Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం – సంపూర్తి గైడ్

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని సుందరమైన ప్రదేశం, ప్రతి ప్రయాణికుల కలల జాబితాలో ఉన్న లడఖ్‌కు ‘ది ల్యాండ్ ఆఫ్ హై పాసెస్’ అనే పేరు ఉంది. ఈ ప్రదేశంలో గోధుమ మైదానాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు మరియు హిమాలయాల యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాల మధ్య నీలం రంగులో అనేక సరస్సులు ఉన్నాయి. ఏ యాత్రలో అయినా ‘సాహసం’ అనే పదం మిళితం కావాలంటే కచ్చితంగా అది ఇదే. అల్ప వాతావరణ పీడనం మరియు లడఖ్ లో గడ్డకట్టే ఉష్ణోగ్రతను పర్యాటకులు అధిగమించాలి. అందుకే లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం ఎప్పుడు? అనే విషయం తెలుసుకోవాలి. మీరు చేయాలనుకున్న ట్రిప్‌ను అనుసరించి మీరు ఏడాది పొడవునా లడఖ్ సందర్శించవచ్చు(వర్షాకాలం మినహా). అందుకే లడఖ్ వాతావరణంలో చల్లని చల్లను అధిగమించడానికి మీ అన్వేషణ కోసం మేము గైడ్‌ను రూపొందించాం.

లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం

1. ఏప్రిల్ నుండి మే వరకు:

మార్చి నెల ముగియగానే లడఖ్‌లో సూర్యడు ప్రకాశిస్తాడు, ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఏప్రిల్ నుండి మే వరకు లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం. మే ప్రారంభంలో, శ్రీనగర్-లెహ్ రహదారి తెరచుకుని ప్రయాణికులకు పర్యటనలకు ఆహ్వానం పలుకుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో లడఖ్ పర్యాటకం ఆకట్టుకుంటుంది. రెస్టారెంట్లు మరియు హోటళ్ళు అతిథులకు స్వాగతం పలుకుతాయి. శీతాకాలంలో స్తంభించిపోయిన సరస్సులు కరుగుతాయి. లడఖ్‌ అందం అపుడు అందరికీ కనబడుతుంది. అందుకే లడఖ్ సందర్శించడానికి ఇది ఎంతో ఆహ్లాదకరమైన సమయం.

2. మే:

మీరు విమానంలో రావడానికి ప్రణాళిక వేసుకుంటే మే నెలలో లడఖ్ వెళ్ళటానికి ఉత్తమ మార్గం విమానయానం. ఢిల్లీ, శ్రీనగర్ మరియు జమ్మూల నుండి లేహ్ కు విమానాలు అందుబాటులో ఉన్నాయి. చలికాలం జ్ఞాపకాలు ఇప్పటికీ ఈ సమయంలో ఇంకా ఉండే అవకాశం ఉండడంతో రోడ్డు ప్రయాణం నివారించాలి. కొన్ని రహదారులు మూసివేయబడి ఉంటాయి. తెరిచినవి మంచుతో కప్పబడి ఉంటాయి. రోహతంగ్ మార్గం పొడవైన షీట్లతో చుట్టబడినట్లుగా ఉండి, ఒక అద్భుతమైన దృశ్యం అందిస్తుంది.

3. జూన్ –

రోడ్డు ద్వారా లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం:

రోడ్డు మార్గం లడఖ్‌కు చేరుకునేందుకు జూన్ నెల చివరి సమయం. ఇందుకు కారణం ఏమిటంటే ఈ కాలంలో అన్ని రహదారులు తెరవబడతాయి. ఇంకా మెరుగైన కారణం ఏమిటంటే మీరు మంచుతో కప్పబడిన పర్వతాల అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆస్వాదించవచ్చు.

4. జూలై – ఆగస్టు:

జూలై మరియు ఆగస్టు నెలలలో లడఖ్ చాలా అందంగా ఉంది. కఠినమైన శీతాకాలం మరియు ఆహ్లాదకరమైన వేసవి కాలంలో ఎంతో అందాన్ని ఆస్వాదించే సమయం ఇధి. ఈ నెలలు ఫోటోగ్రాఫర్‌లకు చాలా ఇష్టమైనవి. ఇది వర్షాకాలం కూడా, కాబట్టి కొండచరియలు సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతాలను నివారించడం ఉత్తమం.

5. సెప్టెంబర్ –

ఫోటోగ్రాఫర్లు లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం:

మీరు పరిపూర్ణ సౌందర్యాన్ని ఆనందించాకుంటే సెప్టెంబర్ నెలలో లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం. లడఖ్‌కు రోడ్డు యాత్ర చేయటానికి ఇది అనువైన సమయం కూడా ఉంది. నీలి ఆకాశం కిందుగా హెల్మెట్స్‌ ధరించి ప్రయాణం చేసేందుకు బైకర్స్‌కు ఇది అనువైన కాలం. సరస్సులు స్పష్టంగా ఉంటాయి మరియు పరావర్తనం చెందుతాయి. ముదురు నీలం రంగు గోధుమ మరియు లేత గోధుమరంగులతో ప్రకృతి దృశ్యం అద్భుతమైన అందాలను పంచుతుంది.

6. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు:

సంవత్సరం ఎనిమిదవ నెలతో పాటు.. శీతాకాలం ఆరంభమవుతోందనే మొదటి చిహ్నాలు తెస్తుంది. భారీ హిమపాతం ఉన్నా, అనేక రహదారులు తెరిచే ఉంటాయి. కఠినమైన వాతావరణం కారణంగా కొన్ని క్యాంప్‌సైట్స్ మూసివేస్తారు. నవంబర్, డిసెంబర్లలో లడఖ్ ప్రాంతాన్ని చలికాలం తాకుతుంది. లెహ్ మరియు లడఖ్ లో ఉష్ణోగ్రత సెల్సియస్ -11 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. భారీ హిమపాతం మరియు సరస్సులు.. ఆరు అంగుళాల మందపాటి మంచుతో స్తంభించిపోతాయి. మీరు మంచును ఇష్టపడితే, తీవ్రమైన చలికాలంలో సౌకర్యవంతమైన జీవన వాతావరణం ఉన్నట్లయితే, ఈ సమయం లడఖ్ సందర్శించడానికి ఉత్తమం. రహదారులు మూసివేయబడతాయి. అయితే మీరు ఒక విమానం ద్వారా చేరుకోవచ్చు.

7. జనవరి – ఫిబ్రవరి –

మంచు ప్రియులకు లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం:

నూతన సంవత్సరం వేడుకలు ముగియగానే, చాలా మంది పర్యాటకులు మరియు ప్రయాణికులు వారి ఇళ్లలో ఉన్న సౌకర్యాలను అనుభవిస్తూ నిద్రిస్తుంటారు. చలికి భయపడి లడఖ్ యాత్ర ఆలోచనను విరమించుకుంటారు. కానీ వాటిలో కొందరు ధైర్యంగా తమ ట్రెక్కింగ్ సామగ్రిని ప్యాక్ చేసుకుని లడఖ్‌కు చేరుకుంటారు. ప్రపంచంలో అత్యంత సాహసోపేతమైన పర్వతారోహణలలో ఒకటి అయిన చాదర్ ట్రెక్‌ను ఎంజాయ్ చేస్తారు. చాదర్ ట్రెక్ 105 కి.మీ.ల పొడవు ఉంది. జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో బాగా ఆనందిస్తారు. మైళ్ళ దూరం ఘనీభవించిన నీటిలో నడిచేటపుడు పక్కన వందలాది అడుగుల పర్వతాలు తప్ప మరేమీ ఉండవు. కొన్నిసార్లు భయపెట్టినా.. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం.

కాబట్టి మీరు లడఖ్కు వెళ్లాలని అనుకుంటే, మీరు సరైన సమయాన్ని ఎంపిక చేసుకుని, అందుకు అనుగుణంగా మీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. కానీ లడఖ్ సందర్శించడానికి ఏ సమయం అయినా ఉత్తమ సమయమే. ఎందుకంటే ఏ సమయంలో అయినా అందంగా ఉండే ప్రాంతం ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *