Travel Blog by Thomas Cook India

సూర్యుడు అస్తమించే భూమి స్పెయిన్‌ సందర్శన కోసం 12 ఉత్తమ స్థలాలు

అద్భుతమైన కళ, పురాతన చరిత్ర, స్పానిష్ సంస్కృతి యొక్క సమ్మిళిత మిశ్రమం స్పెయిన్. స్వర్గం లాంటి సముద్ర తీరాలలో చక్కని ఆహారం ఆస్వాదించడానికి ఈ ప్రాంతం అనువైనది. యూరోపియన్ స్వర్గంగా స్పెయిన్ గుర్తింపు పొందిది. స్పెయిన్‌లో సందర్శించడానికి ఉత్తమ స్థలాలపై వివరాలు అందించే ఒక గైడ్ ఇక్కడ ఉంది.

స్పెయిన్‌లో సందర్శించడానికి ఉత్తమ స్థలాలు

1. అందమైన బార్సిలోనా:

 

స్పెయిన్‌లోని అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటి బార్సిలోనా. స్పెయిన్ పర్యటనలో మ్యూజియంలు, చరిత్ర, నిర్మాణాలతో నిండిన నగరాన్ని చూడవచ్చు. బార్సిలోనా అందాలను ఆస్వాదించేందుకు ఉత్తమమైన మార్గం రోడ్ల వెంట నడవడమే.

 

 

2. అద్భుతమైన మాడ్రిడ్:

 

నైట్‌లైఫ్ కోసం గుర్తింపు పొందిన మాడ్రిడ్ నగరం.. మీకు అనేక ఆసక్తికరమైన అంశాలను దర్శిచేందుకు సహాయపడుతుంది.

 

3. ఇబిజా:

 

తీరిగ్గా సమయం గడపాలని, పార్టీ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఐబిజా మీ కోసం తగిన గమ్యం. సముద్ర తీరాలు చుట్టూరా ఉన్న ఈ ప్రాంతాన్ని, మీ స్పెయిన్ టూర్‌లో తప్పనిసరిగా సందర్శించండి.

 

 4. కోస్టా బ్రావాలో రొమాన్స్:

 

మీరు మీ భాగస్వామితో స్పెయిన్‌లో ఉంటే, కోస్టా బ్రావా యొక్క మంత్రముగ్ధమైన తీరాల వద్ద రాత్రి పూట నడవండి.

 

5. సెవిల్లె:

 

మూరీష్ నగరం సెవిల్లెలో చరిత్ర సజీవంగా ఉంది. స్పెయిన్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి.

 

6. రోండా:

 

స్పెయిన్‌లో అత్యంత ఆకర్షణీయమైన నగరాలలో ఒకటైన రోండాలో రహస్యాలు దాగున్నాయి. ఒకసారి ఇద్దరు దేవతల మధ్య వివాదం ఏర్పడడం కారణంగా ఈ నగరం ఆవిర్భవించిందని ఓ కథ ఉంది. భారీ వంతెన ఇక్కడి ఒక మనోహరమైన దృశ్యం.

 

7. మాలాగా:

 

ప్రపంచంలో పురాతన నగరాల్లో ఒకటి అయిన మాలాగా.. స్పెయిన్‌లో సందర్శనలో తప్పనిసరిగా ఉండాలి.

 

8. లా రియోజాలో వైన్‌యార్డ్స్:

 

వైన్‌కు ప్రసిద్ధి చెందిన లా రియోజాలో ద్రాక్ష తోటల ప్రయాణం మీ జాబితాలో ఉండాలి.

 

9. మంత్రముగ్ధులను చేసే కానరీ ద్వీపాలు:

 

7 ద్వీపాల సమూహం.. స్పెయిన్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. కానరీలు, నీలం వాటర్స్, తెల్లని ఇసుక తీరాలు మరియు సరదాగా గడిపే సమయాలు ఇక్కడి సొంతం.

 

10. ఆధ్యాత్మిక మల్లోర్కా:

 

రాఫెల్ నాదల్ యొక్క స్వస్థలమైన నగరం మల్కోర్కా. మీ స్పెయిన్ హాలిడే ప్యాకేజీలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

 

11. గ్రెనడా:

 

వసంత కాలంలో సందర్శించాల్సిన అందమైన నగరం స్పెయిన్‌లోని గ్రెనడా. ఒక జిప్సీ గుహలో రహస్యాలను అన్వేషించండి. మీరు తాత్కాలిక నివాస అనుభవానికి గుహా గృహాల్లో ఉండవచ్చు.

 

12. టోలెడో:

 

మీరు టోలెడో గురించి ఆలోచించినప్పుడు జ్ఞాపకం వచ్చే ఒక పదం మూరిష్. “మూడు సంస్కృతుల నగరం” గా కూడా పిలువబడే పురాతన పట్టణం ఇది. గోడలు, నిర్మాణాలు, చర్చిలు మరియు ప్యాలెస్‌లతో నిండిన చిట్టడవి ఇక్కడ ఉన్నాయి.