Travel Blog by Thomas Cook India

వస్తువులపై కాదు, అనుభవాలపై మీ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలో తెలుసా?

ఇవాల్టి రోజుల్లో మనమంతా జేబులు, పర్సులు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఫుల్లుగా ఎలా ఉండాలనే విషయంపైనే ఆలోచిస్తున్నాం. నిజానికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. మనకు నిజంగా ఆనందాన్ని ఏవి ఇస్తాయనే! దుస్తులు, ఇళ్లు, కార్లు, టెక్నాలజీ లాంటివి ఏవీ కలకాలం నిలిచిపోవు. కొన్నాళ్లకు గానీ, కొన్నేళ్లకు కానీ ఇవి మారిపోతాయి. చిరకాలం మన మనసుల్లో నిలిచిపోయే అంశాలుగా మిగిలిపోయే వాటి గురించి ఆలోచించాలి. అవి అనుభవాలే. మన డబ్బులను వస్తువులపై కాకుండా, ప్రయాణాలపై ఖర్చు చేసి అనుభూతులను ఎందుకు మిగుల్చుకోవాలో కారణాలను తెలుసుకుందాం.

1. ఎక్స్‌పైరీ డేట్ ఉండదు:

వస్తువుల మాదిరిగా అనుభవాలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు, అవి అమూల్యమైనవి. వాటికి విలువ కట్టలేము, కొన్నేళ్ల తర్వాత కూడా ఆ క్షణాలను గుర్తు చేసుకున్నపుడు, మిమ్మల్ని ఆనందపరుస్తాయి, ముఖాలపై చిరునవ్వును తెస్తాయి. వియెత్నాంలో మోటార్ బైకింగ్ చేసినట్లు ఊహించుకోండి! అదే డబ్బు ద్వారా వచ్చే అనుభూతుల విలువ!

2. ప్యాషన్ వెతుక్కోవడం:

మీ అనుభవాలు మరీ ఖరీదైనవి కావాల్సిన అవసరం లేదు. మీ ప్యాషన్‌ను పూర్తి చేయడంలో అవి సహాయపడతాయి. మీ రోజువారీ పనులను కూడా అవి ప్రభావితం చేస్తాయి. వీకెండ్‌లో మీరు డబ్బు ఖర్చు చేసే విధానంపై కూడా ఎఫెక్ట్ చూపుతాయి. మీ ప్యాషన్ పెరుగుతుంటే, మీరు మలేషియాలో తమన్ నెగరా నేషనల్ పార్క్‌ గురించి కలలు కనడం పెరగవచ్చు.

3. మూడో కన్ను:

విభిన్న సంస్కృతులు, సామాజిక పద్ధతుల గురించి తెలుసుకునేందుకు ప్రయాణాలు, వాటి ద్వారా వచ్చే అనుభూతులే అత్యంత కీలకం. ప్రపంచాన్ని మీరు చూసే సందర్భం అది. టర్కీలోని కప్పాడొసియాలో సూర్యోదయం చూసేందుకు మీరు కచ్చితంగా సమయం కేటాయించాల్సిందే. మీ గుండెను చిరకాలం మెలిపెట్టే అద్భుత క్షణాలు అవి.

4. మృదువైన గురువు:

తరగతి గదిలో నేర్వలేని ఎన్నో పాఠాలను నేర్పించే గురువులు అనుభవాలు. ఎవరూ చెప్పలేని ఎన్నో జీవిత పాఠాలను అవి నేర్పిస్తాయి. మీ జీవితంలో ఏదైనా టర్నింగ్ పాయింట్ వచ్చినపుడు, నెల- 2 నెలలు బ్రేక్ దొరికితే, మీరు ఆస్ట్రేలియాలో కోస్టల్ సిటీస్‌ను చుట్టి రండి. ఇది వ్యక్తిగా మిమ్మల్ని ఎంతగానే మార్చేస్తుంది.

5. అద్భుత జీవితం:

మీరు ఎంతటి అద్భుత జీవితం ఆనందిస్తున్నారో తెలుసుకునే అవకాశం ప్రయాణాలలో మాత్రమే లభిస్తుంది. మీ మనసులు ఆనందంగా ఉండాలంటే అనుభూతులు చాలా ముఖ్యం. న్యూజిలాండ్‌లో సౌత్ ఐల్యాండ్‌, ఫాయిర్‌లాండ్‌లోని కయాకింగ్‌లో మీరు ఇలాంటి ప్రయాణ అనుభవాలు పొందవచ్చు.

6. మీ మెదడు నిలిచే జ్ఞాపకం:

అనుభవాలపై పెట్టుబడులు చేయాలని చెప్పేందుకు మరో అసలైన కారణం, అవి మీరు మరచిపోలేని జ్ఞాపకాలు మరియు సంతోషాలు. వాటిని చెరపలేము, తిరిగి అదే పొందలేము.. అయినా సరే మన మెదడు, మనసులలో ఓ అందమైన ముద్రను వేసేస్తాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఆకాశం నుంచి స్కీయింగ్ చేసిన అనుభవం మనసులోంచి తొలగిపోతుందా?

7. థ్రిల్లింగ్ అనుభవాలు:

అనుభవాలు మీకు స్ఫూర్తి రగిలిస్తాయి, సవాలు చేస్తాయి, మీ సౌకర్యవంతమైన జోన్‌నుంచి బయటకు తెస్తాయి. నిర్ణయాత్మక శక్తులుగా అవతరిస్తాయి. అందుకే మీలో నిద్రాణంగా ఉన్న శక్తిని బయటకు తేవాల్సిన సమయం ఇది. టజకిస్తాన్‌లోని మ్యాజెస్టిక్ పమిరిస్‌ను నడకతో చుట్టేయడం అలాంటి థ్రిల్లింగ్ అనుభవమే.

8. మ్యాజిక్ చేసే క్షణాలు:

అనుభవాలు స్వల్పకాలంలో సంపాదించినవే కావచ్చు, కానీ అవి మీకు ఎంతో తిరిగి ఇస్తాయి. ఓ అద్భుతమైన అనుభూతి ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మనసు నుంచి కదలదు. మిమ్మల్ని చైతన్యపరుస్తూ, సంతోషంగా ఉంచుతాయి. మీరు అనుభూతులపై ఖర్చు చేస్తే, వేల కోట్ల ఆనంద క్షణాలను మీకు మీరు బహుమతిగా ఇచ్చుకున్నట్లే. స్వీడన్‌లోని నార్తర్న్ లైట్స్‌లో ఇలాంటి మ్యాజికల్ క్షణాలు గడపవచ్చు.

మీ జీవితాలను ప్రయాణ అనుభూతులపై వెచ్చించండి. మీరు గతంలో పొందని ఎన్నో అనుభవాలను సొంతం చేసుకోండి. అనుభవాలపై చేసే పెట్టుబడులపై ఎప్పటికీ రాబడి వస్తూనే ఉంటుంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? పర్యటనలు చేయండి.. ప్రపంచాన్ని అనుభవించండి!