Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

పారిస్‌లో ఆనందం అందించే 20 అందమైన ప్రదేశాలు

పారిస్ సందర్శించాలనే కోరిక కలిగితే ఏం చేస్తారు? అదేముంది.. సామాన్లు సర్దుకుని పారిస్ అన్వేషించడానికి బయల్దేరతారు. ఈ నగరంలో ఒక్కసారి పర్యటిస్తే, పారిస్ గురించి గతంలో మీరు విన్నవన్నీ నిజమే అని అర్ధం చేసుకుంటారు. ప్రతి ప్రదేశంలో, అన్ని ప్రముఖ ప్రాంతాల్లో పారిస్ ఒక అద్భుతం అనిపిస్తుంది. ఒకసారి పర్యటిస్తే జీవితకాలానికి సరిపడేంతటి ప్రేమ, స్ఫూర్తిలను అందిస్తుంది. పారిస్‌తో మీ ప్రేమ మొదలుకావాలంటే, ఆ నగరంలో సందర్శించవలసిన అత్యుత్తమ 20 స్థలాల జాబితా ఇక్కడ ఉంది.

పారిస్ సందర్శన కోసం ఉత్తమ స్థలాలు

1. అద్భుతమైన ఐఫిల్ టవర్:

 

ఈ ప్రపంచంలో ప్రసిద్ధ చారిత్రాత్మక పారిస్ ఆకర్షణలలో ఐఫిల్ టవర్ ఒకటి. ఇది ఓ అద్భుతమైన నిర్మాణం అనడంలో మరో అభిప్రాయం అవసరం లేదు. ఐఫిల్ టవర్‌ పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కవచ్చు లేదా ఒక ఎలివేటర్‌పై నుంచి వెళ్లే సౌకర్యం కూడా ఉంది. టవర్‌‌పై నుంచి పారిస్ నగరాన్ని వీక్షించడం ఓ అద్భుతమైన దృశ్యం. మీకు అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ ఓ విందు భోజనం చేయవచ్చు.

2. లోవ్‌రే వద్ద లైవ్ చరిత్ర:

 

ఒకప్పుడు రాజుల నివాసంగా ఉన్న ఒక గొప్ప రాజభవనం ఇది. లోవ్‌రే ఇప్పుడు చక్కటి కళ కలిగిన అద్భుతమైన మ్యూజియం. పురావస్తు నుండి మధ్యయుగ కళ మరియు యురోపియన్ పెయింటింగ్స్ వరకు 30,000 కన్నా ఎక్కువ కళాకృతులు ఉన్నాయి. లియోనార్డో డా విన్సీ చిత్రించిన మోనాలిసా కళ్ళలోకి చూసే అవకాశం కల్పిస్తుంది.

3. గోతిక్ మాదిరిగా మరేదీ ఉండదు:

 

ది హంచ్ బ్యాక్‌ ఆఫ్ నోట్రే-డేమ్‌ నవలలో రచయిత విక్టర్ హ్యూగో.. నోట్రే-డామ్ వివరించారు. మెరిసే ఉక్కుతో చేసిన కిటికీలు పారిస్‌లో సందర్శించాల్సిన ముఖ్యాంశాలలో ఒకటి. గోథిక్ కేథడ్రల్ దగ్గర ఒక ట్రిప్.. మీ పారిస్ పర్యటనలో తప్పకుండా ఉండాలి.

4. డెస్ చాంప్స్-ఎల్సీస్:

 

పార్కులు, మ్యూజియంలు, లగ్జరీ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, సినిమా, మరియు థియేటర్లతో సందడిగా ఉండే ఓ ప్రాంతం ఉంది. పారిస్‌లో ఈ ప్రాంతం సందర్శించండి మరియు ఇది పర్షియన్లకు ఒక సమావేశ ప్రదేశంగా ఉంది.

5. మూసీ డి’ఒరసి:

 

ఒక కళాకారుడు తన కుంచెతో గీసిన అద్భుత చిత్రం మాదిరిగా, గాగ్విన్ యొక్క రకరకాల వర్ణాలతో నిండిన అద్భుతమైన ప్రాంతం. అలంకరణ వస్తువులు మరియు ఫోటోగ్రఫీలను ఈ మ్యూజియం ప్రదర్శిస్తుంది. అలాగే రెండు కేఫ్‌లతో పాటు ఒక ఆధునిక రెస్టారెంట్ ఇక్కడ ఉన్నాయి.

6. అద్వితీయమైన పాలిస్ గార్నియర్ ఒపేరా హౌస్:

 

ఒపేరా, బాలే ప్రదర్శనలకు వేదికగా రూపొందించిన నియో-బరోక్ థియేటర్ ఒపేరా హౌస్ ఒక అద్భుతం.

7. బిబ్లోటెక్-మూసీ డి ఎల్’ఒపెరా:

 

ఒపెరా హౌస్‌లో ఉన్న మ్యూజియం మూడు శతాబ్దాల పూర్వపు జ్ఞాపకాలను ప్రదర్శిస్తుంది. మీరు కళాకృతులను ప్రేమించే వ్యక్తి అయితే, పారిస్‌లో తప్పక సందర్శించాల్సిన స్థలం ఇది.

8. ప్లేస్ డి లా కాంకోర్డే:

 

గంభీరమైన పరిమాణాలతో, ఇది నగరంలోని అత్యంత అందమైన స్క్వేర్‌లలో ఒకటి. దీని చారిత్రాత్మక ప్రాముఖ్యత పారిస్ పర్యాటకంలో హైలైట్.

9. ఆర్క్ డి ట్రయోంఫే వద్ద విజయ గర్వం:

 

విప్లవంతో సాధించిన విజయం కారణంగా ఫ్రెంచ్ దళాలకు అంకితం చేసే ఉద్దేశ్యంతో.. మొదటి చక్రవర్తి నెపోలియన్ ఓ నిర్మాణాన్ని నిర్మించమని ఆదేశించారు. పారిస్‌లో చూడటానికి ఉన్నత అంశాలలో ఇది ఒకటి. మన దేశంలో నిర్మించిన ఇండియా గేట్‌కు ఇది స్ఫూర్తి.

10. సైంటే-ఛాపెల్లే:

 

ఈ గోతిక్ నిర్మాణ కళాఖండాన్ని మధ్య యుగాల అరుదైన రత్నంగా భావిస్తారు. చాపెల్ సున్నితమైన గాజు కిటికీలు కలిగి ఉంది. ప్రకాశవంతమైన వెలుగులు మరియు నిర్మలమైన కాంతిని ఇస్తుంది. పారిస్‌లో మీ సందర్శన సమయంలో ఇది మిస్ కావద్దు.

11. సున్నితమైన లక్సెంబర్గ్ గార్డెన్స్:

 

ఈ క్లాసిక్ ఫ్రెంచ్-శైలి పార్కులో అందమైన ఫౌంటెన్లు, అందమైన విగ్రహాలతో అలంకరించబడిన సొగసైన పైకప్పులను కలిగి ఉంది. ఈ సుందరమైన తోటల సందర్శన మీ పారిస్ సెలవు ప్యాకేజీలలో భాగంగా ఉండాలి.

12. సాక్రే-కొయుర్ మరియు క్వార్టియెర్ మోంట్‌మార్టే:

 

పారిస్‌లో అత్యంత ఎత్తైన ప్రాంతం వద్ద ఉండి, ఆభరణాన్ని అలంకరించిన మాదిరిగా ఉన్న ప్రత్యేక కట్టడం ఇది. దీని ముఖభాగం రోమనెస్క్ మరియు బైజాంటైన్ శైలులను మిళితం చేసినట్లుగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఒక వెడ్డింగ్ కేక్ వలె కనిపిస్తుంది. లోపలి భాగాలను అందంగా కొవ్వొత్తులతో వెలిగిస్తారు. పారిస్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా దీనికి ప్రత్యేక ఆకర్షణను ఉంది.

