Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

ఇన్‌స్టా జనాలు మెచ్చిన వరల్డ్ టాప్-10 ప్రాంతాలివే

టూర్లు, షికార్లు అంటే జనాలకు బాగా ఇష్టం. నిజంగా సాధ్యం కావాలే కానీ.. అసలు అంతమే లేకుండా ప్రయాణాలు చేసేసేందుకు సిద్ధపడే వాళ్లు చాలామందే ఉంటారు. ఇలాంటి వెకేషన్స్‌లో జనాలు ఎక్కువగా చేసే పనేంటంటే.. ఆయా ప్రదేశాలను తమ కెమేరాల్లో బంధించి జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడం. తాము ఎంజాయ్ చేస్తున్న వైనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపించడం కూడా ఇప్పుడు ట్రెండ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఫిల్టర్లు అప్లై చేసి.. ఫోటో షేరింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్చర్స్ షేర్ చేయడం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన విహార ప్రాంతాలు ఉండగా, జనాలు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్న టాప్-10 ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

1. టైమ్స్ స్క్వేర్, న్యూయార్క్:

చదరం ఆకారంలో ఉన్న ఈ ఓపెన్ స్క్వేర్ ప్రాంతంలో వేలకొద్దీ స్క్రీన్స్, రంగురంగుల లైట్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది సహజమైన వింతల్లో ఒకటి కాకపోవచ్చు. కానీ అన్ని రకాలుగాను ప్రపంచవింతల్లో ఒకటిగా చోటు సంపాదించుకునేందుకు అన్ని అర్హతలు ఉన్న ప్రాంతమే.

2. ఇస్తాంబుల్ – ఇస్తిక్‌లాల్ కడేసి:

Istanbul – Istiklal Caddesi

ఇస్తిక్‌లాల్ కడేసిలో ఇండిపెండెంట్ స్ట్రీట్‌లో ఉన్న బొటిక్‌లు, మ్యూజిక్ స్టోర్స్, బుక్ స్టోర్స్, ఆర్ట్ గ్యాలరీలు, సినిమాలు, థియేటర్లు, లైబ్రరీలు, కేఫ్‌లు, పబ్‌లు, నైట్ క్లబ్బులు, లైవ్ మ్యూజిక్, చారిత్రక ప్రాంతాలు, చాకొలేట్ ఐటెమ్స్, రెస్టారెంట్స్‌తో పాటు ఆకట్టుకునే అనేక ప్రాంతాలలో విజిటర్లు తమను తాము కెమేరాల్లో బంధించేస్తూ ఉంటారు.

3. బార్సిలోనా – పార్క్ గుయెల్:

బార్సిలోనాలోని పార్క్‌ గుయెల్‌లో ఉన్న ప్రశాంతమైన పూదోటల్లో నడుస్తూ.. టూరిస్టులు, స్థానిక ప్రజలు ఎంతో ప్రశాంతత పొందుతూ ఉంటారు. ఆ అందమైన సుందర ఉద్యానవనాలను ఫోటోలుగా తీసి ప్రపంచానికి చూపుతూ ఉంటారు. బార్సిలోనాను సందర్శించేవారిలో అనేక మంది ఈ ప్రాంతంలో సేదతీరుతూ స్వర్గంలో ఉన్నట్లుగా భావిస్తారు.

4. పారిస్ – ఐఫిల్ టవర్:

ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు చిహ్నంగా నిలుస్తున్న ఈ టవర్.. 21వ శతాబ్దంలోనూ అద్భుతమైన కళాకృతుల్లో ఒకటి. ఐఫిల్ టవర్ సౌందర్యం, తరగని ఖ్యాతి.. మొత్తం పారిస్‌ నగరానికే వన్నె తెస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అవుతున్న వాటిలో ఐఫిల్ టవర్ ఒకటిగా నిలిచింది.

5. సెయింట్ పీటర్స్‌బర్గ్ – నెవ్‌స్కై ప్రాస్పెక్ట్:

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 4.4 కిలోమీటర్ల పొడవు ఉన్న రోడ్డు నెవ్‌స్కీ ప్రాస్పెక్ట్‌. రాస్ట్రెలిస్క్ స్ట్రాంగోవ్ ప్యాలెస్, పురాతన భారీ కజన్ కేథడ్రల్, ఆర్ట్ నౌవీ బుక్‌హౌస్, ఎలిసెఫ్ ఎంపోరియం, అరడజన్‌కు పైగా ఉన్న చర్చ్‌లతో పాటు ఫోటోల్లో బంధించే మరిన్ని ప్రాంతాలు ఉంటాయి.

6. దుబాయ్ – బుర్జ్ ఖలీఫా:

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటైన బుర్జ్ ఖలీఫా ఎత్తు 830 మీటర్లు. అత్యధికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలు షేర్ చేయడానికి ఇది ఒక కారణం. బుర్జ్ ఖలీఫాకు బాహ్యంగా ఉండే అబ్జర్వేషన్ డెక్ నుంచి బయటకు చూడాలంటే.. ఊపిరి ఆగిపోయినంత పనయిపోతుంది.

7. సావో పావోలో– పార్క్ ఇబిరాప్యురా:

వాకింగ్, జాగింగ్‌తో పాటు సరదాగా సయమం గడిపేందుకు సుందరమైన ఉద్యానవనం ఇబిరాప్యురా పార్క్. పచ్చదనంతో నిండిన ఈ ప్రదేశం ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడకు వచ్చేవారిలో అత్యధికం యువత కావంతో.. ఈ పార్క్‌కి సంబంధించిన అనేక ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చేసి, విశ్వవ్యాప్తంగా చక్కర్లు కొట్టేస్తుంటాయి.

8. పెరు – మాచు పిచు:

చరిత్రకు సంబంధించిన ఆనవాలు, ఆకాశహర్య్మాలను తలిపించే నిర్మాణాలు గల మాచు పిచు నగరాన్ని తప్పనిసరిగా సందర్సించాల్సిదే. 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతం, నిర్మాణాలలో అద్భుతమైన కళాకృతులు కనిపిస్తాయి. ఇంతటి మహోన్నత ప్రాంతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా చక్కర్లు కొట్టే టాప్-10 జాబితాలో చేరడం ఆశ్చర్యమేమీ లేదు.

9. లండన్ – టవర్ బ్రిడ్జ్:

లండన్‌లో 1894లో ప్రారంభమైనప్పటి నుంచి అద్భుతమైన సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన టవర్ బ్రిడ్జ్.. బ్రిటిష్ జాతీయ స్థూపాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ప్రత్యేకమైన నిర్మాణ శైలి గల ఈ నిర్మాణం.. మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ప్రాంతాల్లో ఒకటి.

10. రోమ్ – కొలోసియం:

రోమన్ల గత వైభవం, గొప్పదనం, శక్తియుక్తులకు అసలు సిసలైన జ్ఞాపకం కొలోసియం. అందుకే ఈ ప్రాంతానికి ఫోటోగ్రాఫర్లతో పాటు యాత్రీకులు కూడా విపరీతంగా వస్తుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుందర ప్రాంతాల్లో అత్యధికంగా ఫోటోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అవుతున్న జాబితాలో ఇవి అతి కొన్ని మాత్రమే. ఇంకా చెప్పాలంటే సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే అనుకోవచ్చు. మీకు విపరీతంగా నచ్చేసి, ఈ జాబితాలో ఏదైనా ప్రాంతం కనిపించకపోతే.. కామెంట్స్ సెక్షన్‌లో మాకు తెలియచేయండి. అప్పటివరకూ మీ ప్రయాణాలను కంటిన్యూ చేస్తూ.. మరిన్ని సుందర ప్రాంతాలను ఫోటోలుగా తీసేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేసి ప్రపంచ ప్రజలకు చూపించేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *