కేరళలో ఈ 30 పనులు తప్పక చేయాలి
పకృతి సౌందర్యం దర్శించాలనే ఆలోచన మీకు చాలా కాలం నుంచి ఉన్నా, విదేశాలలో ఉన్న ప్రాంతాలకు వెళ్లడం మీకు కష్టం కావచ్చు. అపుడు కేరళ మీ కలలను సాకారం చేస్తుంది. కళ్లు చెదిరిపోయే బ్యాక్‌వాటర్స్, తేయాకు తోటలు, అందమైన బీచ్‌లతో అలరారే ఈ ప్రాంతానికి దేవుడి సొంత దేశం అనే పేరు ఉంది. పర్యాటకులకు ఎన్నో అద్భుతమైన అనుభూతులను ఈ ప్రాంతం అందిస్తుంది. మీరు పర్యటించాలని భావిస్తున్న ప్రాంతాలలో కేరళ ఉంటే, కేరళలో చేయాల్సిన పనుల జాబితా ఇక్కడ ఉంది. ఇది మీ గైడ్ మాదిరిగా ఉపయోగపడుతుంది.
‘మంచి రోజులు వస్తాయి, వెళతాయి. కానీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి’ అనే నానుడి వినే ఉంటారు. కేరళ హాలిడే ప్యాకేజ్‌ల విషయంలో ఇది నిజ్జంగా నిజం. అందుబాటు ధరల్లోనే హాలిడే ప్యాకేజ్‌లు లభించడంతో, కేరళ ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది.
కేరళలో చేయాల్సిన ఉత్తమ పనులు
1. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించండి:
సుగంధ ద్రవ్యాల సువాసనలు, పశ్చిమ కనుమల్లో సౌందర్యం, వానలో తడిసి ముద్దవడం, కేరళ బ్యాక్‌వాటర్స్‌ను ఎంజాయ్ చేయడం, ఆధ్యాత్మిక అనుభవాలు, పక్షుల అభయారణ్యాలు, మీలో ఉత్సాహాన్ని తట్టి లేపే సాహస క్రీడలు వంటి ఎన్నో సహజమైన అద్భుతాలను కేరళలో ఎంజాయ్ చేయవచ్చు. ప్రకృతి ప్రేమికులకు మాత్రమే కాదు, అన్ని రకాల మనుషులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. కేరళలో తప్పక చేయాల్సిన పనులలో బ్యాక్ వాటర్ రూట్ కూడా ఒకటి.
2. యోగ మరియు మెడిటేషన్:
యోగ మీరు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశం అయితే, మీ కలల గమ్యస్థానం కేరళ.. మెడిడేషన్, యోగ, ఆయుర్వేద చికిత్సలకు కేరళ ప్రసిద్ధి. మీ మెదడు, శరీరం, ఆత్మలకు శిఙణ ఇచ్చే ఎన్నో అద్భుత శిక్షణా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. మీకు ప్రశాంతత కలిగిస్తాయి.
3. కోదనడ్‌లో ఏనుగుల స్నానం:
అనేక అద్భుతమైన చర్యలు చేపట్టేందుకు జీవిత కాల అనుభవాలను అందించే అవకాశాన్ని కేరళ టూరిజం అందిస్తుంది. భూమిపై నివసించే అత్యంత తెలివైన, విశ్వాసమైన జంతువు ఏనుగు. రోజువారీ కార్యక్రమాలతో పాటు చిన్న ఏనుగులను చూడవచ్చు, వాటికి ఆహారం అందించవచ్చు.
4. అలెప్పీలో హౌస్‌బోట్ పర్యటన:
అలెప్పీ పర్యటన అంటే మీ పాత స్నేహితుని ఇంటికి వెళ్లినట్లుగా ఎంజాయ్ చేయవచ్చు. మాట్లాడవచ్చు, పంచుకోవచ్చు, ఆలోచనలను విస్తృతపరచుకోవచ్చు. హౌస్‌బోట్ పడవలు, బీచ్‌లు, మరపురాని వంటకాలను ఆస్వాదించవచ్చు.
5. థెయ్యంను చూడండి:
ఓ కళ కంటే అద్భుతంగా మరేమీ ఉండదు. మీరు కళా పిపాసులు అయితే, అందాన్ని ఆస్వాదించేట్లు అయితే కొచ్చిలో పర్యటించండి. ఉత్తర కేరళలో ఆలయాలలో గ్రామ దేవతల ముందు నర్తించే సాంప్రదాయ నృత్య రూపం థెయ్యం. జంతువులు దేవతలకు పూజలు అర్పించిన విధానం.. ఈ నృత్య రూపకం చూస్తే గుర్తుకు రావడం ఖాయం.
6. సాంప్రదాయంగా చేపలు పట్టడం:
కేరళలో వలలతో చేపలు పట్టే విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. హౌస్‌బోట్ నుంచి సాంప్రదాయంగా చేపలు పట్టవచ్చు లేదా మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. మీరు ఎలాంటి పద్ధతి ఎంచుకున్నా సరే, ఒట్టి చేతులతో మీరు వెనక్కి తిరిగి రారని మేము హామీ ఇస్తున్నాం.
7. చర్చ్‌లను సందర్శించండి:
కేరళలో చర్చ్‌లను సందర్శించడం ఎంతో బాగుంటుంది. ఇందుకు కారణం విశాలమైన ప్రాంతాలలో నిర్మించడంతో ప్రకృతి అందమే. అలెప్పీలో అర్థుంకల్ చర్చ్‌ను సందర్శించేందుకు అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు.
8. ఆహారాన్ని ఆస్వాదించండి:
ఈ ప్రాంతంలో త్వరగా బోర్ కొట్టేసే అవకాశం ఉంది. అయితే, కేరళలో పర్యటించడం అంటే, మీ మానసిక ఉత్తేజంతో పాటు రుచికరమైన భోజనాన్ని కూడా ఆస్వాదించవచ్చు. సాంప్రదాయ ఇడ్లీ, దోశలతో పాటు మీ మూడ్‌ను తక్షణమే మార్చేయగల శక్తి ఉన్న వంటకాలు లభిస్తాయి. మీ కుటుంబంతో ఆహారాన్ని ఆస్వాదిస్తే దాని రుచి మరింతగా పెరుగుతుందని తెలుసు కదా.
9. కోటలు:
మీకు చారిత్రక కట్టడాలు ఇష్టమైతే, మీరు కేరళలో కోటలను అసలు మిస్ చేసుకోకూడదు. అతి తక్కువ ఆయుధాలతో యుద్ధాలు చేసిన కాలం, అద్భుతమైన ప్రాంతాలను ఈ కోటలు గుర్తు చేస్తాయి.
10. జంతుప్రదర్శన శాల సందర్శన:
పూలు, జంతు జాతులు సరైన మిశ్రమంగా దర్శనం ఇచ్చే ప్రాంతం కేరళ. త్రివేండ్రం జంతు ప్రదర్శన శాలలో వన్యప్రాణులు, సరస్సులు దర్శనం ఇస్తాయి.
11. పురావస్తు శాలను దర్శించండి:
కేరళ సాంస్కృతిక వారసత్వాన్ని అక్కడి పురావస్తు శాలలు అనేక రకాలుగా ప్రదర్శిస్తాయి. స్థానిక కళాకారులు తయారు చేసే హస్తకళా వస్తువులు, చారిత్రక ఆభరణాలు మిమ్మల్ని క్షణకాలం పాటు గత కాలంలోకి తీసుకు వెళ్లిపోతాయి.
12. జలపాతాలు – కేరళలో తప్పక చేయాల్సిన పనుల్లో ఒకటి:
కొండకోనల గుండా సాగే జలపాతాలు.. మనుషుల శరీరం, ఆత్మలకు శాంతి చేకూరుస్తుంది. ప్రకృతిలో ఎంతటి శక్తి సామర్ధ్యాలు ఉన్నాయనే విషయాన్ని మనం నమ్మదగిన విధంగా చెబుతాయి. దీన్ని పూర్తిగా అనుభవించేదుకు జూన్- నవంబర్ మధ్యలో ఇక్కడకు పర్యటించండి.
13. అద్భుతమైన సూర్యాస్తమయం:
కేరళలో సూర్యాస్తమయం మిమ్మలను ఆశ్చర్యపరుస్తుంది. డిసెంబర్ – జనవరి నెలల్లో ఇది మరింత అందంగా కనిపిస్తుంది.
14. కొబ్బరి జ్యూస్ ఆస్వాదించండి:
కొబ్బరి- రబ్బరు తోటలకు కేరళ ప్రసిద్ధి చెందిన ప్రాంతం. కొబ్బరి విషయానికి వస్తే, సాంప్రదాయ కొబ్బరి నీరు మీ శరీరం, ఆలోచనలను రీఫ్రెష్ చేస్తుంది.
15. ట్రైన్‌లో ప్రయాణించండి:
ఎన్నెన్నో అందమైన ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని ట్రైన్ రైడ్ కల్పిస్తుంది. బ్యాక్‌వాటర్స్, కొబ్బరి తోటలు, అందమైన కొలనులను చూడవచ్చు.
16. మటాన్‌చెర్రీ ప్యాలెస్ సందర్శన:
మీకు చరిత్రపై మక్కువ ఉన్నట్లయితే ఈ ప్యాలెస్ గురించి చాలానే విని ఉంటారు. కొచ్చి రాజుల గురించి అనేక కథలతో పాటు, చిత్రాలను కూడా సందర్శించవచ్చు.
17. ఎడక్కల్ గుహల దర్శనం:
వయాలాండ్‌కు సమీపపంలో అంబుకుతి కొండలలో ఉన్న ఎడక్కల్ గుహలు.. రాతి యుగానికి చెందినవి. క్రీ.పూ. 8700 కాలానికి చెందిన గోడలపై చిత్రీకరించిన చిత్రాలను చూడవచ్చు. మీరు కేరళ పర్యటించే సమయంలో తప్పనిసరిగా ఈ గుహలను సందర్శించండి. పురావస్తు కాలానికి మానవ నైపుణ్యాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది.
18. స్నేక్-బోట్ రేస్:
మీకు సాహసాలు ఇష్టమైతే ఓసారి ప్రయత్నించండి. స్నేక్-బోట్ రేసులో మీరు భాగం కావచ్చు. అలాగే సాహస నీటి క్రీడలను ఆడవచ్చు. కోవలం, అలప్పుజా బీచ్‌లలో అత్యంత ఉత్కంఠ కలిగించే అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. జూలై-సెప్టెంబర్ కాలంలో ఓనం పండుగ సందర్భంగా స్నేక్-బోట్ రేసు జరుగుతుంది. మీరు ఓ బోటును అద్దెకు తీసుకుని ఈ అనుభవాన్ని పొందవచ్చు. కేరళలో మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనుల్లో ఇది కూడా ఒకటి.
19. బీచ్‌లలో చక్కర్లు:
కేరళలో తప్పనిసరిగా చేయాల్సిన పనులలో బీచ్‌ల సందర్శన కూడా ఒకటి. ఇక్కడ ప్రతీ బీచ్‌కు ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ముంబై బీచ్‌లు రోజువారి హడావిడికి ప్రతీక అయితే, గోవా బీచ్‌లు జీవిత కథలను తెలుపుతాయి. కానీ కేరళ బీచ్‌లు మాత్రం ప్రశాంతంగా, దైవత్వాన్ని ప్రదర్శిస్తాయి. అందుకే కేరళ బీచ్‌లలో కొంత నీటిని చిలకరించుకోవడం మరచిపోకండి.
20. ఇడుక్కిలో బైక్‌పై రైడ్:
కేరళ టూర్ ప్యాకేజ్‌లలో ఆకట్టుకునే మరో విషయం, మన మనసుల్లో నిలిచిపోయే విషయం – ఇడుక్కి. సహజమైన మైదానాల్లో బైక్ రైడ్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అందమైన పుష్ప, జంతు జాతుల మధ్య గుండా టూవీలర్ పై చేసే ఇడుక్కి డ్యాం ప్రయాణం ఎంతగానో బాగుంటుంది. రోజువారీ హడావిడి, గందరగోళాలకు దూరంగా తీసుకెళ్లేందుకు ఈ సహజమైన అందం సహకరిస్తుంది.
21. బాంబూ రాఫ్టింగ్:
కేరళలో మీరు చేయవలసిన పనుల్లో బాంబూ రాఫ్టింగ్ కూడా ఒఖటి. థెక్కడిలోని పెరియార్ టైగర్ రిజర్వ్‌ను మీ పర్యటనలో ఒక భాగం చేసుకోవడం మరచిపోకండ. ప్రకృతి సౌందర్యం, జంతువులు, పక్షుల కిలకిలారావాలను ఆస్వాదించే ఎకో-టూరిస్ట్ ప్రాంతం ఎంతో ప్రత్యేకమైనది.
22. కయాకింగ్:
మీ కుటుంబం అంతా సాహసారపై ఆసక్తి కలది అయితే, కయాకింగ్‌తో ఆనందించవచ్చు. బ్యాక్‌వాటర్స్‌లో పర్యటిస్తూ కేరళ సంస్కృతి, సాంప్రదాయాలను అనుభవించవచ్చు.
23. ట్రెక్కింగ్:
మీరు ఎత్తైన, నిటారైన కొండలు మిమ్మలను ఆకర్షిస్తే, కేరళలో ట్రెక్కింగ్ తప్పనిసరిగా ప్రయత్నించాలి. వాయనాడ్‌లో చెంబ్ర పీక్ వంటి ప్రాంతాలలో ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి.
24. టెంట్‌లో నివాసం:
టెంట్ లేదా ట్రీ హౌస్‌లో నివాసం ఉండడం అంటే, ప్రకృతికి దగ్గరగా ఉండడమే. ఇక్కడ ఓ కీలకమైన ప్రదేశం నుంచి జంతువులను దర్శించవచ్చు. నిజంగా ఇదో మరపురాని అనుభవం.
25. ట్రెడ్‌మిల్ వర్కవుట్:
మీరు జిమ్‌లో ఎప్పుడూ చేసే వర్కవుట్ గురించి చెప్పడం లేదు. ఇక్కడ ఓ రైతు మీకు అనుమతి ఇస్తే, కేరళ పంట పొలాల్లో పెడలింగ్‌ను ప్రయత్నించవచ్చు.
26. వైల్డ్‌లైఫ్ సఫారి:
ప్రకృతి మనకు ఎన్నో అందించిందనే విషయం మనకు తెలుసు. మనిషి కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. ఈ సఫారి టూర్ ద్వారా అద్భుతమైన పక్షి, జంతు జాతులను పచ్చని అడవుల్లో దర్శించవచ్చు.
27. ఏనుగుపై టూర్:
కేరళలో తప్పనిసరిగా ఇది చేయాల్సిందే. ఏనుగులతో స్నానం చేయడం, ఆహారం తినిపించడం వంటివి మీకు తెగ నచ్చినట్లు అయితే, దానికి యజమానిలా భావించడం సహజమే. అయితే ఏనుగుపై ఓ రైడ్ చేసి, రాజు మాదిరిగా భావించవచ్చు. కేరళ టూర్ ప్యాకేజ్‌లో ఏనుగుపై రైడ్ కూడా ఒక భాగంగా చేసుకోండి.
28. కనోయిపై రైడ్:
కేరళలోని అంతర్గత ప్రాంతాలను దర్శించాలనే ఆసక్తి ఉన్నట్లు అయితే, కనోయి్గ సరైన చర్య. అక్కడి స్థానిక ప్రజల జీవనం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోండి.
29. ఎద్దుపై పందెం కట్టండి:
క్యాసినోలలో బెట్టింగ్ కాయమని మేం చెప్పడం లేదు. కేరళ సాంప్రదాయం ప్రకారం పాత విధానాల పందెం కాయండి. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం పర్యాటకులు ఏదైనా ఎద్దుపై పందె కట్టి, అది గెలిచేందుకు కేరింతలు కొట్టవచ్చు. మలప్పురం జిల్లాలో ఈ ఈవెంట్ జరుగుతుంది.
30. పారాగ్లైడింగ్:
కేరళలోని అద్భుతమైన కొండలలో పారా గ్లైడింగ్ కూడా చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన శిక్షణ ఏదీ అవసరం లేదు. మీకు కావాల్సినదల్లా ధైర్యం, ఓ పైలట్ అంతే.
కేరళ బ్యాక్ వాటర్స్ యొక్క అద్భుతమైన సౌందర్యం, మీ ప్రయాణ అనుభూతిని ఎన్నటికి మరచిపోనివ్వవు. ఇప్పుడే ప్రయాణానికి సిద్ధమైపోండి. ఈ మాయ చేసే ప్రాంతంలో పర్యటన కోసం బుక్ చేసుకోండి.
Thank you team for your blog. You guys made my holiday much better. It couldn’t have been much better than this. ! Keep up your good work 🙂 :).. Happy new year.!
I really found this Article beneficent for the folks who wants to read in regional language and it would be hellacious if you can publish other destinations in South India too.