Travel Blog by Thomas Cook India

పర్యాటకులు తప్పక చూడాల్సిన 30 నగరాలు

ప్రయాణాలు ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేనివే. అలాగని ఇదేమీ అందని ద్రాక్ష కాదు. ఈ ప్రపంచం ఎంతో విస్తారమైనది. అన్నింటినీ చూసేందుకు తగినంత సమయం ఎవరి వద్దా లేదు. మీ విధులు మిమ్మల్ని ఆపేస్తాయి. బంధాల కోసం సమయం వెచ్చించాలి. ఇలాంటి పరిస్థితులలో, మీరు మీ పర్యటనలను ప్లాన్ చేసుకునేటపుడు.. మీ పై అపరాధం రాకుండా చూసుకోవడం ఎలా? దీనికి సమాధానం మీ దగ్గర లేదు. అయితే, మీ తప్పు లేకుండా మీ సెలవులను ఆస్వాదించడం ఎలాగో తెలుసుకుంటే, మీ సందర్శన కోసం ప్రపంచంలోని ఉత్తమ నగరాల జాబితా ఇక్కడ సిద్ధంగా ఉంది.

1. కేప్ టౌన్, దక్షిణ ఆఫ్రికా:

ఒక టేబుల్‌పై పర్వతాన్ని ఉంచినట్లుగా కనిపించినా, ఇక్కడ పర్వతాలపై భోజనం చాలా కష్టమైన విషయమే!

 

2. వెనిస్, ఇటలీ:

ఇందుకోసం ఇతరుల మాటలు వినకండి. వెనిస్ అంటే ఇటలీకి ధారావి కాదు. ఇది రొమాంటిక్ ప్రియులకు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఇది ఒకటి.

 

3. న్యూయార్క్ సిటీ, యూఎస్ఏ:

ఎర్రటి మెట్లు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, న్యూయార్క్ స్టైల్ పిజ్జా.. ఇక చెప్పింది చాలు బాబూ.

 

4. ఏథెన్స్, గ్రీస్:

 

5. దుబాయ్, యుఏఈ:

సంస్కృతి, పట్టణీకరణల సంపూర్ణ సమ్మేళనం. మీ సమస్యలకు ఇక్కడ వీడ్కోలు పలికేయవచ్చు.

 

6. ఆమ్‌స్టర్‌డామ్, నెదర్లాండ్స్:

అన్నే ఫ్రాంక్ మ్యూజియంలో గతం గురించి తెలుసుకోవచ్చు. ఒక సుందరమైన కాలువలో పడవ ప్రయాణంతో పరిపూర్ణ సాయంత్రం అనుభవించవచ్చు.

 

7.  కోపెన్‌హాగన్, డెన్మార్క్:

లిటిల్ మెర్మయిడ్ సినిమా చూడ్డం కంటే లిటిల్ మెర్మయిడ్ శిల్పం చూడడం ఎంతో సుందరంగా ఉంటుంది. ఇందుకోసం ఒట్టు వేసుకోండి.

 

8. ఇస్తాంబుల్, టర్కీ:

ఫ్రెంచ్ కవి అల్ఫోన్స్ డి లామార్టిన్ యొక్క మాటల్లో చెప్పాలంటే, “ఒక్క దశలో ప్రపంచాన్ని అందించాల్సిన అవసరం వస్తే.. అది ఒక ఇస్తాంబుల్ మాత్రమే”

 

9. బెర్లిన్, జర్మనీ:

న్యూయార్క్ సంస్కృతి, టోక్యో ట్రాఫిక్ వ్యవస్థ, సీటెల్ స్వభావం, బెర్లిన్ చారిత్రక సంపదలు.. బెర్లిన్ చూసేందుకు ఇవి చాలవూ!

 

10. ప్రేగ్, చెక్ రిపబ్లిక్:

యురోపియన్ నగరాలను నెక్‌లేస్‌గా భావిస్తే.. ఆ ముత్యాల మధ్య అద్భుతమైన వజ్రం ప్రేగ్. ఉత్తమ సందర్శనా స్థలాల జాబితాలో ఇది చేరడం మీకు ఆశ్చర్యం కలిగిస్తోందా?

 

11. సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా:

 

12. బార్సిలోనా, స్పెయిన్:

మీరు మా కోసం రాయడానికి వెళుతున్నారా.. కానీ స్పెయిన్‌లో చాలామందికి నచ్చిన అందమైన ప్రదేశం బార్సిలోనా.

 

13. సీటెల్, వాషింగ్టన్:

సీటెల్‌లో ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి దాగి ఉంది. గ్రే అనాటమీ లేదా ట్విలైట్ అభిమానులుగా మారిపోవడం ఖాయం.

 

14. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా:

ఇది హాలీవుడ్! ఇతర ప్రపంచానికి గల ఆత్మగౌరవాన్ని సవాలు చేయగల ప్రాంతం ఇది. అలా అనిపించడం లేదా?!

 

15. లాస్ వేగాస్, నెవాడా:

లగ్జరీ హోటల్స్, గ్రాండ్ క్యాసినోలు, వద్దని చెప్పకుండా ఆల్కహాల్ తీసుకునే సౌలభ్యం. అనేక మందికి ఇది కలల పర్యటనే!

 

16. మాడ్రిడ్, స్పెయిన్:

రాత్రిని చంపేసేంత వరకూ మాడ్రిడ్‌లో ఎవ్వరూ నిద్రపోయేందుకు వెళ్లరని ఓ సామెత ఉంది. అందుకే ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల జాబితాలో మాడ్రిడ్ చేరింది.

 

17. ప్యారిస్, ఫ్రాన్స్:

ప్రపంచంలోని ఏ ప్రాంతంలో అయినా సరే గడిపే ఉత్తమమైన రోజు కంటే.. ప్యారిస్‌లో ఒక చెడు రోజు నయం.

 

18. హోనలూలూ, హవాయి:

హోనోలులులో అన్నీ ఉన్నాయని అంటారు. పిల్లల కోసం ఇసుక, భార్య కోసం సూర్యుడు, అత్తగారి కోసం సొరచేపలు!

 

19. డెన్వర్, కొలరాడో:

రాళ్లతో కూడిన వాతావరణం మిమ్మలని డెన్వర్‌లో ఏమాత్రం అలసట చేకూర్చదు. అదే కొలరాడో రాళ్ల మహిమ.

 

20. ఒర్లాండో, ఫ్లోరిడా:

ప్రపంచంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఓర్లాండో.. బ్లూమ్.

 

21. సిడ్నీ, ఆస్ట్రేలియా:

కంగారూలతో అనుకోకుండా కలుసుకునే క్షణాలపై రహస్యాన్ని మీరు ఛేదించాల్సిందే!

 

22. షాంఘై, చైనా:

చైనా ప్రజల ఆలోచనలను ఇతరులకు విక్రయించడానికి షాంఘైని ఉపయోగిస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఇది అతి పెద్దది!

 

23. సాంటోరిని, గ్రీస్:

ఒక అగ్నిపర్వతం బద్దలైన తర్వాత అక్కడ ఏర్పడిన నాగరికత కోసం సాంటోరిని సందర్శించాల్సిందే. ఇది అందంగా చల్లగా ఉండే ప్రదేశం.

 

24. జ్యూరిచ్, స్విట్జర్లాండ్:

దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో చూపిన ఫ్యాంటసీలను గడిపేందుకు అతి దగ్గరగా ఉన్నారు. చివరకు జ్యూరిచ్‌కు రైలు ఎన్నింటికి వస్తుందో సమాధానం కూడా మీకు తెలుస్తుంది.

 

25. ఎడింబర్గ్, స్కాట్లాండ్:

మీ డ్రెస్సెస్ రెడీ చేసుకోండి. ఎడింబర్గ్ చాలా అందంగా ఉంటుందని అందరూ చెబుతారు. మీ హృదయాన్ని మళ్లీ మళ్లీ బద్దలు కొట్టేయగలదు.

 

26. ఖాట్మండు, నేపాల్:

చరిత్ర, కళ, సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థల సమ్మేళన. ఒత్తిడి ఎక్కువగా కనిపించినా.. ఖాట్మండు అంతకంటే ఎక్కువగానే అందిస్తుంది.

 

27. టోక్యో, జపాన్:

టోక్యో 200 పాటల్లో గురించి ప్రస్తావించారంటే.. ఈ నగరం స్థాయి అర్ధమవుతుంది.

 

28. జైపూర్, ఇండియా:

సంస్కృతికి అచ్చమైన ప్రతిబింబం. మీరు పింక్‌లో మునిగి తేలాల్సిందే.

 

29. మెక్సికో సిటీ, మెక్సికో:

మెక్సికో సిటీ జీవనశైలి మిమ్మల్ని అసూయతో రగిలేలా చేస్తుంది. మనసు మినుకు మినుకుమనడం ఖాయం.

 

30. సింగపూర్:

మెర్లియోన్ పక్కన ఫోటో తీసుకుని షేర్ చేస్తే.. ఆ ఆనందమే వేరు.

 

ప్రపంచంలోని ఈ ఉన్నత నగరాలను సందర్శించేందుకు మీలో స్ఫూర్తి రగిలిందని మాకు తెలుసు. పాస్‌పోర్ట్ సిద్ధం చేసుకుని వెంటనే ప్రయాణానికి వెళ్లేందుకు ఖచ్చితంగా మీ వాలెట్ సహకరించకపోవచ్చు. కానీ జీవిత కాలం నిలిచిపోయే జ్ఞాపకాలను ఈ నగరాలు అందిస్తాయి.