Travel Blog by Thomas Cook India

కేరళ బ్యాక్ వాటర్స్ – అత్యుత్తమ 6 స్థలాలలో బ్యాక్‌వాటర్ పర్యటన ఆనందించండి

మీరు ప్రపంచవ్యాప్తంగా ఎంత విస్తృతంగా పర్యటించినా, దేవుని సొంత దేశం అనే బిరుదు ఉన్న కేరళతో, భూమిపై మరే ప్రాంతాన్ని స్వర్గంతో పోల్చలేము. కేరళకు అంత ఆకర్షణను ఎందుకు అంటే అందుకు ప్రధాన కారణం ప్రకృతి. తప్పక సందర్శించవలసిన స్థలాల జాబితాలో కేరళలోని బ్యాక్‌వాటర్స్ ఉంటాయి. ప్రశాంత జలాలలో పులకరింపచేసే భావం కలుగుతుంది. మీరు కేరళ పర్యటనకు వెళ్ళినట్లయితే, దాని అత్యంత ఆకర్షణ అయిన బ్యాక్ వాటర్స్ గురించి తెలుసుకోవలసిన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

1. మంత్రముగ్ధులను చేసే అలెప్పీ:

కేరళకు వచ్చినప్పుడు మీరు నిజంగా ఒక అభిమాన స్థలాన్ని ఎంచుకోవడం కష్టం. అలెప్పి బ్యాక్ వాటర్స్ వైభవం ఖచ్చితంగా మిగిలిన ప్రాంతాలతో పోల్చితే అద్భుతం. అసలు ఈ ప్రాంతాన్ని తూర్పు వెనిస్ అని ఎందుకు అంటారో ఎవరికీ తెలియదు. అనేక అనుసంధానించబడిన వంతెనలు మరియు కాలువలతో బ్యాక్‌వాటర్స్ ప్రియులకు అసలు సిసలైన పడవ ప్రయాణ అనుభవాన్ని ఇస్తుంది. కేరళలో ఉన్నప్పుడు అల్లెప్పి బ్యాక్ వాటర్స్ సుందరతను చూడడం మరువద్దు.

కేరళ బ్యాక్ వాటర్స్ ఆనందంగా గడిపేందుకు కేరళ హాలిడే పాకేజీలను బుక్ చేసుకోండి.

2. మెరిపించే కుమారకోం:

మడ అడవులు, వరి పొలాలు మ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. కేరళలోని అందమైన ప్రదేశాలలో కుమారకోం ఒకటి. విస్తృతమైన కాలువలు మరియు ప్రవాహాల ద్వారా నాటు పడవలు సులభ ప్రయాణాలకు తోడ్పడతాయి. పరిసరాలు, పచ్చని పచ్చదనం మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు ప్రయాణంలో వలస పక్షులు కనిపించే పక్షుల అభయారణ్యంలో ప్రయటిస్తారు.

3. గ్రామీణ కసరగోడ్:

కసరగోడ్ ఒక అందమైన, ప్రాచీన గ్రామం. ఇది సందర్శకులకు బ్యాక్‌వాటర్‌ పర్యటన అవకాశం అందిస్తుంది. కేరళలోని ఇతర ప్రదేశాలలో ఎక్కువ పర్యాటక కార్యక్రమాల ద్వారా ధ్వంసం అయినట్లుగా అనిపిస్తుంది. మీరు శాంతమైన పడవ ప్రయాణంలో గ్రామీణ సందర్శనలో మునిగిపోవాలనుకుంటే, ఇక్కడి సంప్రదాయం చెక్కుచెదరకుండా కనిపిస్తుంది. కసరగోడ్‌కి వెళ్లి, స్థానికుల వాస్తవిక జీవనశైలిని దగ్గరగా చూడవచ్చు.

4. మురిపించే కొల్లాం:

కేరళ ప్రాంతాలు మీకు దక్షిణ భారత దేశంలో ఉన్న ఉత్తమమైన గమ్యస్థానాలకు సజీవ సాక్ష్యాలు. కేరళలోని కొల్లం మిమ్మల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచదు. వాటర్ లిల్లీలు, కాలువలు ప్రశాంతతను కలిగించే పక్షి అరుపులు మీకు జీవితకాలం గుర్తుండిపోయే అనుభూతులను ఒక్క పర్యటనలోనే అందిస్తాయి. అత్యంత సుదీర్ఘమైన బ్యాక్‌వాటర్ టూర్‌ను కొల్లాం అందిస్తుంది. ఇక్కడి హౌస్‌బోట్‌ పర్యటన ఎనిమిది గంటల పాటు కొనసాగుతుంది. హౌస్‌బోట్ రైడ్‌లో తాజాగా అందించే ఆహారం మిమ్మల్ని సేద తీరుస్తుంది. ఒక నిర్మలమైన పర్యటన మరియు గొప్ప ఆహారంతో, మరి ఇక ఏదీ అవసరం లేదనే భావన కలిగిస్తుంది.

5. ఆకట్టుకునే కుట్టనాడ్:

కుట్టనాడ్ గురించి ఒక గొప్ప వాస్తవం సముద్ర మట్టం కంటే దిగువన ఉంటుంది. ఇది భారతదేశంలో అత్యల్ప ప్రదేశం. ఈ ప్రదేశం అలపూజ జిల్లాలో భాగమైనందున, ఇది బ్యాక్ వాటర్స్ హృదయంలో ఉంది. మీరు వరి పొలాలు, అద్భుతమైన పరిసరాలలో గడపడం ద్వారా ఈ ప్రదేశం వైభవం మరియు ప్రశాంతతను తెలుసుకోవచ్చు.

6. కనుల విందైన వలియపరంబా:

వాలియపరంబాలో ఉన్న బ్యాక్‌వాటర్స్ ఒక ఆకర్షణీయమైన దృశ్యాన్ని అందిస్తాయి. కేరళ బ్యాక్‌వాటర్స్‌లో మూడవ అతిపెద్ద వాటర్ ప్రాంతంగా ఇది చెప్పబడుతుంది. ఇప్పటికీ మానవులు మరియు వాణిజ్యపరంగా అంతగా రద్దీ ఉండని ప్రాంతం. అందుచే సందర్శకులు ఎక్కువగా ఈ స్థలాన్ని సందర్శించడం వలన ప్రశాంతత పొందుతారు. అమ్మకందారులు వారి వివిధ కార్యకలాపాలకు ఉపయోగించే సాంప్రదాయక సామాగ్రిని నేటికి కూడా ప్రయాణికులు చూడ వచ్చు.

హౌస్‌బోట్ అద్దెకు తీసుకోండి

 

కేరళ బ్యాక్‌వాటర్స్ అందాలను పూర్తిగా అన్వేషిస్తూ మంత్రముగ్ధులు అయేందుకు ఒక హౌస్‌బోట్‌ను అద్దెకు తీసుకోవడం ఉత్తమ మార్గం. అనేక హౌస్ బోట్ లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ కోసం ఉత్తమమైనదాన్ని ఎంచుకొని, అనుసంధానించబడిన జలమార్గాలు, సరస్సులు, నదులు మరియు కాలువల మధ్య జలమార్గంలో పర్యటించవచ్చు. సంప్రదాయ కెట్టువాలం వలె కనిపించే హౌస్‌బోట్లు కూడా ఐదు నక్షత్రాల హోటళ్ళతో పోల్చినప్పుడు మీరు అనిర్వచనీయమైన సేవలను అందిస్తాయి. ఇక్కడ మీరు సౌకర్యవంతమైన వసతి మరియు సుందరమైన సముద్ర ఆహార వంటకాలు లభిస్తాయి.

కేరళ బ్యాక్ వాటర్స్‌ను దాని అద్భుతమైన వైభవం చూడడానికి, మీరు హౌస్‌బోట్ తీసుకోవలసి ఉంటుంది. ట్రావెల్ ఏజెంట్లు మరియు హోటళ్ళు మీ కోసం కృషి చేసి ఇందుకు అవకాశం కల్పిస్తారు. వ్యక్తులు, హనీమూన్ లేదా సమూహాలకు కూడా పడవ పర్యటనలు అందుబాటులో ఉన్నాయి. సీజన్ ఆధారంగా బ్యాక్ వాటర్ పర్యటన ప్యాకేజీలు వేర్వేరుగా ఉంటాయి. హౌస్ బోట్లు స్థిర షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయి. రాత్రిపూట కూడా అద్దెకు లభిస్తాయి. కొన్ని రకాల బోట్స్‌ను ఆరు నుంచి ఎనిమిది గంటల వ్యవధి కోసం అద్దెకు తీసుకోవచ్చు. మీ ప్రయాణ అవసరాలు, బ్యాక్ వాటర్‌లో ఎంత సమయం గడపాలని మీరు అనుకుంటున్నారనే అంశాల ఆధారంగా, మీరు ఒక రోజు లేదా ఒక వారం పాటు కూడా హౌస్‌బోట్‌ను అద్దెకు తీసుకోవచ్చు.

కేరళ బ్యాక్‌వాటర్స్ సందర్శనకు ఉత్తమ సమయం

మీరు ఏడాదిలో ఏ సమయంలో అయినా కేరళ సందర్శించి బ్యాక్ వాటర్స్‌ను చూడవచ్చు. కేరళ హనీమూన్ ప్యాకేజీలు డిసెంబర్ నుంచి జనవరి మధ్య వరకు ఉంటాయి. ఈ సమయంలో వాతావరణం చల్లగా మరియు పొడిగా ఉంటూ, సందర్శనల కోసం పరిపూర్ణంగా ఉంటుంది. మార్చి నుండి మే నెలలో వాతావరణం తేమగా ఉంటుంది. కానీ మీరు ఈ వాతావరణంలో ప్రయాణం చేయటానికి ఇష్టపడే వ్యక్తి అయితే, మీరు కేరళ బ్యాక్ వాటర్స్‌కు వెళ్ళవచ్చు.

కేరళ టూరిజం గైడ్ మీ సెలవుదినాలను చిరస్మరణీయంగా చేయగలరు. అందుకే మీరు మీ ట్రిప్ ప్లాన్ చేయాలని మరియు జ్ఞాపకాలను జీవితకాలం బంధించాలని భావిస్తే.. కేరళ దర్శించండి.