Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

ప్రయాణాలతో ఆరోగ్యం, అనుబంధాలు పెరుగుతాయని చెబుతున్న సైన్స్

ఆరోగ్యమే మహాభాగ్యము’ అని అప్పట్లో ఎవరో ఓ తెలివైన వ్యక్తి చెప్పారు. మనం ఈ మాటను ఇప్పటికి కొన్ని లక్షల సార్లు విని ఉంంటాం. ఇందుకోసం రోజువారీగా అనేక రకాల వ్యాయామాలు చేయడం, పౌష్టిక ఆహారంతో పాటు చాలానే చేసి ఉంటాం. అయితే, ఆరోగ్యంగా ఉండడానికి మరో రకమైన చిట్కా ఉంది.. అదే ప్రయాణాలు. ఏంటీ నమ్మబుద్ధి వేయడం లేదా? ప్రతీ మూడు నెలలకు ఓ సారి ప్రయాణాలు చేస్తే వైద్యునితో అవసరం ఉండదు. ఎలాగో తెలుసుకోవాలని ఉందా?

1. అపరిమిత ఆనందం:

మీ ప్రయాణం ప్రారంభమైన క్షణంలోనే మీలోని ఆనందం స్థాయిలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం మెరుగయ్యేందుకు, కుటుంబం, అనుబంధాలు, దగ్గరి వారిలో ఆనందం చూసేందుకు, నాణ్యమైన జీవితం గడిపేందుకు పర్యటనలు ఉపయోగపడతాయి. ఏదైనా కొత్త వస్తువు కొనాలనే ఆలోచన కంటే, ఓ ప్రయాణం చేయాలనే ఆలోచన మనుషులలో ఎక్కువ ఆనందాన్ని నింపుతుందని యూనివర్సిటీ ఆఫ్ సర్రే ప్రొఫెసర్లు నిర్వహించిన సర్వే వెల్లడించింది. అందుకే వెంటనే ఓ పర్యటనను ప్లాన్ చేసుకోండి.

2. ట్రావెల్ పిల్ వేసుకోండి:

ప్రయాణం అనేది మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచే రహస్య అంశం. ప్రయాణ అనుభూతులు మిమ్మల్ని కొత్త పరిసరాలకు చేరువ చేస్తాయి. ఆ జ్ఞాపకాలు మనసు పొరల్లో అనారోగ్యానికి ప్రతిరోధకాలను సృష్టిస్తాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం, శ్రేయస్సును పర్యటనలు మెరుగుపరుస్తాయి. ఔషధాలను కాదు.. , ట్రాప్ పిల్‌ను వేసుకోండి!

3. ఒత్తిడికి వీడ్కోలు చెప్పండి:

ప్రయాణం ఒత్తిడి స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుంది. మీకు తగిన విశ్రాంతిని, విరామం ఇచ్చి.. ఆత్రుత స్థాయిలు తగ్గించి సంతోషముగా గడిపే అవకాశాన్ని ప్రయాణాలు అందిస్తాయి. మీరు మరింత మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారు. ప్రయాణ అనుభవం తర్వాత కొన్ని వారాలపాటు ఆ భావన మీతో ఉంటుంది. మీకు మానసికంగా, శారీరకంగా కష్టంగా ఉంటే, మీ ఒత్తిడికి మరియు చింతలకు ప్రయాణాల ద్వారా వీడ్కోలు పలకండి.

4. మీ మెదడుకు శక్తి:

మీరు ప్రయాణాలు చేసేటపుడు కొత్త వ్యక్తులకు మరియు కొత్త పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయేవిధంగా మీ మనసు విస్తరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరియు సాంస్కృతికంగా మీరు మరిన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇది మీ మనసును పదును పెట్టడమే కాదు, మీ సృజనాత్మకతను మరింతగా పెంచుతుంది. మీ మానిసక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరియు జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ప్రయాణించే ప్రజలు మరింత విశాల హృదయాన్ని కలిగిఉండడమే కాదు.. భావోద్వేగాలపై ఎంతో స్థిరంగా ఉంటారు.

5. గుండె జబ్బులకు ప్రవేశం లేదు:

ప్రతి సంవత్సరం కానీ.. క్రమం తప్పకుండా కానీ ప్రయాణాలు చేసే ప్రజల చెంతకు.. ఒత్తిడి, ఆందోళనలు దరి చేరవు. ఒత్తిడి కారకాల నుండి ఉపశమనం పొందుతారు. దీంతో, వారు గుండె సంబంధిత వ్యాధులకు దూరం కావడమే కాదు, హృదయ స్పందనను అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు కలిగి ఉన్నారు. ఈ అంశాన్ని ఫ్రామింగ్‌హామ్ అధ్యయనం సమర్థించింది.

6. ఆనందమే ఆనందం:

మీరు ప్రయాణించినప్పుడు, మీరు ఎప్పుడూ తిరిగేందుకు సిద్ధంగా ఉంటారు. కొత్త ప్రదేశాలను చూసేటపుడు ఎంతో ఆనందం కలుగుతుంది. మీ సమయం, డబ్బు అక్కడ వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటారు కాబట్టి… సాహస క్రీడలు, నగరమంతా నడక, హైకింగ్ లాంటివి చేసేందుకు మనసు సిద్ధపడిపోతుంది. మీరు ప్రతి క్షణం ఆనందంగా ఆస్వాదిస్తుండడంతో ప్రయాణం అంతా ఆనందంగా ఉంటారు.

 

7. వైద్యం సూపర్ పవర్:

కాలానికి అన్నిటినీ నయం చేసే శక్తి ఉందని అంటారు. ఇది నిజమే, కానీ ప్రయాణంలో కూడా చాలా శక్తినిచ్చే శక్తి ఉందని మీకు తెలుసా? వ్యాధులను నయం చేయగల శక్తికారకాలు ఉన్న గమ్యస్థానాలు మన భూమిపై ఎన్నో ఉన్నాయి. స్టోన్‌హెంజ్‌తో పాటు, ఈజిప్ట్ లోని పిరమిడ్లు, మెయిన్లో మౌంట్ డెజర్ట్ ఐల్యాండ్, టర్కీ, ఐస్‌ల్యాండ్, కోస్టా రికా వంటి ప్రాంతాలు ఇందుకు ప్రసిద్ధం.

8. అనుబంధాల నైపుణ్యం:

భావోద్వేగాలు, అనుబంధాలు కలిగి ఉండడంలో, వాటిని నిర్వహించడంలో అందరూ సరైన స్థాయిలో ఉండలేరు. అనుబంధాలను నిర్వహించడంలో మీకు నైపుణ్యం అందాలంటే అందుకు ప్రయాణం సహాయపడుతుంది. ఇప్పటికే మీకు ఉన్న అనుబంధాలను పర్యటనలు మెరుగుపరుస్తాయి. అంతే కాదు కొత్త రిలేషన్స్‌ను అభివృద్ధి చేయడానికి మీకు అవకాశం కలుగుతుంది. దూరంగా ఉండటం మీ భావోద్వేగ స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు కలిగి ఉన్న దానిపై కృతజ్ఞతతో ఉండటానికి, మీ జీవితంలో ఉన్న వ్యక్తులను విలువను గుర్తించడానికి ప్రయాణాలు ఉపయోగపడతాయి.

9. మహారాజ జీవితం:

మీరు రాజు మాదిరిగా జీవించాలని అనుకోవడం సహజమే. కానీ సుదీర్ఘ జీవితం కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యం. దీర్ఘకాలం బతికేందుకు, మరియు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయాణాలు సహకరిస్తాయి. విస్తృతంగా ప్రయాణాలు చేసేవారు ఎక్కువ కాలం జీవించగలగుతారు. తక్కువ ఒత్తిడి, తక్కువ ఆందోళన, ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తూ, మరింత ఆనందంగా బతకడంతో.. ఖచ్చితంగా ఎక్కువ కాలం జీవిస్తారు. అందుకే.. ప్రయాణించండి, మీలో ఉన్న భావనలను మరింత కాలం బతకనివ్వండి.

మీరు ప్రయాణాలను ఇలా ఎప్పుడూ చూడలేదు కదూ? ప్రయాణాలలో ఉండే మ్యాజిక్ ఏంటో ఇప్పుడు అర్ధమైంది కదా. ఇప్పుడు మీ ప్రయాణాలకు ప్లాన్ చేసేసుకోండి. మిమ్మల్ని ట్రావెల్ బగ్ కుట్టేసినా పర్లేదు. ఎందుకంటే అది మీకు మంచినే చేస్తుంది కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *