోయారు. స్వేచ్ఛగా ఉన్న ఈ దేశము ఇప్పుడు హిప్పీల అభిమాన గమ్యం. మీరు దీన్ని చూడకుండా ఉండలేరు.

6. ద గల్ఫ్ ఆఫ్ అక్వాబా బ్యూటీ- దహాబ్, ఈజిప్టు:

అక్వాబా గల్ఫ్‌లోని స్పష్టమైన నీటిలో ఈతలు కొడితే, మీ స్నేహితులతో ఆనందంగా గడపడం, గుడారాలలో నక్షత్రాల క్రింద నిద్రపోతున్న అనుభూతులు మరచిపోలేనివి. ఇవి దహాబ్‌ను ఆకర్షణీయంగా మార్చేశాయి. హిప్పీ జీవన శైళి అనుభవించడానికి ఇది ఒక గొప్ప ప్రాంతం. ఇక్కడకు వచ్చేసినట్లుగా ఇప్పటికే మీరే ఊహించుకోవడం లేదా?

7. కళాత్మకత పట్టణం – నెల్సన్, కెనడా:

లక్ష్యం లేకుండా జీవించే శైలిని ఇంకా సజీవంగా ఉంచిన కళాత్మకత పట్టణం నెల్సన్. చుట్టారా మంచు పర్వతాలతో ఉన్న ఈ ప్రాంతం పుష్కలమైన కాఫీ గృహాలతో, వారసత్వ నిర్మాణాలతో నెల్సన్ అందమైన నగరంగా విరాజిల్లుతోంది. హిప్పీలు కోరుకునే ప్రశాంతత ప్రేమ మరియు ఆనందాలకు ఇది నిర్వచనం.

8. మాయ చేసే మనోజ్ఞత- తులుం, మెక్సికో:

పురాతన శిధిలాల, అద్భుతమైన తీర ప్రాంతాల మరియు మనోహరమైన రెస్టారెంట్లు యొక్క అద్భుత మిశ్రమమైన ప్రాంతం తులుం. హిప్పీల స్వర్గంగా నిలిచిన ఈ ప్రాంతం అసలైన అందంతో నిండినా ఇంకా పూర్తిగా ప్రాచుర్యం పొందలేదు. ఇక్కడ బిస్ట్రోలు మరియు బార్లు మరియు స్థానిక మార్కెట్లలో అనేక కలల వస్తువులు మరియు పలు సేంద్రీయ వస్తువులు లభిస్తాయి.

9. హిప్పీ స్వర్గం – ఒలింపియా, వాషింగ్టన్:

హిప్పీల సహజ జీవనం, లక్ష్య రహిత వాతావరణం మీకు ఒలిపింయా పరిచయం చేస్తుంది. ఈ నగరం ఉత్తమ హిప్పీ ప్రాంతంగా ఉంది. భారీగా హిప్పీ జనాభా గల ఈ ప్రదేశం, వారు శాంతియుతంగా నివసించడానికి అనుకూల ప్రదేశం. సేంద్రీయ పొలాలు, బలమైన సమాజం, విభిన్న కోర్సులు అందిస్తూ గ్రేడ్స్ లేని ఒక డిగ్రీ కాలేజ్, ఇక్కడ ఉన్నాయి. హిప్పీల కొరకు ఉత్తమ ప్రదేశాలలో ఒలింపియా ఒకటి.

10. యు.ఎస్.ఏ.లో ఉత్తమం – యూజీన్, ఒరెగాన్:

యూజీన్ యు.ఎస్.ఏ.లో అత్యంత కళాత్మకత నగరం. ఫ్రీ విల్లీలు మరియు గంజాయి యొక్క వాసనలు ఇక్కడకు దూరం కావు. యూఎస్ఏలో యూజీన్ హిప్పీల అభిమాన గమ్యం అనేందుకు ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా ఇక్కడ ఉండాలనుకుంటున్నారా?

11. కళాకారుల వేదిక – బిస్బే, అరిజోనా:

బిస్బీ హిప్పీ గమ్యస్థానంగా ఉంది. ఇది పూర్తిగా కళాకారులు చిత్రించిన మాదిరిగా ఉండే అనేక రంగులలో ఉండే పట్టణం. ఇది మెక్సికన్ సరిహద్దుకు సమీపంలో హిప్పీల కోసం గల ఒక విడిది ప్రదేశం. వారు ఇక్కడ అనేక ఉత్సవాలను జరుపుకుంటారు. కళాకారులు, కవులు అనేక కారణాల కోసం ఇక్కడకు చేరతారు.

12. ప్రతీ పర్యాటకుడి కల – ఎల్ బోల్సన్, అర్జెంటీనా:

పెంపకం యొక్క సమృద్ధి, తేలికపాటి వాతావరణంతో పాటు.. బాగా నిద్రించే పట్టణం ఎల్ బోల్సన్. ఇవన్నీ ఈ పట్టణాన్ని గొప్ప హిప్పీ గమ్యస్థానంగా చేసేశాయి. ఇక్కడ ఉన్నపుడు ‘బోస్క్ టాలడో’ అనే కలప కళతో నిండిన ఎత్తైన అడవిని మిస్ కాకండి. కచ్చితంగా ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

13. హిప్పీల మనసు – చెఫ్‌చౌయెన్, మొరాకో:

చెఫ్‌చౌవెన్ హిప్పీలకు నెలవు. ఇది ఒక దాచిఉంచబడిన ప్రదేశం. హిప్పీ గమ్యస్థానంగా దీనికి గుర్తింపు లేదు. కానీ మీరు నగరంలోకి ప్రవేశించినప్పుడు, అది హిప్పీ దాని నిర్లక్ష్య స్ఫూర్తి, నవ్వుతూ ఉండే స్థానికులు, హస్తకళ ఉత్పత్తులు వంటివి మీకు కనిపిస్తాయి. మీరు ఏం చేయకపోయినా ఇక్కడ మీరు సంతోషంగా ఉండగలరు!

14. స్వేచ్ఛ – ఆమ్‌స్టర్‌డాం, నెదర్లాండ్స్:

ఐరోపాలో ఆమ్‌స్టర్‌డదామ్ హిప్పీలు గల ప్రదేశం. స్వేచ్చా ఔషధ విధానాలు మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛతో, ఆమ్‌స్టర్‌డామ్ బహిరంగంగా కళలను అంగీకరిస్తుంది.

15. హిప్పీల పారవశ్యం – నింబిన్, ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియాలో నింబిన్, ప్రపంచంలోని ప్రతి హిప్పీ యొక్క ఆనందకరమైన కేంద్రంగా ఉంది. ఇక్కడ హిప్పీలు ఉచిత ప్రేమ, స్వేచ్ఛ, సానుకూల శక్తి, మరియు శాంతి కోసం సంచరిస్తుంటారు. హిప్పీలు నింబిన్‌లో శాంతి మరియు ప్రశాంతతను పొందుతారు.

16. హిప్పీ రాజధాని- ఈక్వెడార్:

దక్షిణ అమెరికా‌లోని ఈక్వెడారి హిప్పీ రాజధానిగా పేరు పొందింది. ఇది అద్భుతమైన పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. బడ్జెట్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. హస్తకళల నగలు, దుస్తులు, ఆసక్తికరమైన పబ్‌లు, విశ్రాంతి పొందిన వైఖరి ఈ ప్రదేశం హిప్పీలకు స్నేహపూర్వకంగా చేస్తుంది. ఈక్వెడార్‌లోని క్యిటో.. హిప్పీలలో చాలా ఆదరణ పొందింది.

17. గ్రాఫిటీ అండ్ గ్లామర్ – క్రిస్టియానా, డెన్మార్క్:

క్రిస్టియా 80వ దశకానికి చెందిన హిప్పీ ప్రదేశం. గ్రాఫిటీ గోడలు మరియు ఆహ్లాదకరమైన అంచులతో, నగరం యొక్క సుందరమైన సౌందర్యం అసమానమయినది.

18. ఆరంభం నుంచే- అరెంబిప్, బ్రెజిల్:

హిప్పీ ఉద్యమం పుట్టినప్పటి నుండి హిప్పీ సంస్కృతిని అనుభవిస్తున్న బ్రెజిల్‌లోని ఓ చిన్న పట్టణం అరెంబిప్. సామాజిక జీవనం, బోహేమియన్ సంగీతం, ఇష్టానికి అనుగుణం వాతావరణం మరియు రంగురంగుల గ్రాఫిటీ హిప్పీ సంస్కృతిని పూర్తిగా సమర్థిస్తాయి.

19. చల్లని ప్రతికూల సంస్కృతి – బెరెయ, కెంటుకీ:

ప్రతికూల సంస్కృతి భావనకు ముందు కూడా హిప్పీల యొక్క ప్రతికూల సంస్కృతికి కేంద్రంగా బెరెవా ఉంది. ఈ నగరం సేంద్రీయ రైతులు, కళాకారులు, రచయితలు మరియు సాంఘిక కార్యకర్తలకు కేంద్రం.

20. శాశ్వతంగా 60లు- మిస్సోలా, మోంటానా:

హిప్పీడమ్‌ను పూర్తిగా మద్దతు ఇచ్చే నగరం మోంటానాలోని మిస్సోలా. ఇక్కడ ప్రభుత్వం గంజాయి కేసుల అరెస్టులు తగ్గించడానికి కష్టపడి పనిచేసింది. పొడవాటి జుట్టుతో మీకు నచ్చిన విధంగా ఉండేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.