Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

థాయ్‌ల్యాండ్‌ను మనం మరో కోణం నుంచి చూడచ్చా?

ప్రతీ కథకు మరో కోణం కూడా ఉంటుంది. మన కళ్లు చూసే వాటి కంటే మరెన్నో చూడనివి ఉంటాయి. ఓ ప్రాంతం గురించి మనం వినే వాటి కంటే అక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉండవచ్చు. కానీ అందమైన ‘చిరునవ్వుల ప్రాంతం’గా గుర్తింపు పొందిన థాయ్‌ల్యాండ్.. భారతీయుల్లో దురదృష్టవశాత్తు చెడు అభిప్రాయాలు ఉన్నాయి. ఇతర దేశాల మాదిరిగానే, థాయ్‌ల్యాండ్‌కు కూడా హైలైట్స్‌తో పాటే సవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే చెడు వైపే దృష్టి నిలపడం అంత సమంజసం కాదు. నిజానికి థాయ్‌ల్యాండ్ అంటే మీరు ఊహించుకునే దానికంటే చాలా ఉంది. ఇక్కడి ద్వీపాల అద్భుతమైన అందాలు మిమ్ములను ఊపిరి కూడా తీసుకోనివ్వవు. స్థానిక సంస్కృతిని ఒక్కసారి చూస్తే చాలు, మీరు ప్రేమలో పడిపోతారు.

ధాయ్‌ల్యాండ్‌ను సహజంగా రుచికరమైన ఆహారం, స్పాలలో థాయ్ మసాజ్‌లు, షాపింగ్, లగ్జరీ హోటల్స్ వంటి వాటి కోసం పర్యటిస్తారు. ఇది బడ్జెట్‌లో పర్యటించగల ప్రాంతం కూడా. కానీ థాయ్‌ల్యాండ్‌లో మీకు తెలియని, థాయ్‌ అందాలపై మీరు ఊహించలేని ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మీరు థాయ్‌ల్యాండ్‌ టూరిజంను మరో విభిన్న కోణం నుంచి కూడా చూసేందుకు మీరు సిద్ధమా? అలా అయితే థాయ్‌ల్యాండ్‌లోని ఈ ప్రాంతాలను మీరు చుట్టేయాల్సిందే:

1. చాంటాభూరిలో వాటర్‌ఫాల్ హెవెన్:

థాయ్‌ల్యాండ్ తూర్పు భాగంలో దాగి ఉన్న ఛాంటాభూరి ప్రాంతం, ఓ జలపాతాల స్వర్గం. కాలువలు, నదులు, కొండలపై నుంచి చాలు వారడం వంటి ఎన్నిటినో నంటోక్ ఫిలో నేషనల్ పార్క్‌లో చూడవచ్చు. మీరు స్థానికులతో మమేకం అయిపోయి, వారితో కలిసి భోజనం కూడా చేయవచ్చు. ఈ సమయంలో ఎన్నో గుళ్లు, పగోడాలను సందర్శించవచ్చు. అంతే కాదు అద్భుతమైన క్యాథలిక్ మర్యాదలను పొందవచ్చు.

2. టూ వీలర్‌పై మ్యాన్‌మార్ బోర్డర్:

ఎంతో దూరం అనిపించే మ్యాన్‌మార్ సరిహద్దుకు మోటార్ సైకిల్‌పై ప్రయాణం చేయండి. థాయ్‌ల్యాండ్ గ్రామీణ ప్రాంతాల సహజమైన అందాలను చూసి పునరుత్తేజితం అయే అవకాశం లభిస్తుంది. విపరీతమైన గాలులలో ఉండే కొండల మధ్య రోడ్లలో ప్రయాణాన్ని మీరు గతంలో ఎన్నడూ పొంది ఉండరు. ఆ సుందరమైన దృశ్యాన్ని ఎన్ని సార్లు అయినా గుర్తు తెచ్చుకోవచ్చు. సరిహద్దు వద్దు అయితే ఆ దృశ్యం చిరస్మరణీయం.

