Travel Blog by Thomas Cook India

లడఖ్ గురించి మీకు తెలియని 10 రహస్యాలు

గంభీరమైన మరియు రహస్యమైన హిమాలయ శ్రేణులలో ఎల్లప్పుడూ పర్యాటకులు, సందర్శకులు విస్తృతంగా సంచరించే ప్రాంతం లడఖ్. కొన్ని సంవత్సరాల అంతగా క్రేజ్ లేకపోయినా, ఇప్పుడు లడఖ్ అత్యధికంగా పర్యటించే ప్రదేశాలలో ఒకటిగా మారింది. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? లడఖ్ గురించి మీకు ఇప్పటికే తెలిసినా, ఇక్కడ ఇంకా ఏమైనా ఉందా అనుకుంటున్నారా.. దీని పరిపూర్ణ సౌందర్యం, నీలం రంగులో ఆకాశం, మంచుతో మునిగిన పర్వతాలు ప్రజలను పిలుస్తున్నాయి. అంతేకాదు.. ఇది సినిమాల్లో కనిపించే ప్రదేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవాటిలో ఒకటిగా ఉంది. మీ ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా అందంగా మార్చేయగలదు.

లడఖ్ సంస్కృతి
ఈ ప్రదేశం గురించి ఎన్ని చూసినా తెలిసినా, ఎంత ప్రాచుర్యం పొందినా, ఇంకా బయటకు వెల్లడి కాని అనేక రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. లడఖ్ గురించి కొద్ది వివరాలు ఇక్కడ ఉన్నాయి:

లడఖ్ రహస్యాలు

1. మీరు అడవి పిల్లులను గుర్తించవచ్చు:

అంతుచిక్కని మంచు చిరుత గుర్తించాలా? శరీరాన్ని కొరికివేసే చల్లని వాతావరణం.. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు.. ఈ పర్యటన నుండి మిమ్మల్ని నిరోధిస్తాయి. అయితే ఈ అడవి పిల్లిని గుర్తించడానికి ఇదే ఉత్తమ సమయం. అడవి మేకలు ఆహారం కోసం లోయకు దారితీస్తుండగా, వాటిని వేటాడడానికి మంచు చిరుతలు కాలిబాటను అనుసరిస్తాయి. మీరు సహనం ఎక్కువగా అవసరం. కానీ మీరు ఇది చూసినపుడు వేచిఉన్నందుకు తగిన ఫలితం లభిస్తుంది.

2. అరుదైన టిబెటన్ గాజెల్:

మంచు చిరుతలు కాకుండా, మీరు అరుదైన టిబెటన్ గాజెల్ లేదా ‘చిరు’ను చూడవచ్చు. ఊలు కోసం ఈ జంతువులను వేడాడుతుంటారు. ఈ అడవిలో ఇంకా 75,000 మాత్రమే మిగిలి ఉన్నాయి. గాజెల్స్ మాత్రమే కాదు.. చిరుతలకు కూడా టిబెట్ ఆవాసం. లడఖ్లో అనేక అంతరించిపోతున్న జాతులు ఇంకా ఉన్నాయి.

3. వాస్తవానికి లడఖ్ ఓ ఎడారి:

లడఖ్ గురించి ఇది చాలా మందికి తెలియని అంశం. లడఖ్ నిజానికి ఎడారి అని మీకు చెప్పినట్లయితే విశ్వసిస్తారా? పర్వత శిఖరాలు కారణంగా, ఇక్కడ వర్షం భారీగా పడుతుంది. ఇది రుతుపవన మేఘాలకు ఆహ్వానం పలుకుతుంది. అంటే ఇక్కడ వర్షపాతం ఉండదు. కానీ శీతాకాలంలో కురిసే మంచు కారణంగా ఆ మంచు నీరుగా మారుతుంది.

4. పక్షులను చూసేందుకు లడఖ్:

లడఖ్ ఒక ఎడారి అయినప్పటికీ, ఇక్కడ 225 రకాల పక్షులు ఉన్నాయి. లడఖ్ యొక్క చిత్తడి నేలలు వలస పక్షులకు మంచి ఆవాసం.

5. ఉప్పు నీటి సరస్సు :

3 ఇడియట్స్‌ మూవీలో సరస్సు గుర్తుందా? ఇది పాన్‌గోంగ్ సరస్సు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో 14270 అడుగుల ఎత్తున ఉన్న ఉప్పు నీటి సరస్సు!

6. తేనెపట్టును పోలిన ఫ్యూగల్ మొనాస్టరీ:

గుహల ద్వారా ఏర్పడిన ఫ్యూగల్ మొనాస్టరీ 2500 సంవత్సరాల క్రితం ఏర్పడింది. నడక ద్వారా మాత్రమే దీన్ని చేరుకోగలం. దీన్ని చూస్తే పర్వతాలలో ఒక తేనెగూడు మాదిరిగా ఉంటుంది. స్వదేశీయ నిర్మాణ సాంకేతికతకు సలాం అనాల్సిందే.

7. ప్రపంచంలో మొట్టమొదటి సాగు భూమి కస్కోక్ వద్ద టో మోరిరి సరస్సు ఒడ్డున ఉంది. ఇక్కడ నివసిస్తున్న చాంగ్‌పాస్ లేదా కాపరులు.. బార్లీ, ఓట్స్, మరియు కూరగాయలను పెంచుతారు.

8. నక్షత్రాలు చూడటానికి లడఖ్ ఒక గొప్ప ప్రదేశం:

14764 అడుగుల ఎత్తున నిలబడి, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ మరియు గామా-రే టెలీస్కోప్‌ల ద్వారా ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతాలను చూసే అవకాశం కల్పించే స్థలాలలో లడఖ్ ఒకటి. తక్కువ కాలుష్యం కారణంగా స్పష్టంగా కనిపించే ఆకాశానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. నక్షత్రాలు చూడటం ఇష్టమైతే అందుకు లడఖ్ ఉత్తమ ప్రదేశం.

9. లడఖ్లో సుమారు 33 ప్రసిద్ధ మఠాలు ఉన్నాయి. మొట్టమొదటి మరియు అతి పెద్దదైన లమయురు మొనాస్టరీ ఇప్పటికీ ఉంది. ఒక సమయంలో ఇది 400 సన్యాసులను కలిగి ఉంది.

10. స్థానికులు యూఎఫ్ఓ లను చూశారట:

లడఖ్ గురించి ఒక ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే.. ఇక్కడి స్థానికులు అనేకులు హిమాలయాల్లో యూఎఫ్‌ఓలకు రహస్య బేస్ అయిన కాంగాకా లా వద్ద ఉందని అంటారు. స్థానికులు పర్వతాల లోయల సమీపంలో అనేక వస్తువులను గుర్తించారు. రిప్లీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మాదిరి లాంటి కథ లాగా ఉంది కదూ!

లడఖ్ యొక్క ఈ అద్భుతమైన ప్రదేశాలు అన్వేషించడానికి, మీ వెకేషన్ మరపురానిదిగా చేయడానికి.. ఉత్తమ లడఖ్ హాలిడే పాకేజీలను ఎంపిక చేసుకోండి.