Travel Blog by Thomas Cook India

అండమాన్ దీవుల గురించి ఈ రహస్యాలు తెలుసుకోండి

ప్రకృతి సౌందర్యం నిండిన పలు అందమైన, ప్రాచీనమైన బీచ్‌లు అండమాన్ ద్వీపాలలో ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆనందాన్ని ఇస్తాయి. అండమాన్ ద్వీపాలలో వివిధ ప్రకృతి దృశ్యాల అందాలను చూసిన ప్రయాణికులు గర్విస్తారు. ఈ ద్వీపాల గురించి మీరు తెలుసుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. అండమాన్ చేరుకోవాలని మీరు ప్లాన్ చేసినప్పుడు, మీరు ఈ ద్వీపం గురించి సమాచారాన్ని తెలుసుకోవాలి.

అండమాన్ ద్వీపాల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు:

 

1. అండమాన్ పేరు హనుమంతుడి నుండి ఉద్భవించిందని చెబుతారు. మలేషియా వాసులు హండుమాన్‌ అనే పేరు ఉపయోగించగా.. దాని నుంచి ఈ దీవులకు ప్రస్తుత పేరు వచ్చింది.

2. ఈ ద్వీపాల నివాసితులు ఎక్కువగా ‘ఆదివాసీ’ అని పిలవబడే ‘జర్వా’ తెగలో సభ్యులు. 500 మంది జనాభాకు బయటివారితో ఎలాంటి సంబంధాలు లేవు.

3. ఇక్కడ ఉపయోగించే సాధారణ భాష బెంగాలీ. తరువాత హిందీ, తెలుగు, తమిళం మరియు మలయాళం మాట్లాడుతారు.

4. ఈ స్థలాలలో శాశ్వతమైన సముద్ర సంస్కృతులు ఉన్నాయి. అన్నింటిలోనూ అత్యంత ప్రజాదరణ పొందినవి సముద్ర తాబేళ్లు. ప్రపంచంలో అతిపెద్ద సముద్ర తాబేళ్లు అయిన డెర్మోకిల్స్ కొరీసియో చూడవచ్చు. అండమాన్ సముద్రంలో మీరు ఆలివ్ రిడ్లీ తాబేళ్లను చూడవచ్చు.

5. అతిపెద్ద జీవిస్తున్న ఆర్త్‌రోపోడ్ బిర్గస్ లాట్రో ఇక్కడ కనిపిస్తుంది. వాటిని కోకోనట్ క్రాబ్స్ అని కూడా పిలుస్తారు. పరిమాణంలో పెద్దగా ఉండే ఇవి నీటిని ద్వేషిస్తాయి. దక్షిణ ఆసియాలో ఈ పీతలు అత్యధిక సంఖ్యలో అండమాన్‌లోనే ఉన్నాయి.

6. ఈ ద్వీపాలలో చేపల వాణిజ్యం నిషేధించబడింది. ఈ భూమిపై అరుదైన ప్రదేశాల్లో ఇది ఒకటి. చేపలు వాటి పూర్తి జీవితాన్ని గడుపుతాయి మరియు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మాత్రమే చనిపోతాయి.

7. రెండు అండమాన్ ద్వీపాలకు నీల్ మరియు హేవ్‌లాక్ అంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల పేర్లు పెట్టారు.

8. అండమాన్ మరియు నికోబార్‌కు పొరుగున ఉన్న ఉష్ణమండల ద్వీపాల నుండి పొడవైన సీతాకోకచిలుకలు వస్తాయి. ప్రశాంతమైన అండమాన్ వాతావరణానికి కృతజ్ఞతలు చెబుతాయి. ఇవి సీతాకోకచిలుక ప్రేమికులకు మనోహరమైన దృశ్యాన్ని అందిస్తాయి.

9. పోర్ట్‌బ్లెయిర్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారెన్ దీవి, మీకు అగ్నిపర్వతాన్ని ప్రత్యక్షంగా చూపించే ప్రాంతం.

10. అండమాన్ మ్యాప్‌లో ఒక ప్రత్యేక ద్వీపం.. నాల్గవ అతిపెద్ద ద్వీపం అయిన లిటిల్ అండమాన్ కోసం పూర్తిగా ఒక రోజు ప్రణాళిక చేసుకోండి. ఇది అరుదైన సముద్ర తాబేళ్ల గురించి సంపూర్తి సమాచారం అందిస్తుంది.

అండమాన్ ద్వీపాలలో మీరు చేయగలిగిన 15 ఉత్తమ విషయాలు:


1. నీటి క్రీడలు:

స్నార్కెలింగ్, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, బనానా బోట్ సవారీలు, నీటి అడుగున నడక, పారాసైలింగ్, జెట్ స్కీయింగ్‌తో పాటు మరియు మరిన్ని పనులు చేయవచ్చు. ప్రతి నీటి కార్యకలాపం థ్రిల్‌ను అందిస్తుంది.

