Travel Blog by Thomas Cook India

ఈ 8 దేశాల్లో భారత కరెన్సీయే కింగ్

విదేశాల్లో ప్రయాణాలంటే ఖరీదైన వ్యవహారమే. యూఎస్ డాలర్.. యూరో వంటి కరెన్సీలు నానాటికీ తమ విలువ పెంచుకుంటున్నాయి. రూపాయితో పోల్చితే తెగ ఖరీదు అవుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణం అంటే అమ్మో అనుకుంటున్నారు చాలామంది. అలాగని రూపాయి విలువను తక్కువ అంచనా వేయకూడదు. యూఎస్ డాలర్, పౌండ్లతో పోల్చితే రూపాయి విలువ తక్కువ కావచ్చు కానీ.. అనేక దేశాల్లో రూపాయికి విలువ ఎఖ్కువ. ఇంకో విశేషం ఏంటంటే.. ఇండియన్ కరెన్సీతోనే పలు దేశాల్లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయచ్చు. అందుకే మీ గమ్యస్థానాల జాబితాలో ఈ ప్రాంతాలను కూడా చేర్చుకుని.. ఇండియన్ రూపాయితోనే ప్రపంచాన్ని చుట్టేయండి.

1. బెలారస్:

1 బెలారూసియన్ రూబెల్ = రూ. 35. 27
వీసా: భారత పాస్‌పోర్ట్ గలవారికి వీసా అవసరం
యూరోప్‌లో దాచి పెట్టబడిన ముత్యం బెలారస్. ఆ ఖండానికి దూరంగా ఉండే బెలారస్, యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడాన్ని గర్వకారణంగా భావిస్తుంది. సువిశాలమైన మైదానాలు, సుందరమైన నగరాలు, పట్టణాలతో కూడిన ఈ దేశం అద్భుతంగా ఉంటుంది. వృక్షజాతులు, జంతుజాలం ఇక్కడి ప్రత్యేకత.

 

2. వియెత్నా:

1 వియెత్నాం డాంగ్ = రూ. 0.0030
వీసా: భారత పాస్‌పోర్ట్ గలవారికి వీసా అవసరం
గ్రామీణ అడ్వంచర్స్‌కు, పచ్చని నీటికి, అందమైన ద్వీపాలకు, పట్టణ సౌందర్యానికి ప్రత్యేకం వియెత్నాం. ఇది విశిష్ట వారసత్వంతో ఉత్కంఠభరితమైన ప్రకృతి సౌందర్యం గల దేశం. బౌద్ధ పగోడాల ద్వారా ఈ దేశాన్ని అన్వేషించవచ్చు. విలక్షణమైన మరియు రుచికరమైన వంటకాలు ద్వారా వియెత్నాం సంస్కృతి రుచి చూడవచ్చు. ఫ్రెంచ్ కళా సౌందర్యం మరియు యుద్ధ మ్యూజియమ్స్ ఈ దేశ విశిష్ట ఆకర్షణలు. అంతే కాదు వియెత్నాం చరిత్ర గురించి తెలుసుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తాయి. వియత్నాం సౌందర్యాన్ని ఆస్వాదించడానికి తగినంత విదేశీ మారకం వెంట తెచ్చుకోవాల్సిందే.

 

3. ఐస్‌ల్యాండ్:

1 ఐస్‌ల్యాండ్ క్రోనా = రూ. 0.59
వీసా: భారత పాస్‌పోర్ట్ గలవారికి వీసా అవసరం
ఐస్‌ల్యాండ్, ప్రకృతి సౌందర్యంతో నిండిన ఒక చూడచక్కని దేశం. ఉత్తరం వైపు ఉన్న ఈ గమ్యస్థానం ప్రకృతి ప్రేమికులు.. వాతావరణ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రసిద్ధి చెందింది. మీరు ఐస్‌ల్యాండ్ అందంలో మునిగితేలడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఐస్‌ల్యాండ్ యొక్క ఒక క్రోనా విలువ రూ. 0.59 మాత్రమే.

 

4. శ్రీలంక:

1 శ్రీలంక రూపాయి = రూ. 0.45
వీసా: ఎలక్ట్రానిక్ ట్రావెల్ అసోసియేషన్
హిందూ మహాసముద్రం ముద్దాడుతున్నట్లుగా ఉండే శ్రీలంక, మిమ్ములను మంత్రముగ్ధులను చేసే మాయాజాలం కలిగి ఉంటుంది. బీచ్‌లను తెగ మెచ్చే వారిని ఇక్కడ బీచ్‌లు స్వర్గం మాదిరిగా ఉంటాయి. పురాతన శిధిలాలు, సాదరంగా స్వాగతం పలికే ప్రజలు, అందమైన వన్యప్రాణులతో శ్రీలంక అలరారుతుంద. హిందూ మహాసముద్రంలో ఉండే ఈ ముత్యం వంటి ప్రాంతం.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు మెచ్చే అత్యంత సుందరమైన దేశాలలో ఒకటి.

 

5. పరాగ్వే:

1 పరాగ్వే గౌరని = రూ. 0.012
వీసా: భారత పాస్‌పోర్ట్ గలవారికి వీసా అవసరం
పరాగ్వేలో కనిపించే పురాతన సౌందర్యం ఎంతో ఆకర్షణను కలిగి ఉంది, దీనికి సాటి లేదు అని చెప్పవచ్చు. చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తారు. కానీ ఇది ఎంతో అందమైన ప్రాంతం. ప్రామాణికమైన దక్షిణ అమెరికన్ అనుభవాన్ని కోల్పోతున్నారనే విషయాన్ని అనేకమంది తెలుసుకోవడం లేదు. మిమ్ములను ఎంతగానో ఆకట్టుకునే పరాగ్వే పర్యటనను మీరు అస్సలు కోల్పోకండి.

 

6. చిలీ:

1 చిలీ పెసో = రూ. 0.10
వీసా: భారత పాస్‌పోర్ట్ గలవారికి వీసా అవసరం
మీరు ఎన్నడూ చూడని శిఖరాలు, పరుగులు పెట్టే నదులతో నిండిన దేశం చిలీ. ఇది ఒక పర్వత నగరం. ఇక్కడ అడుగు పెడితే.. మీ మనసు ఇక్కడ నుంచి కదలనని మొరాయిస్తుంది. తిరిగి వెళ్లేందుకు తిరస్కరిస్తుంది. చిలీ పెస్సో విలువ రూ. 0.10 మానం కావడంతో.. బడ్జెట్‌లోనే చిలీ పర్యటనను పూర్తి చేయవచ్చు.

 

7. నేపాల్:

1 నేపాల్ రూపీ = రూ. 0.62
వీసా: భారత పాస్‌పోర్ట్ గలవారికి ప్రవేశం ఉచితం
పర్వతాలతో కప్పబడిన ప్రశాంతమైన ప్రాంతం నేపాల్. మీరు వేసే ప్రతి అడుగులోను మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ పొందే ప్రదేశం. మీరు ఎక్కువగా ఖర్చు చేయకుండానే నేపాల్ యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించవచ్చు. ప్రయాణంలో ఖర్చులు ఆదా అయ్యేందుకు మీ విమాన టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకోండి.

 

8. కంబోడియా:

1 కంబోడియన్ రియెల్ = రూ. 0.017
వీసా: భారత పాస్‌పోర్ట్ గలవారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం
అద్భుతమైన దేవాలయాలు గల కంబోడియాలో.. ప్రతీ చిన్న వివరం గురించి ఆమూలాగ్రం వివరించబడి ఉంటుంది. ఇక్కడి అరణ్యాలు, జలపాతాలు మిమ్మల్ని ప్రేమలో పడేలా చేస్తాయి. మీ పర్స్‌కు పెద్దగా భారం కలగకుండానే కంబోడియా సందర్శించండి. ఒక కంబోడియన్ రియెల్‌ విలువ రూ. 0.017 మాత్రమే. మీ కోసం ఒక స్వర్గం ఎదురుచూస్తోంది.

 

ఇప్పుడు భారత రూపాయి బలం మీకు తెలిసింది. ఈ జాపిపతా నుంచి కొన్ని గమ్యస్థానాలను ఎంచుకుని, ప్రపంచం నలుమూలలా ప్రయాణించడానికి సిద్ధం అవండి. ఎన్నో అందమైన దేశాలలో ప్రకృతిని అన్వేషించండి.