Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

కూర్గ్‌ సందర్శనలో విభ్రాంతి కలిగించే 18 ప్రాంతాలు

భారతదేశ స్కాట్లాండ్‌గా పిలవబడే కూర్గ్.. దేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్లలో ఒకటి. ఉత్కంఠభరితమైన దృశ్యాలకు కూర్గ్ ప్రసిద్ధి చెందింది. మీరు స్థానిక జీవితాన్ని అనుభవించడానికి కూర్గ్‌లో హోమ్ స్టేస్‌ను ప్రయత్నించాలి. కూర్గ్‌లో సందర్శించడానికి అత్యుత్తమ స్థలాల జాబితా ఇక్కడ ఉంది:

కూర్గ్ సందర్శించడానికి స్థలాలు

1. అబ్బే జలపాతం – కూర్గ్‌ సందర్శనకు ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి:

 

కూర్గ్‌లో అబే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. మంత్రముగ్ధమైన ఈ జలపాతాలు కాఫీ తోటల మధ్య ఉన్నాయి. అబ్బే జలపాతాలను సందర్శించడానికి యాత్రికుల సంఖ్య గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతోంది. అనేక ఉత్సాహభరితమైన ప్రాంతాలకి సమీపంలో ఉండటంతో పలు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి డిమాండ్ పెరుగుతోంది.
సందర్శన సమయం: 9:00 am నుంచి 5:00 pm

2. తలకావేరి:

 

కావేరి నదికి మూలం అయిన తలకవేరి వద్ద.. నది పుట్టుక ప్రాంతం పర్యాటకుల సమూహాలను కలిగి ఉంది. కూర్గ్ సమీపంలోని పర్యాటక ప్రదేశాలలో ఇది ఉత్తమం. వసంతకాలంలో ముందుగా నిర్ణయించిన సమయంలో ప్రత్యేక ఆచారాలు నిర్వహిస్తారు.
సందర్శన సమయం: 6:00 am నుంచి 8:30 pm

3. నాగర్‌హొళె జాతీయ ఉద్యానవనం:

 

వైవిధ్య వర్గాలకు చెందిన వృక్ష మరియు జంతుజాలం ​​కారణంగా నాగర్‍హొళె జాతీయ ఉద్యానవనం దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటి. ఇది అనేక జాతుల వృక్షాలతో పాటు 270 జాతుల పక్షులు ఉంటాయి.
సందర్శన సమయం: 6:00 am నుంచి 9:00 am, 4:00 pm నుంచి 6:30 pm

4. నామ్‌డ్రోలింగ్ ఆరామం:

 

ఈ ప్రసిద్ధ మఠం యొక్క గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించారు. నామ్‌డ్రోలింగ్‌ను గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. దేవతలు, దెయ్యాలు, సంస్కృతి మరియు బుద్ధుని జీవితం యొక్క కొన్ని దశల చిత్రాలకు నిలయంగా నామ్‌డ్రోలింగ్ ఉంది. ఇది కూర్గ్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.
సందర్శన సమయం: 7:00 am నుంచి 8:00 pm

5. బారాపోల్ నదిలో వైట్ రివర్ రాఫ్టింగ్:

 

వైట్ రివర్ రాఫ్టింగ్‌కు బారాపోల్ నది ప్రసిద్ధి చెందింది. దీని ఫలితంగా కూర్గ్ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఈ నది, దాని ప్రవాహాలు మరియు చుట్టుపక్కల సుందరమైన ప్రకృతి దృశ్యాలతో కలసి, అద్భుతమైన రాఫ్టింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ నది బ్రహ్మగిరి వన్యప్రాణి అభయారణ్యంలో ఒక బోనస్‌గా ఉంది.

6. తడియాండమోల్ శిఖరం:

 

కూర్గ్‌లో ఉన్న ఎత్తైన పర్వత శిఖరం తడియాండమోల్.. 1748 మీటర్ల ఎత్తులో ఉంది. కాలిబాట కష్టమైనదే కానీ, ఎగువ నుండి చూస్తే మరచిపోలేని దృశ్యాన్ని అందిస్తుంది. ప్రకృతి ఫోటోగ్రఫీకి గొప్ప ప్రదేశం.

7. ఇరుపూ జలపాతం:

 

ఇరుపూ జలపాతం బ్రహ్మగిరి పర్వత శ్రేణులలో ఉన్న ఒక మంచి నీటి జలపాతం. ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు అందరూ మెచ్చే యాత్రా స్థలం. ఈ జలపాతాలు రుతుపవనాలతో సంబంధం లేకుండా అలరిస్తాయి.
సందర్శన సమయం: 8:00 am నుంచి 7:00 pm

8. రాజాస్ సీట్:

 

కొడగు రాజుల(కూర్గ్)కు విశ్రాంతి కేంద్రంగా రాజాస్ సీట్ ప్రసిద్ధి చెందినది. తోట, పరిసర పర్వత శ్రేణుల యొక్క సుందరమైన దృశ్యాల కారణంగా ఈ ప్రదేశం సందర్శకులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటుంది.
సందర్శన సమయం: 8:00 am నుంచి 9:00 pm

9. ఓంకారేశ్వర ఆలయం:

 

ఈ ఆలయం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శివ భగవానుడికి అంకితం చేస్తూ 1820లో లింగరాజేంద్ర ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలనులో అనేక చేపలు ఉంటాయి.
సందర్శన సమయం: 6:30 am నుంచి 12:00 pm, 5:00 pm నుంచి 8:00 pm

10. మడికెరి కోట:

 

చరిత్ర ప్రకారం ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడింది. 1812 మరియు 1814 ల మధ్య కాలంలో ఇటుక మరియు మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారు. ప్రవేశద్వారం చుట్టుప్రక్కల ఉన్న ఏనుగులు ఈ కోట యొక్క అందంను హైలైట్ చేస్తాయి.
సందర్శన సమయం: 10:00 am నుంచి 5:30 pm

11. నీలకండి జలపాతం:

 

కూర్గ్ యొక్క దట్టమైన ఉష్ణమండల అడవులలో నీలకండి జలపాతం ఉంది. పర్యాటకులు ఈ ప్రదేశంలోని ఆకర్షణీయమైన నీటితో ఆటలు ఆడుతూ.. అడవులను చూడవచ్చు, శబ్దాలు చూడవచ్చు.

12. సోమవారపేట్:

 

సోమవారపేట్ తాలూకాలోని ప్రధాన పట్టణం సోమవారపేట్. ప్రధాన పంటలు కాఫీ, మిరియాలు, అల్లం మరియు ఏలకులు తోటలు ఉంటాయి. ప్రామాణికమైన కూర్గీ వంటకు ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది. కూర్గ్‌లో సందర్శించడానికి ఉత్తమ స్థలాల జాబితాలో సోమవారపేట్ ఉండడానికి చాలానే కారణాలు ఉన్నాయి.

13. పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం – ట్రెక్కర్లకు కూర్గ్ లో సందర్శించవలసిన సిఫార్సులలో ఒకటి:

 

ప్రకృతిని అన్వేషించటం లేదా వన్యప్రాణులను చూడాలని మీరు కోరుకుంటే.. కూర్గ్‌లో ఉన్నపుడు పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం తప్పక సందర్శించాలి. ఇది కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటి. అనేక అంతరించిపోతున్న పక్షులకు నివాసం అయిన ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో మీరు కుమార్ పర్వతాన్ని చూడవచ్చు.

14. భగమండదాల:

 

కావేరి, కన్నికే మరియు సుజ్యోతి నదుల ఉప భూభాగం సంగమంలో ఉన్న భగమండల ఒక యాత్రా స్థలం. త్రివేణి సంగమం అని కూడా పిలువబడే కూర్గ్ జిల్లాలోని ఈ పవిత్ర ప్రదేశాన్ని.. తులా సంక్రమణ సమయంలో భక్తులు సందర్శిస్తారు. భగమండలలోని పవిత్ర జలాల్లో యాత్రికులు తప్పనిసరిగా స్నానం ఆచరిస్తారు. తమ తల్లితండ్రుల కోసం కావేరీ జన్మస్థలం అయిన తలకావేరికి వెళ్ళే ముందు ఆచారాలను నిర్వహిస్తారు.

15. ఆయుర్‌జీవన్:

 

మీరు ప్రత్యేకమైన స్పా చికిత్సలలో మీరు గడపాలని అనుకుంటే, ఆయుర్‌జీవన్ ఆయుర్వేదిక్ థెరపీ సెంటర్ సందర్శించండి. కూర్గ్‌లో ఈ ప్రదేశం విస్తృతమైన ఆయుర్వేదిక్ మసాజ్ మరియు స్పా ప్యాకేజీలను అందిస్తుంది.

16. బ్రహ్మగిరి ట్రెక్:

 

బ్రహ్మగిరి ప్రాంతంలో ట్రెక్కించే చేసేటపుడు వన్యప్రాణుల అభయారణ్యం, అడవులు, పచ్చటి భూములు, ప్రవాహాలు మరియు నదులను చూడవచ్చు. ఇరుప్పూ జలపాతం, మహావిష్ణువు ఆలయం తిరునెల్లై టెంపుల్ మరియు పక్షిపాతాళం గుహలు ఈ ట్రెక్కింగ్‌లో ప్రధాన ఆకర్షణలు. కూర్గ్‌లో సందర్శించవలసిన ప్రదేశాలలో ఇది ఖచ్చితంగా ఒకటి.

17. మల్లాల్లి జలపాతం:

 

కూర్గ్‌ ఉత్తర దిశలో ఉన్న ఈ ప్రాంతంలో అద్భుత జలపాతాలు కనిపిస్తాయి. కాలానుగుణంగా ప్రవాహం తగ్గినపుడు.. సన్నటి ధారగా మారిపోయే ఈ జలపాతం 60 మీటర్ల ఎత్తు నుండి కిందకు పడిపోతున్నప్పుడు గాలిలో అదృశ్యమవుతుంది.
సందర్శన సమయం: 9:00 am నుంచి 5:00 pm

18. కోపట్టి కొండలు:

 

కూర్గ్‌లో తక్కువగా ప్రఖ్యాతి చెందిన గమ్యస్థానాలలో ఒకటి కోపట్టి హిల్స్. నిశ్శబ్దం, విస్తారమైన కాఫీ తోటలు, గడ్డిభూములు మరియు దట్టమైన అడవులు, ప్రవాహాలతో కలిసి ఉంటుంది.

కూర్గ్ సందర్శన కోసం ఈ జాబితాను చూసిన తర్వాత ఒక ట్రిప్ ప్లాన్ చేయాలనే ఆలోచన కలిగిందా? థామస్ కుక్ అందించే కూర్గ్ టూర్ ఉత్తమ ప్యాకేజీలను చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *