Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

తేక్కడిలో సందర్శించడానికి అత్యుత్తమ 10 ప్రాంతాలు

కేరళను ఊహించుకుంటే చేతితో అల్లినట్లుగా కనిపించే తీరాలు, బ్యాక్ వాటర్స్ మరియు పడవ ఇళ్ళు గుర్తుకువస్తాయి. ఇవి కేరళ పర్యాటక రంగం ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. దేవుని సొంత దేశంగా పేరొందిన ఈ ప్రాంతం.. పలు అద్భుతమైన సుందరమైన పర్వత ప్రాంతాలకు నిలయంగా ఉంది. ఇది ఒక వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం మరియు తోటల ఆవాసం. మీ తదుపరి సెలవు పర్యటన గురించి ఆలోచిస్తే, తేక్కడిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు ఇవే.

తేక్కడిలో సందర్శించడానికి ఉత్తమ స్థలాలు

1. పెరియార్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్:

 

భారతదేశంలో అత్యుత్తమ వన్యప్రాణుల ఉద్యానవనాలలో ఒకటి పెరియార్ నేషనల్ పార్క్ మరియు పెరియార్ టైగర్ రిజర్వ్.. తేక్కడిలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా ఉంది. మీ కేరళ సెలవు దినాల్లో తేక్కడి సందర్శించండి మరియు వన్యప్రాణి సఫారీ ప్లాన్ చేయండి.

  •  ఈ పార్క్‌లో ఆసియా ఏనుగులు, బైసన్, సాంబార్ జింక, పందులు, పులులు, చిరుతపులులు, అడవి ఉడుతలు మరియు సింహం సహజ వన్యప్రాణులు ఉన్నాయి. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది తెరిచి ఉంటుంది.
  •  అందమైన కృత్రిమ పెరియార్ సరస్సు ఈ ప్రదేశం యొక్క అందాన్ని పెంచుతుంది. అడవి ఏనుగుల మందలు తరచూ సరస్సులో ఆడేందుకు వస్తాయి.
  • భద్రత కలిగిన పడవలో ప్రయాణిస్తూ అతి సమీపం నుంచి వన్యప్రాణులను చూసే అవకాశం మిస్ కావద్దు.
  • సుందరమైన మరియు ఊహించలేనంతటి అందమైన మైదానం ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందింది.
  •  అడవిలో ఏనుగులపై ప్రయాణాలను అటవీ శాఖ అందిస్తుంది.

2. పరదీసీగల్ గావి:

 

కేరళలోని పర్యావరణ-పర్యాటక కేంద్రాలలో.. తేక్కడి సమీపంలో ఉన్న చిన్న గ్రామం గావి. కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిని ప్రారంభించింది.

  •  కొండలు, లోయలు, ఉష్ణమండల అరణ్యాలు, గడ్డి భూములు, అద్భుతమైన జలపాతాలు, ఏలకుల తోటల అందమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి.
  •  పైడ్ హార్న్‌బిల్, వడ్రంగిపిట్ట, కింగ్‌ఫిషర్ వంటి 260 కంటే ఎక్కువ రకాల పక్షులు కనిపించే ఈ ప్రాంతం పక్షి ప్రేమికులకు స్వర్గం.
  •  మీరు క్యాంపు ప్రాంతంలో ఒక గుడారం మరియు శిబిరంలో ఉండవచ్చు.

3. కుమిలీ – తేక్కడిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశం:

 

కేరళ యొక్క సుగంధ రాజధాని కుమిలిలో అందమైన తోటలు, జలపాతాలు దర్శనం ఇస్తాయి. తేక్కడిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

  •  మీరు ఏప్రిల్ లేదా మే నెలలలో తేక్కడిలో ఉన్నట్లయితే, దట్టమైన అడవుల మధ్యలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో ఉన్న 9వ శతాబ్దపు ఆలయం అయిన మంగళా దేవి దేవాలయానికి వెళ్లండి. చైత్ర మాసంలో పౌర్ణమి రోజున, అనగా ఏప్రిల్ లేదా మే నెలలోనే వచ్చే చిత్ర పౌర్ణమి పండుగ రోజున మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శించటానికి ప్రజలు అనుమతిస్తారు.
  •  సూర్యుడు అస్తమించగానే తోటల మధ్య విశ్రాంతి తీసుకోండి.
  • కొన్ని సుగంధ ద్రవ్యాలు మరియు స్థానిక హస్తకళలను మార్కెట్ నుంచి తీసుకెళ్లండి.

4. కురిసుమల:

 

మీరు ఒక సాహసం కోసం చూస్తున్నట్లయితే, మీ లగేజ్ సర్దుకుని కురిసుమలకు వెళ్లండి.

  •  స్ప్రింగ్ వాలీ మౌంటైన్‌ను అధిరోహించండి.
  •  ఇక్కడ నుండి పెరియార్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం మరియు కుమిలి యొక్క అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు స్వర్గం.
  •  పచ్చటి అడవులతో కప్పబడిన కొండ ప్రాంతాల్లో ఒక సాహసం చేస్తూ పర్వతారోహణ అనుభూతి అనుభవించండి.

5. చెల్లార్‌కోవిల్:

 

మీరు నగర జీవితం యొక్క హడావిడి నుంచి దూరంగా ఒక ప్రాంతం కోసం చూస్తున్నట్లయితే.. చెల్లార్‌కోవిల్‌కు వెళ్లి ప్రశాంతతను అనుభవించవచ్చు. తేక్కడిలో ఉత్తమ ప్రదేశాలలో ఇది ఒకటి.

  •  సెప్టెంబర్ నుండి మే వరకు సందర్శించడానికి ఉత్తమ సమయం.
  • మీరు ట్రెక్కింగ్‌కి వెళ్ళవచ్చు, ఆయుర్వేద తోటలో పర్యటన ప్రణాళిక చేయవచ్చు.
  •  పట్టణం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించడానికి వాచ్ టవర్ పైకి ఎక్కండి. బాల్కనీలో ఉన్న టెలిస్కోప్ నుండి మరింత మెరుగ్గా కనిపిస్తుంది.

6. వండిపెరియార్:

 

తేక్కడిలో మరియు చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాల సమూహం గుండా పెరియార్ నది ప్రవహిస్తుంది. వండిపెరియార్ ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కలిగి ఉంది. తేక్కడిలో సందర్శించడానికి అత్యంత సుందరమైన ప్రదేశాలలో వండిపెరియార్ ఒకటి.

  •  నదికి సమీపంగా ఉండడంతో ఇక్కడ తేయాకు, కాఫీ మరియు మిరియాలు పంటల పెంపకం జరుగుతుంది.
  •  ఇక్కడ అనేక టీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాణిజ్యం మరియు వ్యాపార కేంద్రంగా ఉంది.
  • ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రం మరియు గులాబీ పూలు, ఆర్చిడ్స్ మరియు ఆంథూరియం తోటలు ఉన్నాయి.

7. వందన్‌మేడు:

 

తేక్కడి-మున్నార్ రహదారిపై ఉన్న చిన్న పట్టణం వందన్‌మేడు. సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత కోసం ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది.

  •  1892 లో భారతదేశంలో బ్రిటీషర్లు నిర్మించిన మొదటి పోస్ట్ ఆఫీస్‌లలో వందన్‌మేడు పోస్టాఫీసు కూడా ఒకటి.
  •  వందన్‌మేడు గ్రామ కార్యాలయం ఒకప్పుడు ట్రావెన్‌కూర్ రాజుల పరిపాలనా కార్యాలయం అని చెబుతారు.
  •  ఈ పట్టణం లకుల తోటలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇక్కడ వేలం వేయబడుతుంది.

8. పుల్లమేడు:

 

హిల్ స్టేషన్ తేక్కడిలో సుందరమైన ప్రాంతాలలో పుల్లమేడు ఒకటి. దీని అర్ధం పచ్చిక బయళ్ళు. మీరు ఈ ప్రదేశాన్ని సందర్శించేటప్పుడు ఆ పేరెందుకు వచ్చిందో అర్ధం చేసుకుంటారు.

  •  సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు సందర్శించడానికి ఉత్తమ సమయం. వాతావరణం బాగుంటుంది మరియు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
  •  ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న కొండలు, లోయలలో వృక్ష జాతులు ఉన్నాయి. మీరు కొన్ని ప్రదేశాలను సందర్శించవచ్చు. పర్యావరణ వ్యవస్థలో సమతూకం ఉండాలి.
  •  పుల్లమేడులో సందర్శించేందుకు మీరు తేక్కడిలో వన్యప్రాణి సంరక్షణ అధికారి లేదా వల్లకడవు శ్రేణి అధికారి నుంచి అనుమతి పొందాలి.

9. రామక్కల్‌మేడు:

 

రామాక్కల్‌మేడు ఒక సుందరమైన కుగ్రామం. తన ప్రియమైన భార్య సీతను వెతుకుతూ రాముడు తన పాదాలను ఉంచిన ప్రదేశం. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది.

  •  ఈ కొండ పైన ఉన్న కురవన్ మరియు కురతి యొక్క భారీ విగ్రహం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇడుక్కి ఆనకట్ట నిర్మాణానికి ఇవి చారిత్రక పాత్రలు.
  •  విస్తారంగా వీచే గాలిని ఆస్వాదించండి. ఈ ప్రాంతంలో 7 విండ్ ఫామ్స్ ఉన్నాయి.
  • చుట్టూ హైకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. అయితే, వర్షాకాలం సమయంలో ఇక్కడకు వెళ్లవద్దు.

10. పీరుమేడు:

 

ట్రావెన్‌కూర్ రాజులకు ఒకప్పుడు వేసవి విడిది పీరుమేడు. ప్రశాంతత, సహజ అందం గల ఈ ప్రాంతం తేక్కడిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

  •  పర్వతారోహణ, పారాగ్లైడింగ్, సైక్లింగ్ మరియు గుర్రపు స్వారీకి అనువైనది.
  •  కాఫీ, టీ, మిరియాలు, ఏలకులు తోటలు, జలపాతాలు, కొండలతో నిండిన ప్రదేశం యొక్క సహజ సౌందర్యం మనోహరమైనది.
  • ఉష్ణోగ్రతలు 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య మారుతూ ఉండడంతో, వేసవి వేడిని అధిగమించేందుకు కేరళలో ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి పీరుమేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *