Travel Blog by Thomas Cook India

సెలవల్లో కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఇండియాలో 10 ఉత్తమ ప్రాంతాలు

మీరు కార్పొరేట్ ఉద్యోగి అయినా, విద్యార్థి అయినా లేదా బిజీగా పనిచేసే వ్యక్తి అయినా.. ప్రతీ వారికీ రోజువారీ రొటీన్ నుండి రిఫ్రెష్ మరియు చైతన్యం పొందటానికి ఒక సెలవు విడిది అవసరం. మీ ప్రియమైన వారితో ఒక అందమైన సెలవుదినాన్ని గడిపేందుకు.. రోజువారీ చర్యల నుంచి విరామం తీసుకోవడం కంటే మెరుగైనది ఏదీ లేదు. అందులోనూ సొంత దేశంలో పర్యటించడం కంటే ఆనందం మరేదీ ఉండదు. అందుకే మన దేశంలోని కుటుంబాలకు ఉత్తమ సెలవు గమ్యస్థానాల జాబితాను అందిస్తున్నాం.

కుటుంబాలకు భారతదేశంలో ఉత్తమ సెలవు గమ్యస్థానాలు

1.  న్యూఢిల్లీ:

భారతదేశంలో కుటుంబ సెలవు దినం కోసం అగ్రశ్రేణి గమ్యాలను గురించి మాట్లాడేటప్పుడు.. మ్యూజియమ్స్, వినోద పార్కులు, అసంఖ్యాకమైన స్మారక చిహ్నాలు, సుందరమైన తోటలు మరియు సరదాల కోసం అపరిమిత ప్రాంతాలు అనేక న్యూఢిల్లీలో ఉన్నాయి.

 

 

2. రాజస్థాన్:

 

 

అద్భుత పూర్వ సంస్కృతి, గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు శక్తివంతమైన కోటలు మరియు రాజప్రాసాదాలు గల రాజస్థాన్.. భారతదేశంలో కుటుంబ సెలవులకు తప్పక చూడవలసిన ప్రదేశం. కోటలు మరియు రాజభవనాలు మరియు సొగసైన హవేలీలలో రాజస్థాన్‌లోని ప్రతి నగరం దాని ప్రత్యేకమైన అందాలను కలిగి ఉంది.

 

3. సిమ్లా:

 

ఒకప్పుడు బ్రిటీషర్ల యొక్క వేసవి రాజధాని సిమ్లా. పిల్లలు మరియు కుటుంబాలతో కలిసి వెళ్ళడానికి అనువైన ప్రాంతం. ఆసక్తికరమైన కార్యకలాపాలు మరియు విహారయాత్రలతో భారత కుటుంబ సెలవు దినాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది.

4. గోవా:

 

మీరు కుటుంబంతో బీచ్ వెకేషన్ కోరుకుంటే, అందుకు గోవా ఉత్తమ గమ్యస్థానం. ఇదో మినీ భారత దేశం. దాని తీరప్రాంతాలు మరియు జల క్రీడల కార్యకలాపాల కోసం ప్రసిద్ధి చెందింది. సూర్యుని మనోజ్ఞత, ఇసుక, మరియు సముద్రాలు మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి.

5. ముస్సోరీ – కుటుంబాలకు భారతదేశంలో అత్యుత్తమ సెలవు గమ్యస్థానం:

 

ఈ ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ కుటుంబాల కోసం సెలవు గమ్యస్థానంగా బాగా ప్రాచుర్యం పొందింది. సుందరమైన దృశ్యాలు, గొప్ప ఆహారం, షాపింగ్ మరియు వినోద ఎంపికలు ఉన్నాయి.

6. ఔరంగాబాద్:

 

 

మహారాష్ట్రలోని ఈ చిన్న నగరంలో పర్యటించడం ద్వారా చరిత్రను తెలుసుకోండి. ఈ నగరం వైభవంగానే కాదు ఎన్నో అందాలతో నిండి ఉంది. శీతాకాలం ఉత్తమమైన సమయం మరియు అప్పటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

7. మున్నార్ – కుటుంబాల కోసం భారతదేశంలో ఉత్తమ సెలవు గమ్యస్థానం:

 

మున్నార్ ఎంత అందంగా ఉంటుందో మనకు తెలుసు, కాబట్టి ఈ స్థలాన్ని కుటుంబంతో సందర్శించటానికి అనువైన ప్రాంతమే. నగరంలో జీవితం యొక్క హడావిడిని పక్కన పెట్టి, ప్రకృతి ఒడిలో సమయం గడపడానికి ఈ స్థలాన్ని పిల్లలతో మున్నార్ సందర్శించండి.

8. అమృత్‌సర్:

 

అమృత్‌సర్ కుటుంబానికి మంచి అనుభవమే మరియు భారతదేశంలో కుటుంబ సెలవు గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పలు ప్రాంతాలను సందర్శించాలన్న మీ కుటుంబం ఆతృతను తీర్చే పలు అద్భుతమైన ఆకర్షణలతో నగరం నిండి ఉంటుంది.

9. వారణాసి:

 

వారణాసి లేదా బెనారస్ ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం. పవిత్ర గంగ ఘాట్‌లు ఉన్న ఈ నగరం అద్భుతమైన సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తాయి. వేలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం మరియు మార్మిక సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తోంది. శ్లోకాలు మరియు ప్రతిధ్వనులతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

10. హంపి:

 

దక్షిణ భారతదేశం మీ పిల్లల కోసం సంతోషకరమైన అనుభవం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తించిన హంపి.. గొప్ప చరిత్ర కలిగి ఉంది మరియు కుటుంబ సందర్శనకు అద్భుత అనుభవంగా ఉంటుంది.

భారతదేశంలోని అగ్రశ్రేణి సెలవు గమ్యస్థానాల జాబితా.. త్వరలోనే టూర్ ప్లాన్ చేసేందుకు మీకు స్ఫూర్తినిస్తుంది. ఇందుకోసం మా ఉత్తమ ఎంపికలను చూడండి.