2. బీచ్ బమ్మింగ్:

కార్బిన్స్ కోవ్ మరియు లాంగ్ ఐల్యాండ్ వంటి అందమైన తీరాలను చుట్టేస్తూ.. సూర్యరశ్మిలో సేదతీరండి. సహజమైన పర్యావరణం, తెల్లని ఇసుక మరియు బంగాళాఖాతం చూస్తుంటే అద్భుత భావన కలుగుతుంది. మీరు రోజంతా అండమాన్ బీచ్‌లలో విశ్రాంతి తీసుకోవచ్చు. రోజంతా అందమైన మరియు నిర్మలమైన అనుభూతిని ఇస్తాయి. ఆ స్థలాన్ని త్వరగా వదిలివేయాలని మీరుఅస్సలు అనుకోరు.

3. ఐల్యాండ్ హాపింగ్:

అందమైన అండమాన్ ద్వీపాల వద్ద పర్యటించటం ఎంత ఆనందంగా ఉంటుంది? పోర్ట్ బ్లెయిర్ చేరుకున్న తర్వాత మీరు వివిధ దీవులను సందర్శించవచ్చు. పోర్ట్‌బ్లెయిర్ నార్త్ బే ఐలాండ్, రోస్ ఐలాండ్, వైపర్ ఐలాండ్, హేవ్‌లాక్ ఐలాండ్, జాలీ బూయ్ ఐల్యాండ్ మరియు నీల్ ఐలాండ్ వంటి అనేక ద్వీపాలు.. పలు ఫెర్రీలతో అనుసంధానించబడి ఉన్నాయి.

4. సముద్రం అడుగున నడక:

నార్త్ బే ద్వీపంలో సీ వాకింగ్ చేయడం ద్వారా ఎంతో వినోదం పొందవచ్చు. సముద్రం అడుగున నడిచేందుకు ఈత తెలియాల్సిన అవసరం లేదు. పోర్ట్‌బ్లెయిర్ నుంచి నార్త్ బే ఐలాండ్ సుమారు 30 నిమిషాల పడవ ప్రయాణ దూరంలో ఉంది. ఇక్కడ మీరు సముద్రపు నడక, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్, జెట్ స్కీ, మరియు స్పీడ్ బోట్ వంటి ఇతర జల క్రీడలను ఒకసారి ఎంజాయ్ చేస్తే.. జీవితకాల అనుభవం పొందవచ్చు.

5. పక్షులను చూడడం:

అండమాన్‌లో చిడియ తాపు లేదా బర్డ్ ఐలాండ్‌లో మడ అడవులు, అరణ్యాలు మరియు అసంఖ్యాక పక్షుల జాతులు ఉన్నాయి. పక్షులు రోజంతా తిరుగుతూ ప్రశాంతత కలిగిస్తాయి. భిన్నమైన ఆకృతులు, రంగు, పరిమాణం కల పక్షులు వివిధ చెట్ల మధ్య ఎగురుతాయి. ఆహారం కోసం చక్కర్లు కొడుతుంటాయి. మీరు ప్రకృతి ప్రేమికులు అయితే పక్షులను చూసే సమయంలో మీ సంతృప్తి అత్యున్నత స్థాయికి చేరుతుంది.

6. సూర్యోదయం, చంద్రగ్రహణం మరియు సూర్యాస్తమయం చూడటం:

అండమాన్ దీవులలో సూర్యోదయం, సూర్యాస్తమయం యొక్క అద్భుతమైన అందాలు కనిపిస్తాయి. అంతటి అందమైన దృశ్యాలను అసలు మిస్ చేసుకోలేరు.

7. వివిధ రకాల రవాణా వ్యవస్థలు:

అండమాన్‌లో మాత్రమే తిరిగే స్థానిక రవాణా సదుపాయం దుంగై, మక్కుజ్ మరియు ఇతర రకాల పడవలలో ప్రయాణాలను అండమాన్‌ దీవులలో చేయవచ్చు.

8. హేవ్‌లాక్ ఐలాండ్:

ఆసియాలో అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి అయిన రాధానగర్ బీచ్ సుందరమైన ప్రశాంత ప్రదేశం. బీచ్ 7 గా కూడా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంటుంది. సముద్రతీరం వద్ద అలల శబ్దాన్ని రోజు మొత్తం వినవచ్చు. హేవ్‌లాక్ ద్వీపంలోని ఎలిఫెంట్ బీచ్ వద్ద స్నార్కెల్లింగ్ చేయవచ్చు. ఇది చాలా ఆహ్లాదకరమైన స్నార్కెలింగ్ గమ్యస్థానాలలో ఒకటి.

9. పగడపు దిబ్బలు:

అండమాన్ ప్రసిద్ధి చెందిన రంగుల పగడపు దిబ్బల యొక్క అత్యుత్తమ దృశ్యాలను చూసేందుకు.. రెడ్ స్కిన్ ఐలాండ్ లేదా జాలీ బూయ్ ఐల్యాండ్ కు వెళ్ళండి. నీరు చల్లని స్థితి నుంచి మంచుగా మారే పలు దశలను చూసేందుకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

10. మ్యూజియం ట్రైల్:

అండమాన్‌లోని కొన్ని అద్భుతమైన మ్యూజియంలు పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్నాయి. అండమాన్ వాసులు, సెంటినల్స్, జరవాస్ మరియు వెంజెస్ అంటూ నాలుగు నెగ్రిటో తెగలను ఆంథ్రోపాలాజికల్ మ్యూజియం‌ ప్రదర్శిస్తుంది. ఈ ద్వీపాలలో జీవవైవిధ్యం ఉద్భవించినది అని సమాధురికా మెరైన్ మ్యూజియం వర్ణించింది.

11. సున్నపు గుహలు, బరతంగ్ మరియు దిగ్లిపూర్ గుహలు:

మీరు డిగ్లిపూర్లోని అల్‌ఫ్రెడ్ గుహలకు వెళ్ళినప్పుడు.. నేషనల్ జియోగ్రఫిక్ లేదా డిస్కవరీ ఛానల్స్‌లో మీకు కనిపించే గుహలకు ఏ మాత్రం తక్కువ అనిపించవు. ఈ గుహలు రామ్ నగర్ నుండి సుమారు 40 నిమిషాల ట్రెక్కింగ్ దూరంలో ఉన్నాయి. అందువల్ల మీలో ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే, అడవులలో ట్రెక్కింగ్ చేయాలనుకుంటే, ఇక్కడకు విచ్చేయాలి. ఈ గుహలు స్విఫ్ట్‌లెట్ గూళ్ళ కోసం ప్రసిద్ధి చెందాయి. ఇంకెక్కడా అనుభవించటానికి సాధ్యపడని విషయం ఇది.

12. మడ్ వోల్కనోస్, డిగ్లిపూర్:

చురుకైన బురద లాంటి వాల్కనో ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాల్లో ఇది ఒకటి. మొత్తం భారతదేశంలోనే అండమాన్ కోబార్ దీవులలో మాత్రమే డిగ్లిపూర్ మరియు బరెన్ క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి.

13. నివాసం లేని, స్తంభించిన దీవులు సందర్శించండి:

ఈ జాబితాలో ద్వీపాల గురించి చెప్పడం కొంత కష్టం. అనేక జనావాసం లేని దీవులు పర్యాటకులకు అందుబాటులో ఉండవు. కానీ అందుబాటులో ఉండేవి కొన్ని ఉన్నాయి. వీటిలో స్టీవర్ట్ ఐలాండ్, గిటార్ ఐల్యాండ్, లాంగ్ ఐలాండ్, రాస్ మరియు రాస్, జాలీ బూయ్, మరియు స్మిత్ దీవులు వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.

14. సీ ఫుడ్:

అండమాన్ దీవులలో అనేక జలాలు తాజా సముద్ర ఆహారాన్ని అందిస్తాయి. ఎండ్రకాయలు, చిన్నవయలు, పులి రొయ్యలు, మరియు విభిన్న రకాల చేపలు అండమాన్‌లో ఒక సముద్ర జీవుల ఆహార ప్రియుల భోజనం పళ్లేలలో భాగం అవుతాయి.

15. రాస్ ఐలాండ్ మరియు సెల్యులార్ జైలును సందర్శించండి:

మీరు చరిత్ర ప్రేమికుడు అయితే రోస్ దీవులు, సెల్యులార్ జైల్ ప్రాంతాలను మీరు అండమాన్‌లో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లో ఉండాలి. ఈ రెండు గమ్యస్థానాలు స్వతంత్ర పోరాట కాలం నాటి చరిత్రకు సంబంధించిన అనేక ఆనవాళ్లను అందిస్తున్నాయి. మీరు జైలులో లైట్ అండ్ సౌండ్ షో కూడా చూడవచ్చు.

ఈ జాబితా అండమాన్ ద్వీపాల గురించి మీరు అనేక అంశాలను చర్చిస్తుంది. మీ సంచులు ప్యాక్ చేసుకుని అండమాన్‌కు బయల్దేరండి.. వెంటనే విమాన టికెట్స్ బుక్ చేసుకోండి.