Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

ప్రపంచంలోని ఈ సంతోషకరమైన దేశాల నుంచి ఈ అంశాలు తెలుసుకోండి

ప్రజల సంతోషం ఆధారంగా తమ జిడిపిని లెక్కించేందుకు భూటాన్ ఇష్టపడిందని మీకు తెలుసా? కొన్ని దేశాలు (మేము వాటి పేర్లు చెప్పడం లేదు). వారి ఉద్యోగుల పని ఆధారంగానే లెక్కిస్తూ.. కష్టపడి పని చేస్తున్నట్లుగా భావిస్తున్నాయని కూడా మీకు తెలుసా?

నేటి ప్రపంచంలో, ఒక దేశాన్ని అద్భుతమైనదిగా అంచనా వేయడానికి ప్రమాణంగా సంతోషాన్ని పరిగణించరు. అయితే, ఇది దేశంలోని పర్యాటక రంగం మాదిరిగానే ఇది చాలా ముఖ్యం. ప్రతి దేశం తమ తప్పులు, మర్యాద, సంతోషంగా గడిపేందుకు అంగీకరించేలా ఉంటే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? ప్రతి దేశం కెనడా అని మీరు ఊహించగలరా! యుద్ధంపై వచ్చే వార్తలు మెల్లగా గాలిలో కలసిపోతాయి! అందుకే ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల నుండి తెలుసుకోవలసిన అవసరం ఉంది:

ప్రపంచంలో అత్యంత సంతోషకమరైన దేశాలు

1. నార్వే:అధిక పర్యావరణ నాణ్యత:

Norway

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలలో నార్వే ఒకటి. వారు ఖచ్చితంగా అనేక విషయాలు సరిగా చేస్తున్నారు! అధిక పర్యావరణ నాణ్యత, పౌర అవగాహన, మంచి సాంఘిక సంబంధాలు, ఉన్నత అక్షరాస్యత మరియు అతి ముఖ్యమైన సమానత్వం.. నార్వేలో నిర్వహించబడతాయి.ప్రకృతి సౌందర్యం యొక్క అద్భుతమైన సమ్మేళనంతో, మరియు హోమన్‌కొలెన్ స్కై జంప్ వంటివి పర్యాటకులకు ఆకర్షిస్తున్నాయి.

2. డెన్మార్క్:పని-జీవనం సంతులనం:

ప్రపంచంలో రెండో సంతోషకరమైన దేశమైన డెన్మార్క్‌లో పని-జీవనాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. వారు వారంలో అధికారిక పని 37 గంటలుగా కలిగిఉన్నారు. అధిక సమయం పని చేస్తే, డబ్బు లేదా టైమ్ఆఫ్‌తో భర్తీ చేస్తారు. వ్యక్తిగత సంరక్షణ మరియు విశ్రాంతి కోసం డెన్మార్క్‌లో రోజుకు 16 గంటలు ఉంటాయి. ఒక కల మాదిరిగా అనిపించడం లేదూ? ఇప్పటికిప్పుడే ప్యాక్ చేసేసుకుని, క్లయింట్స్‌ను ఫోన్ చేయద్దని చెప్పేయాలి!

3. ఐస్‌ల్యాండ్: సంతృప్తికర జీవనం:

ఉద్యోగాలు మరియు సంపాదనల పరంగా ఐస్‌ల్యాండ్ అగ్ర స్థానంలో ఉంది. గణాంకాల ప్రకారం 82% మంది కార్మికులు 15-64 ఏళ్ల మధ్య గలవారే. 84% పురుషులు మరియు 80% స్త్రీలు ఉద్యోగులు. అంతేకాకుండా, మంచి ఆరోగ్యం, ఆరోగ్య స్థితి, వ్యక్తిగత భద్రత, విద్య, నైపుణ్యాలు మరియు సగటు సాంఘిక సంబంధాల కారణంగా ఐస్లాండ్ పూర్తి జీవిత సంతృప్తిని అధికంగా కలిగి ఉంది. నిరుద్యోగం మరియు అసంతృప్తి మన జీవితంలో భాగంగా ఉండడంతో.. తప్పనిసరిగా ఇక్కడకు మనం వెళ్ళాల్సిందే.

4. స్విట్జర్లాండ్: సామాజిక భావన:

సంతోషకరమైన దేశంగా సామాజిక భావన ఉన్నందున స్విట్జర్లాండ్ సంతోషకరమైన దేశంగా ఉంది. 96% మంది వారి అందరూ తెలిసినట్లు భావిస్తారు మరియు వారు ఇబ్బందికరకాలంలో ఇతరులను పిలవగలరు. స్విట్జర్లాండ్‌లో ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే ప్రసూతి సెలవు చట్టబద్ధమైన హక్కు. మొత్తం ఉద్యోగం చేసే తల్లులు కూడా చెల్లింపులకు అర్హులు. ఈ దేశంలోకి మిమ్మల్ని ఆకర్షించడానికి ఇది సరిపోకపోతే, స్విస్ చాక్లెట్ గురించి ఆలోచించండి. వెంటనే పర్యాటక ఎంపికలను పరిశోధించండి!

5. ఫిన్‌ల్యాండ్: విద్య, పని-జీవిత సంతులనం:

ఫిన్‌ల్యాండ్ విద్యకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తుంది. కేవలం 4% ఉద్యోగులు చాలా ఎక్కువ పని గంటలు చేస్తున్నట్లు చెబుతారు. బతకడం కోసం పని చేయడం అనే కళను మనం నేర్చుకోవాలి.

6. కెనడా: ఆరోగ్యం:

కెనడియన్ పౌరులు మరియు శాశ్వత నివాసితులు ఆరోగ్య బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కెనడాలో చాలా ఆరోగ్య సేవలు పన్నులతో సహా చెల్లించబడతాయి. ప్రజలు వారి ఆరోగ్య బీమా కార్డును వైద్య దుకాణాల్లో మరియు ఆసుపత్రులలో చూపిస్తే చాలు. ఆరోగ్యం సంపద అని వారు చెప్పినట్టుగా కెనడాలో ప్రజలు నిజంగా సంపన్న మరియు సంతోషంగా ఉన్నారు.

7. భూటాన్: స్థూల జాతీయ సంతోషం:

జిడిపికి బదులుగా స్థూల జాతీయ సంతోసం ఆధారంగా దాని పురోగతిని కొలిచే ప్రపంచంలోని ఏకైక బౌద్ధ రాజ్యం భూటాన్. ఈ దేశ పర్యాటకరంగం జీవితం మరియు నాణ్యతపై దృష్టి పెడుతుంది. ఆధ్యాత్మిక ఆనందం చేతిలోకి జీవితం గడుస్తుంది. బహుశా మన దగ్గర కూడా సంతోషం కొలిచే ప్రమాణం ప్రారంభం కావాలేమో?

8. స్వీడన్: అధిక సామాజిక బాధ్యత:

స్వీడన్‌లో సామాజిక బాధ్యత అధికంగా కనిపిస్తుంది. ఇక్కడ 86 శాతం ఓటర్లు తమ హక్కు ఉపయోగించుకుంటారు. దీని అర్థం ఆ దేశంలో విశాలమైన సాంఘికత ఉంటుంది. స్వీడన్ పర్యటనకు ధన్యవాదాలు చెప్పాల్సిందే! ఇది మీకు వోడ్కా, ఎబిబిఎలతో పాటు అత్యధికంగా నచ్చే ఫర్నిచర్ విక్రయాలు ఉంటాయి. సరేనా! మన దేశంలో పెద్ద సంఖ్యలో ఓటు వేయడం లేదు కాబట్టి మనము కూడా దీనిని నేర్చుకోవాలి.

కష్టపడితే ఆనందం దొరుకుతుంది. అందమైన మరియు పర్యాటక ప్రాంతాలు గల ఈ ప్రపంచంలో 8 సంతోషకరమైన దేశాలు ఎంతో అహ్లాదంగా ఉంటాయి. ఈ దేశాలకు మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేయకపోతే, మీరు చాలా కోల్పోయినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *