బోలెడంత బిజీ జీవితం, ఒత్తిడి చేసే డెడ్‌లైన్స్, సుదీర్ఘమైన మీటింగ్స్, విసుగెత్తించే కాన్ఫరెన్స్ కాల్స్, కుప్పలు తెప్పలుగా ఒత్తిడి.. మొత్తం మన జీవితం అంతా బంధించినట్లుగానే ఉంటుంది. నగర జీవితం అంటే ఇక ఇంతే అనిపించేస్తుంది. ఇలాంటి అన్నిటికీ కాస్త అయినా సెలవు ఇచ్చేసి, వేసవిలో అందమైన ప్రకృతి మధ్య జీవితం గడపాలని అనిపించడం సహజం. అడవులు, చెట్లు మధ్య జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అటవీ రాజులా మీరు గడిపే అవకాశాన్ని ఇస్తున్న వైల్డ్‌లైఫ్ రిసార్టులు ఇవే:
1. బెంగాల్ టైగర్ గర్జనలు:
రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో ఉన్న టెంట్ రిసార్ట్స్‌లో అమన్-ఐ-ఖాస్ రిసార్ట్ అద్భుతంగా ఉటుంది. మీరు బోన్‌ఫైర్ ముందు ఆనందంగా గడుపుతూనే, కొంత దూరం నుంచి వినిపించే బెంగాల్ టైగర్ గర్జనలను ఆలకించవచ్చు. పచ్చదనంతో గడిపే అవకాశం కల్పించే పర్ఫెక్ట్ రిసార్ట్ ఇది. వేసవిలో అద్భుమైన టూర్స్ కోసం రాజస్థాన్ హాలిడే ప్యాకేజ్‌ల కోసం విజిట్ చేయండి.
2. సున్నితంగా అటవీ జీవితం:
గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఉన్న మేన్‌ల్యాండ్ జంగిల్ లాడ్జ్.. అడవులు, ప్రశాంతతల సరైన మిశ్రమం. అడవుల్లో జీవితానికి కళను కూడా కలపాలంటే ఈ రిసార్ట్‌కు వెళ్లాల్సిందే. వైల్డ్‌లైఫ్‌ను అద్భుతంగా చూపే ఈ రిసార్ట్‌లో అడవికి రాజులా ఆనందించవచ్చు.
3. కొమ్మలకు చేరువలో:
మన దేశంలో మధ్యప్రదేశ్‌లోని పెంచ్ నేషనల్ పార్క్‌లో ఉన్న తాజ్ భవన్ జంగిల్ లాడ్జ్‌కు.. ఎంతో ప్రత్యేకత ఉంది. రూఫ్ టాప్‌ను తెరిచినట్లుగా చేసిన ఏర్పాట్లతో.. పక్షులు, కోతులను అత్యంత చేరువనుంచి చూడవచ్చు. అంతే కాదు, ది పెంచ్ నేషనల్ పార్క్‌లో బుకింగ్‌కు మీరు ఐదు నిమిషాల దూరంలోనే ఉన్నారు.
4. సఫారీ లైఫ్:
పశ్చిమ బెంగాల్‌లో ఉన్న సుందర్‌బన్ నేషనల్ పార్క్‌లో గల ది సుందర్‌బన్ మాంగ్రూవ్ రిట్రీట్.. మీకు బెంగాల్ టైగర్లతో గడిపే అవకాశం ఇచ్చే మరో వైల్డ్‌లైఫ్ రిసార్ట్. గోమోర్ నదిలో చేపలను పట్టవచ్చు, సుందర్‌బన్ దట్టమైన అడవుల్లో సఫారీ టూర్లు చేయవచ్చు. ఇక్కడ ఇన్-హౌస్ ప్రదర్శనగా 20మంది కలిసి ప్రదర్శించే ‘బొనొబిబి యాత్ర’ కనుల పండుగగా ఉంటుంది.
5. జంగిల్ బుక్ అనుభవాలు:
కర్నాటకలోని బందిపూర్ వైల్డ్‌లైఫ్ రిజర్వ్‌లో గల ది టస్కర్ ట్రయల్స్.. మీకు అటవీ జీవనం గురించి మరింత విస్తృతమైన అవగాహన కల్పిస్తుంది. ఖరీదైన ఇంటీరియర్లు, ప్రైవేట్ బాల్కనీలతో కూడిన కాటేజ్‌లు మిమ్ములను తెగ ఆకట్టుకుంటాయి. ఔట్‌డోర్ స్పోర్ట్స్, ఓపెన్ ఎయిర్‌లో భోజనం, స్విమ్మింగ్ వంటి వాటిని ఈ రిసార్ట్ అందిస్తుంది. అద్భుతమైన విడిదిల కోసం మా ఉత్తమమైన కర్నాటక హాలిడే ప్యాకేజ్‌లను సందర్శించండి.
6. అడవుల్లోకి:
అస్సాంలో గల కాజీరంగా నేషనల్ పార్క్‌లో నిర్మించిన ది వైల్డ్ గ్రాస్ లాడ్జ్.. ప్రపంచ చారిత్రక ప్రాంతాలలో నిర్మించిన పురాతన రిసార్ట్. ఇక్కడి కళాత్మకత, వైవిధ్యమైన జీవన శైలి, అద్భుతమైన ఆతిథ్యం తెగ ఆకట్టుకుంటాయి. నీటి ఏనుగులు, అడవి ఏనుగులను ఈ రిసార్ట్ నుంచి చూడవచ్చు.
7. జంగిల్‌లో కింగ్‌గా బతకొచ్చు:
మధ్యప్రదేశ్‌లో బాంధవ్‌గడ్ నేషనల్ పార్క్‌లోని ది ట్రీ హౌస్ హైడ్‌ఎవే రిసార్ట్.. మీకు దట్టమైన అటవీ జీవితాన్ని పరిచయం చేస్తుంది. ప్రకృతిలో మమేకమైన అనుభూతిని అందిస్తుంది. భారతదేశంలో గల లగ్జరీ జంగిల్ రిసార్ట్‌లలో ఇది ఒకటి. చెట్లపై నిర్మించిన ఇళ్లలో నివాసాల్లో కొత్త అనుభూతులను సొంతం చేసుకోవచ్చు.
చెట్లతో సహజీవనంపై ఇప్పటివరకూ మీరు కలలు కనడమో, ఊహలకు పరిమితం కావడమో చేసి ఉంటారు. కానీ ఇప్పుడు మీకు అడవులలో ఒక బాస్ మాదిరిగా గడిపే అవకాశం లభిస్తోంది. దీన్ని మీ సొంతం చేసుకోండి. ఈ వైల్డ్‌లైఫ్ రిసార్ట్‌లలో ఒకచోటకు వెళ్లేందుకు ఇప్పుడే బుకింగ్స్ చేసుకోండి. ఈ వేసవిలో అద్భుతమైన సౌకర్యాలు, లగ్జరీ, అటవీ అందాలను తెగ ఆస్వాదిస్తూ ప్రకృతితో మమేకం అవండి.