ప్రస్తుతం ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యమే. ఊపిరి పీల్చుకునేందుకు కాసింత స్వచ్ఛమైన గాలి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. మన జీవితం చాలా చిన్నది. చాలా అనుభవించాల్సి ఉంది. ఇంద్ర ధనుస్సు అందాలను, చెవులకు ఇంపైన శబ్దాలను అనుభవించాలంటే ఎక్కడెక్కడో వెతుక్కోవాలి. మీరు నెక్ట్స్ సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకుంటుంటే.. ఎకో ఫ్రెండ్లీ ప్రాంతానికి వెళ్లాలని భావిస్తుంటే.. ఈ ఆర్టికల్ కచ్చితంగా మీ కోసమే. మీ ప్రయాణ గమ్యస్థానాలుగా ఈ 10 ఎకో-ఫ్రెండ్లీ ప్రాంతాలను తప్పకుండా పరిశీలించాల్సిందే.
1. భూటాన్:
తమ దేశపు సహజమైన అందాలు, ప్రకృతి వనరులు, సంస్కృతికి భంగం వాటిల్లకుండా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది భూటాన్. ఇది కచ్చితంగా ఎకో-ఫ్రెండ్లీ మంత్రమే కదా!
2. న్యూజిలాండ్:
వైవిధ్య భరితమైన మొక్కలు, జంతు జీవనానికి ఆలవాలం న్యూజిలాండ్. లగ్జరీ ఎకో టూరిజంకు ఈ సుందరమైన ప్రాంతం ఎంతో గుర్తింపు పొందింది. పర్యావరణానికి హాని కలిగించడం అంటే.. వీరి మతానికి భంగం కలిగించినంతగా ఫీలయిపోతారు న్యూజిలాండ్ ప్రజలు!
3. కోస్టా రికా:
2021 నాటికి కర్బన రహితంగా మారనున్న తొలి దేశం కోస్టా రికా. వైవిధ్యమైన పుష్పాలు, జంతువులతో ఈ దేశం ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఆకాశంలో కనిపించే నక్షత్రాలు మనకోసమే మెరుస్తున్నాయా అనిపించేంతటి స్వచ్ఛమైన ఆకాశం దర్శనం ఇచ్చే ప్రాంతం ఇది.
4. అలాస్కా:
అటవీ ప్రాంతాన్ని చూడాలని తెగ ముచ్చట పడుతుంటే, భూప్రపంచంపై ఉన్న ప్రాంతాలలో అలాస్కాను మించిన ప్రదేశం మీకు దొరకదు. గ్లేసియర్లు, అద్భుతమైన వైల్డ్ లైఫ్, ఫిషింగ్, కయాకింగ్ వంటి ఎన్నిటినో డెనాలి నేషనల్ పార్క్‌లో చేసేయవచ్చు. మీరు కాదనలేని ఎకో-టూర్ ఇది.
5. శాంటా క్రజ్ ద్వీపం, కాలిఫోర్నియా:
ప్రకృతిని మీ బాహువుల్లో బంధించేయాలని అనిపించే అత్యంత సుందరమైన ప్రాంతం శాంటా క్రజ్ ఐల్యాండ్. ఇక్కడి ప్రకృతికి మిమ్మల్ని ఎంతగానో మెప్పించేసే శక్తి ఉంది. ఈ ద్వీపంలో రెండు ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఓ భారీ లోయ, లోతైన ఇతర లోయలు.. ఏడాది మొత్తం వచ్చే వర్షపు చినుకులు, భారీ సముద్రపు గుహలు, విస్తరించిన బీచ్‌లు బోలెడన్ని ఉంటాయి.
6. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, బ్రెజిల్:
80,000 రకాల వృక్ష జాతులు, 3 కోట్ల రకాల జంతు జీవాలు ఇక్కడ నివాసం ఉన్నాయి. పింక్, గ్రే కలర్స్‌లో కూడా ఇక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తుంటాయి. మీ జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలను ఇక్కడ గడపవచ్చు!
7. డొమినికా:
ప్రకృతిపై విపరీతమైన ప్రేమ గలవారికి, హైకర్స్, డైవర్స్ కోసం ప్రత్యేకం డొమినికా. మీరు ఈ అంశాల్లో పర్ఫెక్ట్ అయినా కాకపోయినా, ఇక్కడి ప్రకృతి సౌందర్యం మాత్రం అత్యుత్తమం!
8. కెన్యా:
కెన్యాలో ఉండే సవన్నా అడవులలో కనిపించే జంతువులు మీకోసం ఎదురుచూస్తున్నాయి. పుష్ప కిరీటాలు మినహా, కనీసం ఇతరుల హలో కూడా వినిపించని స్వర్గం ఇది.
9. నార్వే:
నార్వేలో 5 పర్యావరణ ఆకర్షణలు ఉంటాయి. హార్దన్‌గెర్జ్ ఫోర్డ్, జోతున్‌హీమెన్ కొండలు, జీరన్ బీచ్‌లు, సాల్ట్ స్ట్రామెన్, ఫిన్ మార్క్‌లో కుక్కలతో స్లెడ్జింగ్ ఇక్కడికే సొంతం. మీరు వీటిలో ఇప్పటికీ ఏదీ చేయకపోతే, నార్వేలో చేసేందుకు బయల్దేరవచ్చు!
10. మాల్దీవులు:
ప్రిస్టైన్ ద్వీపాలు, రంగురంగుల కోరల్ రీఫ్స్, తాజాగా కనిపించే నీరు మాల్దీవ్స్ టూరిజంలో మాత్రమే లభిస్తాయి.
ట్రెండింగ్‌లో ఉండే పనులు చేసే ఉత్సాహం మీకుంటే.. ఈసారి ఎకో-ఫ్రెండ్లీ బాట పట్టేయండి. ప్రకృతికి ప్రేమికులుగా కాదు.. స్నేహితులుగా కూడా మారండి.