13. ప్లేస్ డి వోస్‌జెస్:

 

ఇది ప్యారిస్ యొక్క పురాతన పబ్లిక్ స్క్వేర్. విశాలంగా ఏకరీతి శైలిలో నిర్మించబడింది. పునరుజ్జీవన ఉద్యమానికి జ్ఞాపకంగా నిర్మాణ విలక్షణమైన చదరపు ఎర్ర ఇటుక, రాయి, పైకప్పులు మరియు అద్భుతంగా ఉండే ఏకరీతి గృహాలతో సుందరమైన రూపం కలిగి ఉంది!

14. డిస్నీల్యాండ్:

 

పారిస్ డిస్నీల్యాండ్‌లో మీరు చిన్నపిల్లల మాదిరిగా మారిపోతారు. డాన్స్‌ ఇన్ ఏ బాల్‌తోపాటు పలు రైడ్స్‌ను ఆనందించండి. ఇది ఖచ్చితంగా పారిస్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలలో ఒకటి.

15. ది హిస్టారిక్ బాసిల్లే:

ఒకప్పుడు క్రూరమైన జైలుగా గుర్తింపు పొందిన ప్రాంతం బాసిల్లే. అయితే ఇప్పుడు ఆ జైలును గుర్తు చేసేలా పేరు మాత్రమే ఉన్న ఒక స్క్వేర్ ఇది. ఈ జైలు ఉండాల్సిన ప్రదేశంలో ఒపెరా హౌస్ నిర్మించగా.. కొత్త క్యాలెండర్, ఓటు నమోదు ప్రాంతాలను కలిగి ఉంది.

16. ప్లేస్ డు చాటిలెట్ & టూర్ సెయింట్-జాక్వెస్:

ఇక్కడ ఇన్‌హౌస్‌ థియేటర్‌లో ఆసక్తికరమైన ఒపేరాలను సమర్పిస్తుంది. సమకాలీన నృత్య ప్రదర్శనలు మరియు శాస్త్రీయ సంగీత కచేరీలను అందిస్తుంది. గోతిక్ శైలిలో నిర్మించిన టూర్ సెయింట్-జాక్యుస్ చర్చ్ ఒక నిర్మాణ అద్భుతం.

17. మనోహరమైన కన్సీర్జరీ:

 

ఈ మధ్యయుగపు కోట, ఫ్రెంచ్ విప్లవం నాటి అంతగా ప్రసిద్ధి చెందని జైలు. ఇప్పుడు ఒక మ్యూజియంగా మారిపోయింది. గిల్లిటెన్ బ్లేడ్ వంటి భయంకరమైన వస్తువులను ప్రదర్శింపబడతాయి.

18. మౌలిన్ రూజ్:

 

ఒక సాయంత్రం ముగించడానికి ప్రసిద్ధ మౌలిన్ రూజ్ వద్ద ప్రదర్శన తిలకించడం సరైన మార్గం. కెన్‌కెన్ నృత్యకారులు మిమ్మల్ని అబ్బురపరుస్తారు.

19. పియర్రీ హీర్మే:

 

మీకు ఫుడ్ అంటే ఇష్టమా? పియర్ హీర్మే మీకారిన్స్, టార్ట్స్, ఎక్లెయిర్స్ మరియు అనేకమైన డెజెర్ట్‌లను నోటిలో కరిగించటం కోసం ఈ గమ్యస్థానం! ఫ్రెంచ్ వారికి ఖచ్చితంగా వారి తీపి పదార్ధాల రుచి తెలుసు!

20. బొలెవార్డ్స్:

 

పారిస్ ప్రేమ భావాన్ని తెలుసుకొని ఇష్టపడటానికి, ఆ నగరంలోని కొబ్లెస్టోన్ మార్గాలలో నడిచి వెళ్ళాలి. బొలెవర్స్ లేదా సెయిన్ నది ఒడ్డున నడవండి. ఇక్కడ పారిస్ మొత్తాన్ని చూసిన భావన కలుగుతుంది. ఈ మనోహరమైన బొలెవార్డ్స్‌.. పారిస్‌లో స్థానిక అనుభూతిని పొందడానికి ఉత్తమ స్థలాలు.

పారిస్‌ వెళ్లాలన్న ఆసక్తి కలిగితే.. మా పారిస్ హాలిడే ప్యాకేజీలను పరిశీలించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *