Travel Blog by Thomas Cook India

ఉదయపూర్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన 8 ప్యాలెస్ హోటల్స్

రాజస్థాన్‌ను తలచుకోగానే రాజరికం ఉట్టిపడే కోటలు, ప్యాలెస్‌లు, పోరాట యోధులు, సుందర రాణుల గుర్తుకురావడం సహజం. ‘ల్యాండ్ అఫ్ కింగ్స్’గా పేరొందిన ఈ ప్రాంతం తన ఆతిథ్యంతో పర్యాటకులకు రాజసాన్ని చవి చూపిస్తుంది. అయితే ఇందుకోసం మ్యాజెస్టిక్ ప్యాలెస్ హోటల్స్‌లో గడపడమే ఉత్తమమైన మార్గం. ‘మహారాజ భోగాలు’ నిజ జీవితంలో ఆస్వాదించగల ప్రాంతం ఇది. రాజస్థాన్ హాలిడే ప్యాకేజ్‌లలో భాగంగా సందర్శించాల్సిన ఉదయపూర్‌లోని 8 సుందరమైన ప్యాలెస్ హోటల్స్‌‌ గురించి తెలుసుకుందాం.

1. తాజ్ లేక్ ప్యాలెస్ :

దేశంలోనే సుందరమైన నగరాల్లో ఒకటైన ఉదయపూర్‌లో.. అందం, ఆకర్షణలకు అసలైన ప్రతీక తాజ్ లేక్ ప్యాలెస్. పిచోలా లేక్‌ మధ్యలో ఉన్న ఈ ప్యాలెస్ హోటల్.. మీ హృదయాలను తాకుతుంది. ఇక్కడ అందించే ఆతిథ్యం, చూపించే మర్యాద, గులాబీ రేకుల సువాసనలు వెదజల్లే పన్నీరు జల్లుతూ అతిథులను ఆహ్వానించే తీరు.. తాజ్ ప్యాలెస్ లేక్ ఆతిథ్యాన్ని నిర్వచిస్తాయి. మరిచిపోలేని అనుభూతి అందించే బోట్ షికారు, రిలాక్సింగ్ స్పా, వినసొంపైన సంగీతం ఈ హోటల్ ప్రత్యేకతలలో కొన్ని మాత్రమే. రాజస్థాన్ టూరిజంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాటిలో ఈ హోటల్ కూడా ఒకటి.

2. ది లలిత్ లక్ష్మి విలాస్ ప్యాలెస్:

భరత్ పూర్‌లో ఉన్న లలిత్ లక్ష్మి విలాస్ ప్యాలెస్.. అత్యంత సుందరమైన 100 ఏళ్ల పురాతనమైన రాజ భవనం. వైస్రాయ్‌లకు, ఇరాన్ – ఆఫ్ఘనిస్తాన్ రాజులకు ఆతిథ్యం ఇచ్చిన ప్యాలెస్ ఇది. 1994లో దీన్ని హెరిటేజ్ హోటల్‌గా మార్చగా.. ఈ భవనంలో కొంత భాగంలో రాజ కుటుంబం ఇంకా నివాసం ఉంటోంది. రాజభవనంలోని ప్రతీ గదిలోనూ రాజరికం ఉట్టిపడుతుంది. ఉదయ్‌పూర్‌లోని అందమైన ప్యాలెస్‌ హోటల్స్‌లో ఇది ఒకటి.

3. అమెత్ హవేలి:

లేక్ పిచోలాకు పశ్చిమ తీరంలో ఉన్న ఈ సాంప్రదాయ బద్ధమైన హవేలిని మహారాజా జగత్ సింగ్ జీ నిర్మించారు. రాజ్‌పుత్‌ భవన నిర్మాణ శైలికి అసలు సిసలైన రూపం అమెత్ హవేలి. ఉన్నత వర్గానికి చెందిన అతిథులకు నివాసం, ఆతిథ్యం అందించడంలో ఈ హవేలికి ఎన్నో అవార్డులు దక్కాయి. అంబ్రాయి పేరుతో ఇక్కడ గల రెస్టారెంట్‌లో ఇండియన్, కాంటినెంటల్, చైనీస్ వంటకాలను వడ్డిస్తారు. రాజస్థాన్‌ టూర్ ప్యాకేజ్‌లో అమెత్ హవేలిని చేర్చడం మరచిపోకండి.

