Travel Blog by Thomas Cook India

ఇండియా నుండి భూటాన్ చేరుకోవడం ఎలా?

స్థూల జాతీయ సంతోష సూచీ ద్వారా అభివృద్ధిని లెక్కించే ఏకైక దేశం భూటాన్. అందుకే దీనికి ‘ప్రపంచంలోని ఉత్తమమైన దేశం’ అనే గుర్తింపు ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి పర్యాటకులు భూటాన్ సందర్శించడానికి వస్తారు. ఇక్కడి పురాతన మఠాలు అన్వేషించడానికి మరియు సాహసోపేతమైన పర్వతారోహణ సాహసయాత్రలు చేసేందుకు వస్తారు. భూటాన్ పర్యాటకం రోజురోజుకూ వృద్ధి చెందుతున్నప్పటికీ, దాని సహజ వనరులు, పర్యావరణం, సంస్కృతి మరియు వారసత్వాన్ని కాపాడేందుకు సంపూర్ణ రక్షణ విధానాలు అవలంబిస్తున్నారు. ఈ సంతోషకరమైన దేశాన్ని సంర్శించాలని అనుకుంటున్నారా? భూటాన్ చేరుకోవడం ఎలాగో తెలుసుకోవాలని భావిస్తున్నారా? మీ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి.

భారత్ నుండి భుటాన్ చేరుకోవడం ఎలా

భారతదేశం నుండి భూటాన్ చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. గాలి మరియు రోడ్డు ద్వారా భూటాన్ వెళ్లవచ్చు. భారతీయ పాస్‌పోర్ట్ కలిగినవారికి భూటాన్‌లో ప్రవేశించేందుకు ఎలాంటి వీసా అవసరం లేదు. ప్రవేశం కోసం అనుమతి పొందడానికి మీ పాస్‌పోర్ట్ లేదా ఓటరు ఐడీ కార్డును చూపిస్తే సరిపోతుంది. కష్టాలన్నీ వదిలేసి భూటాన్‌కు ఓ హాలిడే ప్యాకేజీ బుక్ చేసుకోండి.

1. ఆకాశ మార్గంలో భూటాన్ చేరుకోవడం ఎలా?

భూటాన్లో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం పరో. ఇక్కడకు ఢిల్లీ, బాగ్‌డోగ్ర, గౌహతి మరియు ముంబైల నుంచి నేరుగా విమానాలు ఉన్నాయి. కోల్కతా నుండి పరో వరకు నేరుగా విమాన ప్రయాణం చేయవచ్చు. కోలకతా నుండి భూటాన్ చేరుకోవటానికి అనేక విమానాలు అందుబాటులో ఉన్నాయి. కోల్‌కతా, బాగ్‌డోగ్రాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబైల నుండి విమానాలు తక్కువగా ఉంటాయి. భూటాన్ యొక్క జాతీయ వైమానిక సంస్థ ద్రూక్ ఎయిర్ ఎయిర్‌లైన్స్. ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు నేపాల్ ప్రయాణంలో ఉన్నపుడు మీరు ఖాట్మండు నుండి పరోకి బుక్ చేసుకోవచ్చు. ప్రపంచంలో నాలుగు ఎత్తైన పర్వతాలపై విమానం ప్రయాణిస్తున్నందున మీరు ఖాట్మండు నుండి పరో వరకు అత్యంత ఉత్తేజకరమైన ప్రయాణం అనుభవించవచ్చు. భూటాన్‌లోని ఇతర ప్రధాన నగరాలు.. దేశీయ విమానయాన సంస్థలతో అనుసంధానించబడి ఉన్నాయి.

 

2. రోడ్డు మార్గం ద్వారా భూటాన్ చేరుకోవడం ఎలా?

భూటాన్ రహదారి యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారా? రహదారి ద్వారా భూటాన్ చేరుకోవడం ఎలాగో తెలుసుకోండి.
పశ్చిమ బెంగాల్లోని జైగాన్ సరసన ఉన్న ఇండో భూటాన్ సరిహద్దులో ఉన్న భూసునులోని.. భూటాన్ రాయల్ గవర్నమెంట్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ నుంచి రోడ్డు ద్వారా భారతీయులు భూటాన్‌కు వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చే ‘ప్రవేశ అనుమతి’ భారతీయ పర్యాటకుడిని పరో మరియు తుంఫు సందర్శించడానికి మాత్రమే. తుంఫు మరియు పారో దాటి వెళ్లాలని అనుకుంటే, తుంఫులో భూటాన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ నుండి అనుమతిని పొందాలి. రాయల్ భూటాన్ కాన్సులేట్ కార్యాలయంలో కోలకతా నుండి వీసా తీసుకునే అవకాశం ఉంది. ఇది మీ సందర్శనకు 10-12 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

 

భూటాన్‌లో సందర్శన స్థలాలు

రహదారి ద్వారా భూటాన్ చేరుకోవడానికి, మీరు భారతదేశంలో మూడు సరిహద్దు పాయింట్ల ద్వారా వెళ్ళాలి. అవి.. ఒకటి) జైగాన్- ఫుయెన్‌షాలిగ్ సరిదద్దు, రెండు) గెలెఫు మూడు) సాండ్రప్ జోంగ్‌ఖర్. జైగాన్ – ఫుయెన్‌‌షాలిగ్ సరిహద్దు చాలామంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. ఎంట్రీ పర్మిట్‌ కూడా సులభంగా పొందవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు స్థానిక బస్సుల ద్వారా ప్రయాణం చేయవచ్చు. లేదా భూటాన్లో ప్రయాణించడానికి కారు లేదా జీపును అద్దెకు తీసుకోవచ్చు. బాగ్డోగ్ర విమానాశ్రయము నుండి ఫుహెన్‌షాలిగ్ చేరుకోవడానికి 4 గంటల సమయం పడుతుంది మరియు ఫుహెన్‌షాలిగ్ నుండి తింఫు చేరుకోవడానికి సుమారు 6 గంటలు పడుతుంది. బాగ్డోగ్ర, న్యూ జల్పయిగురి మరియు సిలిగురి నుండి ప్రైవేటు టాక్సీలు, బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి సెవోక్ రోడ్ వద్ద జాతీయ రహదారి31 ను కలుపుతుంటాయి, తింఫుకు వెళ్తాయి.

భూటాన్ డ్రూక్ ట్రెక్ మీ జాబితాలో ఉందా?
ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశానికి ఒక యాత్రను ప్లాన్ చేసుకోవాలా? మా భూటాన్ టూర్ పాకేజీలను బుక్ చేసి రాజరిక విశ్రాంతి కేంద్రాలను అన్వేషించండి.