ప్రియమైన విద్యార్ధులారా.. విదేశాల్లో మీ విద్య కోసం మీ ఇంటిని విడిచిపెట్టేందుకు మీరు తప్పకుండా సిద్ధం కావాల్సిందే. ఉత్సాహంగా ఉన్నా, ఆందోళన దాచుకుంటూ ప్రయాణం తప్పదు. అయితే మీరు విదేశాలకు వెళ్ళే సమయానికి మీ ఖర్చులు, వ్యయాల కోసం తప్పనిసరిగా ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే, మీరు విదేశాల్లో చదువుకునే విద్యార్ధి అయితే, మీ ఆర్థిక లావాదేవీల కోసం సురక్షితంగా ఆయా దేశాలకు నగదు బదిలీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి అత్యంత అనుకూలమైన మరియు సమర్థవంతమైన మాధ్యమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
1. ట్రావెల్ కార్డ్‌లు – విదేశాల్లో ప్రయాణిస్తున్న విద్యార్థికి ఉత్తమ మార్గం:
ఉన్నత విద్య కోసం విదేశాల్లో ప్రయాణిస్తున్న విద్యార్థికి ఈ కార్డులు సరైన పరిష్కారం. ఇవి సురక్షితం. అంతే కాదు వివిధ కరెన్సీలతో ముందే లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిన్, చిప్ సహిత కార్డులు కావడంతో.. ఇవి నగదు కంటే చాలా సురక్షితమైనది. సాధారణంగా, ఈ కార్డులు మీ రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. విద్యార్థులు వారి ఎయిర్-టిక్కెట్ బుకింగ్స్, క్యాబ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయానికి తమ రుసుమును చెల్లించవచ్చు. ఈ కార్డులు ఎటిఎంలలో కూడా పనిచేస్తాయి. అయితే, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా వంటి కొన్ని దేశాలలో లావాదేవీలకు కొన్ని ఉపసంహరణ పరిమితులు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు మీ విత్‌డ్రాయల్స్‌పై రుసుమును వసూలు చేస్తాయి. కానీ వీటిని కొనుగోలు చేసిన రోజు నుండి మారకపు రేటుపై లాక్-ఇన్ సమయం ఉంది.
భారతదేశంలో నివసిస్తున్న తల్లిదండ్రులు / సంరక్షకులు కూడా ఆన్‌లైన్‌లో ఈ కార్డులను తిరిగి లోడ్ చేయవచ్చు. మీరు మీ ఖర్చులను పరిశీలించడానికి ఎస్ఎంఎస్ మరియు ఇ-మెయిల్ హెచ్చరికలను పొందవచ్చు.
2. డిమాండ్ డ్రాఫ్ట్:
ఫారిన్ కరెన్సీ డిమాండ్ డ్రాఫ్ట్ (FCDD), అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి అత్యంత ప్రభావవంతమైన, మరియు సాధారణంగా ఉపయోగించే మాధ్యమాలలో ఒకటి. దీన్ని పొందేందుకు నామమాత్రపు రుసుము ఉంది. దీనిలో సౌలభ్యం ఏంటంటే, సొమ్ము లబ్ధిదారుడి ఖాతాకు నేరుగా చెల్లించబడుతుంది. విశ్వవిద్యాలయం మరియు హాస్టల్ వసతి ఫీజు వంటి సాధారణ లావాదేవీలకు కూడా వీటిని ఉపయోగించవచ్చు.అయితే, చెల్లింపు యొక్క క్లియరింగ్ సమయం నుంచి దయచేసి లబ్దిదారుడి ఖాతాకు లోడ్ అవుతుందని గమనించండి.
3. వైర్ ట్రాన్స్‌ఫర్:
అంతర్జాతీయ ద్రవ్య లావాదేవీలు చేయడానికి వైర్ ట్రాన్స్‌ఫర్‌లు సులభమైన మరియు అత్యంత అనుకూలమైన మాధ్యమాల్లో ఒకటి. ఒక వైర్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు లబ్దిదారుని ఖాతాకు అవసరమైన కొన్ని వివరాలు అడగవచ్చు. నగదు పొందే వ్యక్తి బ్యాంకు ఖాతా వున్న ప్రాంతము, లబ్ధిదారుడు ఖాతా, బ్యాంక్ అడ్రస్, స్విఫ్ట కోడ్, ఇతర ఆర్థిక కోడ్‌ను కలిగి ఉన్న బ్యాంకు పేరు, లబ్దిదారుని ఖాతా సంఖ్య, లబ్దిదారుని చిరునామా, దేశం, బ్యాంక్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్ధులు విశ్వవిద్యాలయ రుసుమును త్వరగా చెల్లింపులను సౌకర్యవంతంగా వైర్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా చేయవచ్చు.
4. ట్రావెలర్స్ చెక్:
ట్రావెలర్స్ చెక్, అంతర్జాతీయ ద్రవ్య లావాదేవీలు చేసేందుకు అత్యంత సంప్రదాయ మరియు పురాతన మాధ్యమాలలో ఒకటి. అన్ని ప్రముఖ కరెన్సీలు సులభంగా అందుబాటులో ఉంటాయి. చోరీ జరిగినా.. వారు దీనిని ఉపయోగించలేరు. అందుకే మీరు చింతించాల్సిన అవసరం లేదు. మరో సానుకూల అంశం ఏమిటంటే, ట్రావెలర్స్ చెక్‌లకు గడువు తేదీ ఉండదు. అయితే, ప్రతికూల విషయం ఏంటంటే.. ఈ చెక్‌లను నగదుగా మార్చుకునేందుకు అందుబాటులో ఉన్న అమ్మకందారుల సంఖ్య పరిమితం.
5. పాత కరెన్సీ నోట్లు:
మీ విదేశీ లావాదేవీలను నిర్వహించేందుకు అత్యంత సంప్రదాయ మాధ్యమం. పెద్ద లేదా చిన్న మొత్తం అమ్మకందారులు వీటిని ఇవి విస్తృతంగా అంగీకరిస్తారు. ఇవి అన్ని సాధారణ ఖర్చులకు ఉపయోగపడుతాయి.
కాబట్టి, విదేశాల్లో ప్రయాణిస్తున్న విద్యార్ధిగా, మీ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి అన్ని సాంప్రదాయ పద్ధతులను మీరు తప్పక చేపట్టాలి. అంతేకాదు.. తెలివిగా ఖర్చు చేయవచ్చు.
రిఫరెన్స్:
ఎకనామిక్ టైమ్స్, 2017
ICICI బ్యాంక్
గమనిక: భారతదేశం యొక్క ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) పరిమితులకి లోబడి లావాదేవీలు జరుగుతాయని గమనించండి.