Travel Blog by Thomas Cook India

కర్నాటకలో సందర్శనకు 10 ఉత్తమ స్థలాలు

భారతదేశ పర్యాటక పటంలో ఖ్యాతి గడించిన ప్రాంతంగా కర్ణాటక ఉంది. పశ్చిమ తీరం, దక్కన్ పీఠభూమి మధ్య ఉన్న ప్రాంతం కర్నాటక. ఈ రాష్ట్రంలో అడవులు, కొండలు, దేవాలయాలు, గుహలు, నదులు, సరస్సులు, కాఫీ ఎస్టేట్లు, జలపాతాలు, పురాతన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కర్నాటకలో సందర్శించడానికి స్థలాల జాబితా ఉంది.

కర్నాటకలో సందర్శించడానికి స్థలాలు

1. బెంగళూరు:

బెంగుళూరు, కర్నాటక రాష్ట్రంలో ఉన్న ఉత్తమమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ నగరంలో ఉండడానికి మరియు చక్కర్లు కొట్టడంలో బోలెడంత ఆనందం ఉంది.

2. కూర్గ్:

పర్వతాలతో నిండిన ఈ సుందరమైన ప్రాంతంలో, ఆకుపచ్చని కాఫీ ఎస్టేట్‌ల నుంచి వచ్చే సువాసన, పర్వతాల దిగువనున్న అద్భుతమైన జలపాతాలు వంటివాటితో కూర్గ్‌ను ‘భారతదేశం యొక్క స్కాట్లాండ్’ అని గుర్తింపు పొందింది. ఇది కర్ణాటకలో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలలో ఒకటిగా ఉంది.

3. హంపి – కర్నాటకలో సందర్శించవలసిన ప్రాంతాలలో ఒకటి:

ప్రపంచ చారిత్రక సంపదగా యునెస్కో గుర్తించిన ఈ ప్రాంతం, విజయనగర రాజ్యానికి చెందిన వైభవాన్ని ప్రదర్శిస్తుంది. హంపిలో దాదాపు 500 నిర్మాణాలు శిథిలావస్థలో ఉన్నాయి.

4. బాదామి, ఐహోళే మరియు పట్టడకల్:

మురికి రోడ్లు, బంజరు స్థలాకృతి, ఎర్రని రాతి నిర్మాణం, రాతి శిఖరాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన బాదామి, ఐహోళే మరియు పట్టడకల్‌లో ప్రతిబింబిస్తాయి.

5. కాబిని:

కర్నాటకలో ఒక సుందరమైన మరియు ప్రశాంతమైన పర్యాటక ప్రదేశం కాబిని. అదే పేరుతో గల నది ఒడ్డున ఈ ప్రాంతం కలదు. కర్నాటక పర్యాటక ఆకర్షణలలో ఒకటి.

6. జోగ్ ఫాల్స్:

అద్భుతమైన జోగ్ జలపాతం దేశంలో రెండవ అతి పెద్ద జలపాతం. ఇది కర్ణాటక పర్యాటక ప్రదేశాల ఆకర్షణలలో ఒకటి.

7. మంగళూరు:

మంగళూరులో సముద్రతీరాలలో సేద తీరడం, సన్ బాత్, సూర్యాస్తమయ సమయంలో సీఫుడ్ ప్రయత్నించడం, సూర్యాస్తమయాలను చూడటం, షిప్‌యార్డ్‌ను సందర్శించడం తప్పనిసరి. ఇది కర్ణాటక యొక్క ఆసక్తికర ప్రదేశాలలో ప్రసిద్ధి చెందింది.

8. కార్వార్:

సముద్రంతో ముద్దు పెట్టుకున్నట్లుగా ఉన్న బీచ్‌లు, మనోహరమైన దేవాలయాలు, అద్భుతమైన కోటలు వంటి ఎన్నో సమూహాలతో మీ కోసం కార్వార్ సిద్ధంగా ఉంది.

9. గోకర్ణ:

పూర్తి ఓదార్పు కోరుకునే యాత్రికులు ఈ అందమైన తక్కువ అంచనా వేయబడిన, తక్కువ వాణిజ్యపరం అయిన ఈ బీచ్ పట్టణాన్ని సందర్శించండి. దాని నిశ్శబ్ద మనోజ్ఞతను ఎందరో యాత్రీకుల మనసులను గెలుచుకుంది.

10. దండేలి:

అద్భుతమైన ప్రకృతితో పాటు, సాహస క్రీడలు ఇష్టపడేవారు మెచ్చే దండేలి. ఆకురాల్చు అడవులు మరియు వన్యప్రాణుల నివాసాలతో చుట్టుముట్టిన ఈ సుందరమైన పర్వతభాగం గొప్ప సాహస కేంద్రం. ఇది కర్ణాటకలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.