4. బొహెడా ప్యాలెస్:

మీరు ఇంటి నుంచి ఎంత దూరంగా ఉన్నా, తన అందం-ఆహ్వానంతో సొంత ఇంటిలో ఉన్న అనుభవాన్ని బొహెడా ప్యాలెస్ అందిస్తుంది. ఉదయపూర్ ఓల్డ్‌సిటీ మధ్యలో ఉన్నా, ఓ ప్రశాంతమైన రోడ్డులో ఈ ప్యాలెస్ దాగి ఉంటుంది. అనేక ఉద్యానవనాలు చుట్టూ ఉండడంతో, బొహెడా ప్యాలెస్‌లో ఉన్నపుడు ఎన్నో కిలకిలారావాలు ధ్వనిస్తాయి.

5. లేక్ పిచోలా హోటల్:

పిచోలా సరస్సు పశ్చిమ ఒడ్డున బ్రహ్మపురి ద్వీపంలో లెజెండరీ హోటల్ లేక్ పిచోలా హోటల్. పురాతనమైన జగదీష్ టెంపుల్, స్నానపు ఘాట్‌లు, కరకట్టలు, బాగోర్ కీ హవేలీకి ఎదురుగా ఉండడం ఈ హోటల్ ప్రత్యేకత.

6. కాంకర్వ హవేలి:

కాంకర్వ కుటుంబానికి చెందిన పురాతన సౌధం కాంకర్వ హవేలి. గత 180 ఏళ్లుగా ఈ సౌధంలో వారు నివాసం ఉంటున్నారు. ఉదయపూర్‌లో ఉన్న ఈ హోటల్‌ను ఇప్పటికీ కాంకర్వ కుటుంబ సభ్యులే నిర్వహిస్తుండడం విశేషంగా చెప్పాలి. ఈ హవేలిలోకి ప్రవేశించగానే, స్వర్గానికి మెట్లదారిలో అడుగుపెట్టిన భావన కలగడంలో ఆశ్చర్యం లేదు. అతిథులకు సౌకర్యాలు అందించడంలో ఆ కుటుంబం, ఉద్యోగులు ఎంతో నిబద్ధత పాటిస్తారు.

7. హోటల్ ఉదయగడ్, ఉదయపూర్:

గత 150 సంవత్సరాలుగా హోటల్ ఉదయగడ్‌ను నిర్వహిస్తూ పరిరక్షిస్తున్నారు. సాంప్రదాయ హవేలి పద్ధతులనే కలిగి ఉంటుంది. ఈ పురాతన సౌధం, చారిత్రక ఆనవాళ్లు, వీటితో పాటు లగ్జరీ అనుభవం మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఈ హోటల్‌లో బుకింగ్స్ కేవలం కొన్ని క్లిక్స్ దూరంలో మాత్రమే ఉన్నాయి. వెంటనే క్లిక్ చేయండి!

8.  జైవానా హవేలి:

మేర్వార్ మహరాణాలకు చెందిన జాగీర్‌దార్‌లలో ఒకరైన ఠాకూర్ జైవానా ఒకప్పటి నివాసం జైవానా హవేలి. ఇరవై నాలుగు గదులు గల జైవానా హవేలీ హోటల్‌లో విరజిమ్మే ఫౌంటెన్లు, ఆరావళి పర్వతాలు, ద్వీప ప్రాంతాలకు చెందిన చిత్రాలు దర్శనం ఇస్తాయి. ఈ హోటల్‌ పైకప్పుపై ఉన్న రెస్టారెంట్‌ నుంచి పోల్చలేని ఎన్నో సుందర దృశ్యాలను చూడవచ్చు.

ఈ రాయల్ ప్యాలెస్ హోటల్స్‌ మీకు రాజరిక అనుభవాలను అందించడమే కాదు, మరచిపోలేని అనుభూతులను మిగుల్చుతాయి. రాజస్థాన్ సాంప్రదాయ కళా నిర్మాణాలతో విశ్రాంతి పొందడంతో పాటు.. అక్కడి ఆతిథ్యంతో ఉత్తేజితం పొందడం ఖాయం.