3. చాయింగ్ రాయ్ వద్ద మౌంటెన్ బైక్:

చాయింగ్ రాయ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు బైక్‌పై పర్యటిస్తే, ఎన్నో తెలుకోవాలనే మీ ఉత్సుకతను ఈ టూర్ నిద్ర లేపుతుంది. సందడిగా ఉండే రోడ్లు, ప్రశాంతమైన పంట పొలాలను చూసి ఆనందిచవచ్చు. థాయ్‌ల్యాండ్‌ను చూసేందుకు ఇదో విభిన్నమైన మార్గమేనా?

4. లాంపాంగ్‌లో ఏనుగులు:

నది పక్కన బార్స్, రెస్టారెంట్స్, గుర్రపు బగ్గీలు మరియు బౌద్ధ ఆలయాలతో నిండిన లాంపాంగ్ ఓ ప్రశాంతమైన పట్టణం. అంతే కాదు, థాయ్‌ల్యాండ్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ సెంటర్ ఉండే ప్రాంతం లాంపాంగ్. 50పైగా చిన్నా పెద్దా ఏనుగులకు మీరు హలో చెప్పవచ్చు కూడా.

5. రైలేలో రాళ్లను ఎక్కడం:

ఇది సాహసాలను ఇష్టపడే వారి కోసం! రైలేలో రాక్ క్లైంబింగ్ ఓ అద్భుతమైన అనుభవం. మీరు ఈ ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి రాతి అమరికను చూడలేరు. చుట్టుపక్కల ఉండే క్రస్ట్ ద్వీపాలు మీకు ఊపిరి సలపనివ్వవు. వీటిని అసలు మిస్ కాకండి!

6. కిక్ బాక్సింగ్ నేర్చుకోండి:

ఏదైనా ఓ ప్రాంతంలో పర్యటిస్తే, అక్కడి సంస్కృతి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని అంటారు. అందుకే, మీరు థాయ్‌ల్యాండ్‌లో ఉన్నపుడు ‘మువాయ్ థాయ్’గా పిలిచే కిక్‌బాక్సింగ్‌ను నేర్చుకునేందుకు సమయం కేటాయించండి.

7. సాంగ్‌క్రాన్‌లో భాగం అవండి:

సాంగ్‌క్రాన్ పండుగతో కలిపి మీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజ్‌ను బుక్ చేసి ఉంటే, కచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయండి. థాయ్ కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా జరిగే ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పోరాటాలను సందర్శించండి.

8. జలపాతాల ప్రాంతం, పెచ్చాబన్:

ఉత్తర థాయ్‌ల్యాండ్‌లో ఉన్న పెచ్చాబన్, జలపాతాలకు కేంద్రం. చుట్టూరా కొండలతో ఉండే ఈ ప్రాంతంలో నదులు, నేషనల్ పార్క్‌లు ఉంటాయి. ఇక్కడ ప్రకృతి అందం అంతా సహజమైనదే, మరిచిపోలేనిదే. మీరు థాయ్‌ల్యాండ్‌ను కచ్చితంగా మరో కోణం నుంచి అనుభవించే ప్రాంతం ఇది!

9. బుర్రియంలో శిథిలాలు:

పురాతన ప్రాంతాలు, శిథిలమైన ప్రాంతాలలో కనిపించి అవశేషాలను మీరు ఇష్టపడేటట్లు అయితే, బుర్రియంలో మీ కలలు నెరవేరతాయి. ఫానమ్ రంగ్‌ను సందర్శించండి, ఆగ్నేయ ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఖ్మేర్ ఆలయాలను తిలకించవచ్చు.

థాయ్ ప్రజల వాస్తవ జీవనం గురించి తెలుసుకోవాలని అనుకుంటే, ఆ జాబితాలో ఉన్న వాటిని ప్రయత్నించండి. మెల్లగా అయినా ప్రతీ క్షణాన్ని ఆస్వాదించండి. థాయ్‌‌ల్యాండ్ విభిన్న కోణంలోంచి చూసిన జ్ఞాపకాలను పదిలపరచుకోండి.

థాయ్‌ల్యాండ్ మీకు ఎన్నో ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తుంది మరియు థాయ్‌ల్యాండ్ హాలిడే ప్యాకేజ్‌లలో మీ కోసం ఎన్నో దాగి ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *