Travel Blog by Thomas Cook India

పచ్చని స్వర్గం కేరళలోని వాయనాడ్‌లో సందర్శించాల్సిన 10 ఉత్తమ ప్రదేశాలు

కేరళ హిల్ స్టేషన్లకు వచ్చినప్పుడు ఆ జాబితాలో వాయనాడ్ అగ్రభాగాన ఉంటుంది. మీరు వయనాడ్ చేరుకునే సమయంలో, ఆకుపచ్చ వర్షారణ్యాలు చుట్టుముట్టిన పర్వత రోడ్లు మీకు స్వాగతం పలుకుతాయి. దేవుని స్వంత దేశం అయిన కేరళలో అందమైన హిల్ స్టేషన్‌లో చిరస్మరణీయ సెలవులకు కేంద్రం ఇది. వయనాడ్‌లో లెక్కలేనన్ని విషయాలు ఉన్నాయి. కేరళలో హాలిడే టుూర్‌లో ఉన్నప్పుడు వయనాడ్‌లో సందర్శించే సమయంలో ఈ ఉత్తమ స్థలాలను మిస్ చేయకండి.

వాయనాడ్ సందర్శించడానికి ఉత్తమ స్థలాలు

1. కాల్పెట్టా సహజ అద్భుతాలు:

వయనాడ్ జిల్లా ప్రధాన కేంద్రం కాల్పెట్ట. పర్వతాలు మరియు దట్టమైన కాఫీ మరియు తేయాకు తోటలు ఉంటాయి. ఇది వయనాడ్‌లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి.

2. మీనాంగడి:

చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వం మరియు అనేక తోటలకి ప్రసిద్ధి చెందింది. మీనాంగడి మీ సందర్శన ప్రదేశాలలో ఉండాలి. మీనాంగడి కూడా భారతదేశానికి మొట్టమొదటి కర్బనరహిత పట్టణం అవుతోందని మీకు తెలుసా?

3. పోజుతానా:

కేరళలోని చిన్న గ్రామం పోజుతానా కూడా ఆసక్తికరంగా ఉన్న పర్యాటక ప్రదేశంగా మారింది. ఇక్కడ కొండ ప్రాంతాలకి చదునైన లోయలు మరియు తేయాకు తోటలు ఉన్నాయి. వెదురు రాఫ్టింగ్ ఇక్కడ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.

4. మేప్పడి-

వయనాడ్‌లో సందర్శించడానికి రొమాంటిక్ స్థలం:

కోజికోడ్ మరియు ఊటీ మధ్య రాష్ట్ర రహదారిపై ఉన్న మేప్పడి.. కేరళలోని అందమైన పర్వత ప్రాంతాలలో ఒకటి. చెంబ్రా శిఖరం మరియు హృదయ ఆకారపు సరస్సుకి ప్రసిద్ధి.

 

 

5. ఎడక్కల్:

 

కల్పెట్ట నుండి సుమారు 25 కి.మీ.ల దూరం పాటు ఎడక్కల్ గుహలకు ప్రయాణం చేయాలి. ఇది మానవ నివాస స్థలంలో మొట్టమొదటి కేంద్రాలలో ఒకటిగా నమ్ముతారు. మీ కేరళ హాలిడే ప్యాకేజీలలో ఖచ్చితంగా సందర్శించాలి.

6. బాణాసుర:

ఆనకట్ట మరియు హైకింగ్ ట్రయిల్ కోసం ఇది ప్రసిద్ది చెందింది. బాణాసుర చుట్టూ పాత కాలం నాటి నుంచి అనేక పురాణములు మరియు కల్పితాలు ఉన్నాయి. చరిత్ర మరియు పురాణశాస్త్రంపై మీకు ఆసక్తి ఉంటే, మీ కోసం వాయనాడ్‌లో సందర్శించటానికి ఉత్తమమైన ప్రదేశాలలో బాణసురా కూడా ఉంది.

7. పూకోడే:

కల్పెట్టా నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూకోడే.. వాయనాడ్‌లో అత్యంత ఆకర్షణీయ ప్రదేశాలలో ఒకటి మరియు సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ప్రకృతి ప్రేమికులకు మరియు ఫోటోగ్రఫి ఔత్సాహికులకు ఈ గ్రామం సరైన ప్రదేశం.

8. తిరునెల్లీ:

గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందిన పురాతన నివాస స్థలం తిరునెల్లీ. నియా, చోళులు, మలబార్ మరియు తిరునెల్వేలి సుల్తానేట్లు, విజయనగర సామ్రాజ్యం, మదురై నాయక్‌లు, చందా సాహిబ్, కర్ణాటక రాజ్యం మరియు బ్రిటీష్ వారు పాలించిన ఈ ప్రాంతం రాజవంశ చరిత్రతో అలరారుతోంది.

9. అంబలావాయల్:

ఈ చిన్న గ్రామం వాయనాడ్‌లో తప్పక చూడాలి. కొండలు, పచ్చదనంతో పాటు వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం మరియు రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ గా ప్రసిద్ధి చెందింది.

10. తోల్పెట్టీ మరియు ముథంగా:

38 కిలోమీటర్ల దూరంలో ఉన్నా తోల్పెట్టీ మరియు ముథంగ.. భారతదేశంలోని ఉత్తమ జంతువులను కలిగి ఉన్నాయి. తేయాకు తోటలు వన్యప్రాణి అభయారణ్యాలను వేరు చేశాయి.

ఇప్పుడు వయనాడ్‌లో సందర్శించడానికి ఉత్తమ స్థలాలు మీకు తెలుసు, వాయనాడ్ టూర్ ప్యాకేజీలను తీసుకుని ఒక అద్భుతమైన పర్యటన చేయండి.