Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

మీ అంతర్జాతీయ ట్రిప్ కోసం విదేశీ మారకం కొంటున్నారా? మీరు ఈ అంశాలను నిర్ధారించుకోండి

విదేశాలకు వెళ్ళేటప్పుడు నిర్వహణ ఖర్చులు చాలా ముఖ్యమైనవి. కేవలం మీ పర్యటన కోసమే కాదు.. గమ్యస్థానానికి చేరుకోవడం, అక్కడ ఆవాసం, తిరిగి వచ్చేందుకు కూడా ఫారెక్స్ అవసరం. మనం దీన్ని నిర్వహించవచ్చు, అదేమీ పెద్ద విషయం కాదు. కానీ అసలు సమస్య అంతా విదేశీ మారకం కొనుగోలు దగ్గరే ఉంటుంది. మీరు విమానం ఎక్కక ముందే విదేశీ మారకం కొనుగోలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మీకు ఇది సులభంగా అనిపిస్తే.. మీరు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న ప్రతిసారీ ఈ కింది అంశాలు గమనించండి.

Right

 

ఫారెక్స్ కొనుగోలు సమయంలో చేయాల్సినవి

1. మీ ప్రయాణ గమ్యస్థానం యొక్క విదేశీ కరెన్సీ మార్పిడి రేటు గురించి తెలుసుకోండి:

మీ ప్రయాణానికి ముందుగానే సిద్ధం కావడం ముఖ్యం. మీ ఖర్చులు ప్రధాన ప్రమాణంగా ఉండడంతో, మీ గమ్యం యొక్క కరెన్సీ, దాని మారకపు రేట్లు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడు, ఎక్కడ విదేశీ కరెన్సీ ఎప్పుడు ఎక్కడ కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు సహాయం చేస్తుంది.

2. మీరు ముందుగానే విదేశీని కొనుగోలు చేస్తున్నారని నిర్ధారించుకోండి:

http://epSos.de ARt

మీరు మీ ప్రయాణం ప్రారంభమయ్యేందుకు ముందుగానే విదేశీ మారకం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. మార్పిడి రేటు ఆధారంగా విదేశీ మారకం కొనడానికి సరైన సమయం కాదా అని నిర్ణయించే అవకాశం ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్‌ఛేంజ్ రేటుపై అంచనాకు వచ్చి, తక్కువ స్థాయిలో లభిస్తుందేమో అని తనిఖీ చేయడానికి కొంత సమయం లభిస్తుంది.

3. మీ విదేశీ కరెన్సీని మొత్తం ఖర్చు చేయండి:

మీ విదేశీ డబ్బు మొత్తాన్ని ఖర్చు చేయమని చెప్పినప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు. వ్యక్తిగతంగా పొదుపు చేయాలనే అంశాన్ని మేము కూడా సమర్ధిస్తాం. అయితే, ఇక్కడ సందర్భం భిన్నంగా ఉంటుంది. మీరు దాని గురించి ఆలోచిస్తే, మీరు మిగిలిపోయిన విదేశీ కరెన్సీని విక్రయిస్తున్నప్పుడు, నష్టపోవాల్సి ఉంటుంది. దీనికి కారణం చాలా తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు. మీరు రెండుసార్లు మీ డబ్బు మార్పిడి చేసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న ఎవరైనా మీ కుటుంబ సభ్యులు మీకు భారీగా డబ్బును బహుమతిగా ఇచ్చినప్పుడే ఇది సాధ్యం.

4. పోలిక తప్పనిసరి:

విదేశీ మారకం లావాదేవీలను నిర్వహించేందుకు అనేకమంది విక్రేతలు ఉన్నారు. అయితే ప్రతివారు వేర్వేరు మార్పిడి రేటును అందిస్తారు. అందువల్ల, మీరు పూర్తిస్థాయిలో పరిశోధించి ఉత్తమ మార్పిడి రేట్లు అందించే విక్రేతను గుర్తించడం చాలా ముఖ్యం. ప్రతీ పైసా ముఖ్యం కదా.

5. 30/70 నియమాన్ని పాటించండి:

మీరు ఈ విధానం కచ్చితంగా అమలు చేసినట్లయితే, ఖర్చు తగ్గించడానికి ఇది అతి ఉత్తమమైన వ్యూహం. మీ ట్రిప్ అంతటా మీరు అయ్యే మొత్తం వ్యయం అనే అంశాన్ని గుర్తించండి. ఆ తరువాత ఆ మొత్తంలో 30% నగదు రూపంలో ఉంచండి. మీ విదేశీ కరెన్సీ కార్డులో మిగిలిన 70% ఉంచండి. అయితే, ఒక విదేశంలో మీరు వెళ్లే ప్రతిచోటా మీ జేబుల నిండా నగదు నింపుకుని వెళ్లలేరు. అంతేకాకుండా, ప్రీలోడెడ్ ఫారెక్స్ కార్డులుఅవాంతరం లేనివి మరియు మీ డబ్బు సురక్షితంగా ఉంచుతాయి.

6. అధికారిక ఫారెక్స్ విక్రేతల నుండి మాత్రమే ఫారెక్స్ కొనుగోలు చేయండి:

అమ్మకందారుల సమూహాలు విదేశీ లావాదేవీలు నిర్వహరిస్తున్నట్లు చెబుతుంటారు. అందుకే మీరు 100% లావాదేవీలు నిర్వహిస్తున్న వాస్తవమైన అధికారికా డీలర్ అవునా కాదా అనే విషయాన్ని, ఫారెక్స్ మారకం నిర్వహించేందుకు అధీకృతం అయిన డీలర్ అవునా కాదా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు మోసపోయే ప్రమాదం ఉంది.

విదేశీ మారక కొనుగోలు సమయంలో చేయకూడనవి

1. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ≠ ఫారెక్స్ కార్డ్:

ఈ రెండు ఒకటి కాదు. ఈ దురభిప్రాయం వదిలించుకోండి. మీరు మీ అంతర్జాతీయ డెబిట్ కార్డును విదేశాలకు తీసుకువెళ్లినపుడు మీరు భారతీయ కరెన్సీలో ఖర్చు చేస్తున్నారు. అంతే కాదు.. మీరు మీ డెబిట్ కార్డును స్వైప్ చేస్తున్న ప్రతి లావాదేవీ సమయంలో, మార్పిడి రేట్ యొక్క మార్పిడి రుసుమును వసూలు చేస్తారు. మీ ఫారెక్స్ కార్డును ముందే-లోడ్ చేయబడి ఉంటుంది. మరియు కొనుగోలు సమయంలో లాక్ చేయబడిన మారకపు రేటుతో ఉంటుంది.

2. మీ డబ్బు మొత్తాన్ని ఒకేసారి మార్చుకోవడం:

ఇలా చేయవద్దు. ఇందుకు బదులుగా వేరు వేరు భాగాలలో ప్రయత్నించండి. స్థానిక కరెన్సీలో కొంత భాగాన్ని, మరికొంత భాగాన్ని యూఎస్ డాలర్ల రూపంలో మీ బ్యాంక్ ఖాతాలో ఉంచండి. ఏదైనా తప్పు జరిగితే అపుడు మీరు మొత్తం మీ నగదును కోల్పోతారు. మీరు మరేదో అంశంపై ఆధారపడేందుకు బదులుగా ఇలా చేయండి. ఇంకా యూఎస్ డాలర్ల కొనుగోళ్ల సమయంలో కొన్ని దేశాలు మంచి డీల్స్ అందిస్తాయి.

3. విమానాశ్రయ అమ్మకందారుల నుండి ఫారెక్స్ కొనడం:

విమానాశ్రయాలలో విక్రేతల నుండి ఫారెక్స్ కొనడం మానుకోండి. వారి దగ్గర వేర్వేరు మార్పిడి రేట్లు ఉంటాయి. ఇవి గణనీయంగా అధిక మొత్తంలో ఉండడంతో.. మీరు డబ్బు కోల్పోతారు.

4. ట్రావెలర్స్ చెక్స్ కొనడం:

ఇప్పుడు ఇది పాత విధానం అయిపోయింది. మీరు విదేశీ మారకం కొనుగోలు విషయంలో మంచి ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. అనేకమంది డీలర్లు ట్రావెలర్స్ చెక్స్‌ను అంగీకరించే వారు అంతగా అందుబాటులో లేరు. ఇలాంటి ఒకదానిని కలిగి ఉండటం ఎక్కువ అవాంతరాలకు కారణం కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *