జీవితంలో ఉత్తమ విషయాలు ఉచితంగా వస్తాయని పెద్దలు చెప్పే మాట. అయితే, పారిస్ టూర్ గురించి ఆలోచించినప్పుడు.. అక్కడ అలా ఉచితంగా ఏమీ ఉండదని మీరు అనుకోవచ్చు. మీరు పారిస్‌లో ఒక్క యూరో ఖర్చు చేయకుండా, ఉత్తమమైన కొన్ని పనులను చేయచ్చని చెబితే, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నామని అనుకోవచ్చు. కానీ పారిస్‌లో సందర్శించడానికి కొన్ని ఉత్తమ స్థలాల జాబితా మరియు ఉచితంగా చేసేందుకు పలు విషయాలు ఇక్కడ ఉన్నాయి.
పారిస్‌లో చేసేందుకు ఉచిత విషయాలు
1. కెథెడ్రల్ నోట్రే డేమ్ డి ప్యారిస్:
12 వ శతాబ్దపు కెథడ్రల్ ఒక నిర్మాణ అద్భుతం అని చెప్పాలి. దాని అద్భుత ప్రభావాలు, రోజ్ విండోస్, భారీ సైజులో ఎగిరే బుటర్సెస్ మరియు మూడు విస్తృత శిల్పాల అద్భుతం ఇది. అలాగే, మీరు సాహిత్యం మరియు కథల ప్రేమికుడు అయితే.. హంచ్ బ్యాక్ ఆఫ్ నోట్రే డేమ్‌ను తప్పనిసరిగా చూడాల్సిందే.
2. ఆదివారాల్లో మ్యూజియంలు:
పారిస్‌లోని సంగ్రహాలయాల పర్యటన లేకుండా సందర్శన పూర్తి కాదు. అద్భుతమైన లోవ్రే మరియు మ్యూసీ డి’ఓర్సే వంటి మ్యూజియంలను సందర్శించాలి. ప్రతి నెలలో మొదటి ఆదివారం నాడు ఉచితంగా అనుమతిస్తారు. మ్యూజియంలు ఖచ్చితంగా పారిస్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు.
3. జర్డిన్ డు లక్సెంబోర్గ్‌లో నడక:
పారిస్‌లో సందర్శించడానికి రెండవ అతి పెద్ద ఉద్యానవనం ఇది. పారిస్‌లో సందర్శన స్థలాలలో ఒక అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. అందమైన విగ్రహాలు, స్మారక చిహ్నాలు, ఫౌంటైన్లు మరియు చిన్న చెరువులతో నిండిన ఈ ఉద్యానవనం 17వ శతాబ్దపు కాలం నాటిది. ఫ్రెడెరిక్ బార్టోహోలిచే విగ్రహం యొక్క మొట్టమొదటి నమూనా కూడా ఉంది.
4. మోంట్‌మార్ట్‌రే లవ్ వాల్:
పారిస్ హనీమూన్ ప్యాకేజీలో ఉన్నపుడు లవ్ వాల్‌కు ఒక రొమాంటిక్ డేట్ రోజు మీ భాగస్వామిని ఇక్కడకు తీసుకు వచ్చి.. 100 రకాలుగా ‘ఐ లవ్ యు’ చెప్పండి.
5. ప్యారిస్ ప్లేజెస్:
మీరు పారిస్ టూర్ ప్యాకేజీలో భాగంగా వేసవిలో ఇక్కడ ఉన్నట్లయితే, ప్యారిస్ ప్లేజెస్‌కు వెళ్లండి, ఇది పారిస్ పర్యాటకం యొక్క ముఖ్యాంశం. సియెన్ ఒడ్డున, ఇసుక, చెట్లు మాత్రమే కాదు.. అనేక కుర్చీలు కూడా అలంకరించబడినవి. ఐస్‌క్రీమ్ విక్రేతలు, వీధి సంగీతకారులు, బహిరంగ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను చూడవచ్చు.
6. లా ఫెట్ డె లా మ్యూజిక్:
ఉచిత కచేరీలు కావాలా? ప్రతీ ఏటా జూన్ 21న గాలిలో ప్రొఫెషనల్ సంగీతకారులు చేసే కచేరీలలో రాక్, జాజ్, పాప్ సంగీతానికి మీ పాదాలను కదపండి.
7. ఉచిత ఓపెన్ ఎయిర్ సినిమా ఆనందించండి:
మీరు జూలై లేదా ఆగస్టులో పారిస్‌లో హనీమూన్ టూర్‌లో ఉన్నట్లయితే, పార్క్ డి లా విలెట్ వద్ద ఓపెన్ ఎయిర్ సినిమాలో ఫిల్మ్ స్క్రీనింగ్‌ను ఉచితంగా చూడవచ్చు. సుందరమైన, చల్లని గాలుల మధ్య, నక్షత్రాల కింద మీ ప్రియమైన వారితో గడపడం నిజంగా ఒక మరచిపోలేని అనుభవం.
8. కెనాల్ సెయింట్ మార్టిన్ వద్ద విరామం:
ఇనుముతో చేయబడ్డ ఆకుపచ్చని ఫుట్‌బ్రిడ్జ్‌లు, చెట్ల నీడతో కప్పబడిన మార్గాలు.. నీటి పక్కన కదలాడుతున్న స్వింగ్ వంతెన మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు ఈ సందడిగల ప్రాంతంలో సంచరించవచ్చు. ఆ ప్రాంతాన్ని చూస్తూనే పిక్నిక్ అనుభూతిని పొందవచ్చు. పడవలను చూస్తూ ఆనందిచవచ్చు. మీరు కాలువ పక్కనే గీయబడిన గ్రాఫిటి ఆర్ట్, మల్టీమీడియా ఆర్ట్‌లను చూసే అవకాశం లభిస్తుంది.
9. సెమెట్రీ ప్రె లాచైసే:
పారిస్ ఆకర్షణల జాబితాలో స్మశానం కూడా ఉంటుందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్మశానం ఆతిధ్యమిచ్చే ప్రముఖుల జాబితాను చూడాలి. గెరికల్ట్, ఈజిప్టలిస్ట్ ఛాంపోలియన్, బల్జాక్, బిజెట్, పియాఫ్, మొడిగ్లియాని, ఆస్కార్ వైల్డ్, జిమ్ మొర్రిసన్, మధ్యయుగ ప్రేమికులు హెలోయిస్ మరియు అబెలార్డ్ సమాధులు ఇక్కడ ఉన్నాయి.
10. లెఫ్ట్ బ్యాంక్ రివర్‌సైడ్:
కొంతకాలం క్రితం ఇది లెఫ్ట్ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్‌వేగా ఏర్పడింది. ఇప్పుడు మ్యూసీ డి’ఓర్సే మరియు పాంట్ డి ఎల్’అల్మా మధ్య ఉన్న సియెన్ ఒడ్డు.. అందమైన రివర్ సైడ్ వాక్‌గా మార్చబడ్డాయి. షికారు చేయచ్చు, సుందరమైన వీక్షణ ఆనందించవచ్చు, చెక్క స్లీపర్స్ పై కూర్చుని వీక్షించవచ్చు, యోగా లేదా తాయ్ చి చేయవచ్చు.
11. అరెనెస్ డి లూటెస్:
క్రీస్తు శకం 1వ శతాబ్దం చివరలో నిర్మించబడిన అర్థ-వృత్తాకార ఆంఫీ థియేటర్.. రోమన్ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది.
12. డొమైన్ నేషనల్ డి సెయింట్-క్లౌడ్:
కాన్సెప్ట్ పార్క్, ఫార్మల్ గార్డెన్స్, చెటేవు గార్డెన్స్, కొలనులు మరియు ఫౌంటైన్లను చూస్తూ.. ప్రకృతి సౌందర్యం, దాని పూర్తి వైభవాన్ని మీరు ఆనందించవచ్చు. ప్రకృతి యొక్క ఉత్తమమైన అన్వేషణ కోసం.. పారిస్‌లో చేయవలసిన ఉచిత విషయాలలో ఒకటి.
13. స్క్వేర్ డు వర్ట్-గాలంట్:
మీరు పాంట్ నీఫ్ నుంచి మెట్లు దిగవచ్చు. గడ్డి మీద విశ్రాంతి తీసుకుంటూ అటుగుండా ప్రయాణిస్తున్న పడవలను చూడవచ్చు. ఇది పారిస్‌లో ఉచితంగా చేయాల్సిన వాటిలో ఇది ఒక ఉత్తమమైన పని.
14. విక్టర్ హ్యూగో జీవితం :
1832 నుండి 1848 వరకు విక్టర్ హ్యూగో అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్.. ఇప్పుడు మంత్రముగ్ధమైన మ్యూజియంగా మార్చబడింది. దీనిలో గోతిక్ మరియు చైనీయుల-శైలి ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశాడు. తన సహచరి జూలియట్ డ్రౌట్ కోసం.. అక్కడ నివసిస్తున్నపుడు, అతని డ్రాయింగ్స్ మరియు క్యారికేచర్స్‌ను హ్యూగో కుమారులు ఫోటోగ్రాఫ్స్ తీశారు.
15. మాంట్‌పార్నసీ:
అస్సాస్ చట్టం అధ్యాపకుల సమీపంలో, 1928 నుండి 1967 వరకు శిల్పి ఓసిప్ జాడ్కిన్ మరియు అతని చిత్రకారుడు భార్య వాలెంటైన్ ప్రెక్‌కు నివాసంగా ఉన్న ఒక చిన్న స్టూడియో-మ్యూజియం ఉంటుంది. ఇల్లు, పరిసర తోట, గార్డెన్ స్టూడియో మరియు ఖరీదైన సేకరణ కళ.. మాంట్‌పార్నసీ యొక్క కళాతృష్ణను చాటుతుంది.
16. పారిస్ ఫ్లీ మార్కెట్లు:
పారిస్‌లో చేయదగిన ఉచిత విషయాల్లో ఫ్లీ మార్కెట్లలో చుట్టూ తిరగడం కూడా ఒకటి. ఇక్కడ నడవడంతో పాటు విండో షాపింగ్‌లో మీరు మునిగిపోతారు. మీరు ప్యారిస్‌లోని ఉత్తమమైన వస్తువులను చూసే అవకాశం చిక్కుతుంది.
17. జర్డిన్ డెస్ సెరెస్ డి’ఆటెయిల్:
‘పురపాలక ఉద్యానవనం’గా కూడా ఈ బొటానికల్ ఉద్యానవనం పిలవబడుతుంది. 1761 లో మొక్కల పెంపకం కోసం ప్రారంభించగా.. ఒక తాటి ఇల్లు, ఆర్చిడ్స్, అజీయ మొక్కలు, సక్సలెంట్స్ మరియు ఫెర్న్స్ ఇక్కడ ఉన్నాయి. అనేక అరుదైన చెట్లు కలిగిన ఫార్మల్ గార్డెన్స్ ఇవి.
18. గాలరీస్ లాఫాయెట్:
ఫ్యాషన్ షో చూడకుండా పారిస్ వదిలివెళ్లడం పాపం అవుతుంది. ప్రతి సోమవారం మరియు శుక్రవారం 3 గంటలకు.. గాలరీస్ లాఫాయెట్ వద్ద అత్యుత్తమ ఫ్రెంచ్ ఫ్యాషన్‌ను ఉచితంగా చూడవచ్చు. పారిస్‌లో ఫ్యాషన్‌ను మీరు ఇష్టపడితే తప్పక చూడాల్సిందే.
19. లా నిట్ట్ బ్లాంచే:
ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో మొదటి శనివారం మరియు ఆదివారం సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మీరు గ్యాలరీలు, స్టేట్ భవనం, మ్యూజియంలు మరియు ఈత కొలనుల వంటి వినోద సౌకర్యాలను ఉచితంగా పొందవచ్చు.
20. ఐఫిల్ టవర్‌ను రాత్రి పూట చూడడం:
ఐఫిల్ టవర్ పైకి వెళ్లేందుకు మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అందుకే చాంప్స్ డు మార్స్ లేదా ప్లేస్ డు ట్రోకాడెరో వద్ద కూర్చుని, వెలుగు జిలుగులతో మెరిసిపోతున్న ఐఫిల్ టవర్ చూడచ్చు. ఈ ప్రదర్శన ఆస్వాదించడం మర్చిపోవద్దు!