Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

కాలేజీ మొదలయ్యే ముందు భారతదేశంలో సందర్శించాల్సిన స్థలాలు

ఇది దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలకు మరొక కఠినమైన సంవత్సరాన్ని ప్రారంభించే సమయం వచ్చేస్తోంది. ఆసైన్‌మెంట్స్, ఒత్తిడి, నిద్రలేమితో గడపబోయే రోజులు వచ్చేస్తున్నాయి. కళాశాల విద్యార్థులందరూ పూర్తిగా విశ్రాంతిని కోల్పోబోతున్నారు. అందుకే మీరు తర్వాతి విద్యాసంవత్సరం ప్రారంభించటానికి ముందు ఒక ట్రిప్ ప్లాన్ చేయడం కోసం భారతదేశంలో సందర్శించడానికి స్థలాల జాబితా ఇది!

1. రిషికేష్‌‌లో రివర్ రాఫ్టింగ్:

River rafting in Rishikesh

ప్రపంచవ్యాప్తంగా చాలా కొద్ది నదులు మాత్రమే గంగా నది మాదిరిగా చరిష్మాను కలిగి ఉన్నాయి. నది ఒడ్డున ఒక స్వప్నం లాంటి అనుభవం ఉంది. తెల్లని రాళ్లతో మీకు ఉత్కంఠను కలుగచేస్తుంది. ఇది మిమ్ములను స్వాధీనం వేసుకునే ఒక వ్యసనం మాదిరిగా ఉంటుంది. గంగ, దాని ఉపనదులతో రిషికేష్ ఎంతో సుందరంగా ఉంటుంది. మీరు ఇక్కడి జలాలను కాదంటే.. మీలోని ఆసక్తిని అవమాన పరచినట్లే. ఈ అనుభవాన్ని వర్షాకాలంలో ఎక్కువగా ఆనందించవచ్చు.

2.అండమాన్‌లో స్కూబా డైవింగ్:

2.o scuba diving in Andaman

నీరంటే తెగ ఇష్టపడేవారి కోసమే ఇది. చేపలతో ఈత కొట్టాలనే ఆలోచన, రంగురంగుల పగడాలను సందర్శించడం, మీరు గతంలో ఎరుగని నిశ్శబ్దాన్ని అనుభవించాలంటే అండమాన్‌లో స్కూబా డైవింగ్ చేయాల్సిందే. ఇక్కడ అండమాన్లో స్కూబా డైవింగ్ ఎంతో ప్రసిద్ధి. తీరాలు మరియు లోతులేని జలాలు ఆశ్చర్యం గొలిపితే.. మహాసముద్రాలలో లోతైన డైవింగ్ ఒక అద్భుతమైన అనుభవంగా ఉంది, మహాసముద్రాలతో ముఖాముఖి ఉండడం, బహుశా మానవజాతికి చెందిన అత్యంత ఆశ్చర్యకరమైన దృగ్విషయం. హేవ్‌లాక్ ఐల్యాండ్లో దీన్ని ప్రయత్నించండి. ఇది అత్యంత జనాదరణ పొందిన యాత్రలలో ఒకటిగా ఉంది. ఈ ద్వీపం పోర్ట్‌బ్లెయిర్ నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అనేక డైవింగ్ స్థలాలు ఉన్నాయి. మీలో ధైర్యాన్ని బయటకు పిలిస్తే, రాత్రి డైవింగ్ కోసం ఒక సెషన్ బుక్ చేసుకోండి. భారతదేశంలో సందర్శించడానికి అనేక ప్రదేశాలున్నాయి. వాటిలో అండమాన్ అత్యంత ముఖ్యం.

3. డార్జిలింగ్లో టాయ్ ట్రైన్ రైడ్:

చరిత్ర మరియు రైలు ప్రయాణ ఔత్సాహికులకు ఈ పర్యటన విపరీతంగా నచ్చేస్తుంది. డార్జిలింగ్‌లో ఉన్న టాయ్ రైలు 1800ల నుండి పని చేస్తోంది. డార్జిలింగ్ కొండల మరియు పల్లపు మైదానాల ప్రాంతాల రవాణా అదే మాదిరిగా ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ హోదాతో సత్కరించబడిన ఈ రైలు మీ కళ్ళను మిరుమిట్లు గొలిపిస్తుంది. ఈ రోజుల్లో డీజిల్ ఇంజన్లు చాలా వేగంగా ఉన్నా, డార్జిలింగ్ యొక్క ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఉండగా.. మెల్లగా భారంగా సమయం తీసుకుంటూ గంటలు కొట్టుకుంటూ బోగీలను లాగుతున్న ఇంజిన్‌తో కలిసి చేసే ప్రయాణం మీ మనసుల్లో నుంచి చెరిగిపోదు.

4. అలెప్పీలో తూర్పు గ్రామీణ ప్రాంతాసు:

కాలేజీ ప్రారంభించటానికి ‘వెనిస్ ఆఫ్ ఈస్ట్’ మీ పర్యటన జాబితాలో లేనట్లయితే, మీరు సరిగా పరిశోధన చేయనట్లే! మంత్రముగ్ధులను చేసే బ్యాక్ వాటర్స్ సౌందర్యం, కాలువలు, వరి పొలాలు, కొబ్బరి పొలాలు, అల్లెప్పీ లేదా అలపూజ అందంగా తీర్చిదిద్దినట్లు ఉంటుంది. అన్నిటికన్నా మీరు చాలా ప్రశాంతమైన ప్రయాణ కథలు కలిగి ఉంటారు. ప్రతి సంవత్సరం అలప్పుజ పన్నమడ సరస్సు వద్ద నెహ్రూ ట్రోఫీ పడవ పందెం జరుగుతుంది. మంత్రముగ్ధమైన అలప్పుజ బీచ్ కాకుండా, కృష్ణపురం ప్యాలెస్ మ్యూజియం, తకజీ మ్యూజియం కూడా చూడవచ్చు. ఇవి రెండూ హిందూ పురాణశాస్త్రం మరియు పురాతన సాహిత్యం గురించి పురాతన వస్తువులు మరియు కళాఖండాలతో నిండి ఉన్నాయి.

5. గోవాలో సముద్రంతో విశ్రాంతి తీసుకోండి:

గోవా టూర్స్ కళాశాల పర్యటనలలో పర్యాయపదంగా మారింది. చేతిలో వైన్ కూలర్లు పట్టుకుని బీచ్‌లో స్నేహితుల బృందంతో చక్కర్లు మరియు అద్భుతమైన సీఫుడ్ రుచి రుచి చూస్తూ గోవాలో ఆస్వాదించవచ్చు. సుందరమైన తీరాల్లో ఉండగా పారసైలింగ్ మరియు బనానా బోట్ సవారీలు వంటి అడ్వెంచర్ క్రీడలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. వాగోటేర్ బీచ్, అంజునా బీచ్, బాగా బీచ్, కళాంగుట్ బీచ్, బోగల్మో బీచ్ మొదలైనవి చాలా ప్రసిద్ధి చెందిన బీచ్‌లు. మీ ఈత సామాన్లను ప్యాక్ చేయండి. ఇరగదీసేయండి. భారతదేశంలో పర్యటించడానికి చాలా ప్రదేశాలలో, ఇది ఎందరో మెచ్చిన ప్రాంతం.

6. మనాలిలో మీ సాహసాలను బయటపెట్టండి:

మీలో యే జవానీ హై దివాని మాదిరిగా సాహసాలు చేయాలని రక్తం ఉవ్విల్లూరుతూ ఉంటే.. మీ ప్రయాణ దాహం తీరే అవకాశం ఉంది. సాహస తత్వాన్ని పరీక్షించడానికి మనాలి పర్యటన సిద్ధంగా ఉంది. ఇక్కడ అనేక సాహసాలతో మీరు ఉత్కంఠకు గురి కావడం ఖాయం. మీకు ఎంతో సంతృప్తి కలిగించే పర్యటన అవుతుంది. బోనస్‌గా మీ స్నేహితుల బృందం వారి లోపలి మనసును చేరుకుంటారు. మీరు ఎప్పుడూ సన్నిహితంగా ఉంటారు. వైట్ వాటర్ రాఫ్టింగ్, మంచులో ట్రెక్కింగ్, మెరిసిపోయే తెల్లని కొండలు, పర్వతాలపై క్యాంపింగ్, పది నిమిషాల పాటు పారాగ్లైడ్‌లో స్వచ్ఛమైన ఆనందం మరియు ఆకుపచ్చ కొండలపై చల్లని గాలిని పొందే అవకాశం లభిస్తుంది. రివర్ క్రాసింగ్, రాక్ క్లైంబింగ్, రాప్పెలింగ్ మరియు కయాకింగ్‌లను ఆస్వాదించవచ్చు.

7. సైకిల్‌పై పాండిచేరిని అన్వేషించండి:

భారతదేశ సందర్శన స్థలాల జాబితాలో అత్యుత్తమ అనుభవం అందించే ప్రాంతం పాండిచేరి. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పర్యావరణ అనుకూలంగానే కాదు. ప్రశంసనీయమైనదిగా ఉంటుంది. పాండిచేరిలో చక్కర్లు కొట్టేందుకు మీకు తగిన సైకిల్స్ అందుబాటులో ఉంటాయి. అందమైన ఫ్రెంచ్ నిర్మాణాలను అన్వేషించడానికి ఈ నగరం బహు ఉత్తమం.

8.మేఘాలయలో ప్రకృతితో మమేకమైన భావన:

మేఘాలయలో స్కాటిష్ దృశ్యాలు మరియు భారత మనోజ్ఞతను కలగలిసి ఉంటాయి. ఈ రాష్ట్రం పేరును అనువదిస్తే మేఘాల నివాసం అని అర్ధం. ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ప్రదేశాలలో ఇది ఒకటిగా ఉంది. ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, సర్పెంటైన్ నదులు, ఆకుపచ్చని వాలులతో మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రకాశం ఆహ్లాదంగా ఉంటాయి. ఏనుగులు, పులులు, బంగారు పిల్లులు, బింటూరోంగ్స్, కోతులు మరియు పక్షుల విస్తృత శ్రేణితో కలిసి ఈ రాష్ట్రం వన్యప్రాణితో నిండి ఉంది. మేఘాలయలో దేశంలోని అత్యుత్తమ గోల్ఫ్ కోర్సులు కూడా ఉన్నాయి. మేఘాలయ పర్యాటకంలో మేటి అయిన వాటిలో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ కూడా ఒకటి. ఈ వంతెనలు 15 సంవత్సరాల పాటు నిర్మించబడ్డాయి, ప్రకృతి ప్రేమికులకు మరియు సాహసాలను కోరుకునే వారికి ఇది ఒక ప్రముఖ గమ్యంగా ఉంది.

ఈ గమ్యస్థానాలకు, ప్రఖ్యాత పర్యాటక ప్రత్యామ్నాయాల కోసం తనిఖీ చేయండి మరియు అడ్వెంచర్‌ను కోరుకునేవారికి, ఈ ప్రదేశాలలో గుర్తించని ప్రదేశాలను మీలోని పర్యాటకుడిని అన్వేషించనీయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *