Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

పట్టాయాలో ఈ 10 పనులు చేసి తీరాల్సిందే!

హ్యాంగోవర్‌లో మునిగిపోయేందుకు పట్టాయా అద్భుతమైన ప్రాంతం. క్రేజీ.. ఫన్.. వైల్డ్.. అదీ పట్టాయా! కుర్రాళ్లు సెలవు రోజులను ఆనందంగా గడిపేందుకు పరిపూర్ణమైన గమ్యస్థానంగా గుర్తింపు పొందింది. పట్టాయా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైన సెలవు ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది. జంటలు అయినా, ఒంటరి ప్రయాణికులు అయినా.. స్వేచ్ఛ కోసం చూస్తున్న మహిళలకు అయినా ఇది సరైన ప్రాంతం. మీరు కొంత ఆనందాన్ని కోరుకునే వారు అయితే.. పట్టాయాలో ఈ పనులు తప్పక చేయాలి.

పట్టాయాలో ఏం చేయవచ్చంటే?

1. రాత్రంతా పార్టీ – పట్టాయాలో చేయదగిన ఉత్తమమైన వాటిలో ఒకటి

 

పట్టాయా పర్యాటక రంగం అభివృద్ధికి, పురోగతికి అతి పెద్ద కారణాలలో ఇది ఒకటి. పార్టీ హబ్‌గా గుర్తింపు పొందిన పట్టాయాలో.. కేవలం పార్టీ కోసమే ఒక రాత్రిని గడపాలి.

  •  పట్టాయా బీచ్ రోడ్ చివరలో 500 మీటర్లు విస్తరించిన వాకింగ్ స్ట్రీట్.. పార్టీ ప్రేమికులకు స్వర్గంలా ఉంటుంది. మిమ్మల్ని మైమరపించే సంగీతం వినవచ్చు. నైట్‌క్లబ్‌లు, రెస్టారెంట్లు, బార్లు మరియు రుచికరమైన ఆహారం ఆస్వాదించవచ్చు. సాయంత్రం 6 నుండి ఉదయం 2 గంటల వరకు తెరిచి ఉంటుంది.
  • టిఫనీ వద్ద ప్రతిభావంతులైన లేడీ బాయ్స్ ప్రదర్శించే క్యాబరే ప్రదర్శనలు మరియు క్రాస్ డ్రెసింగ్ చేసుకున్న వారు ప్రదర్శించే అల్సజార్ ఎంతో ఆకట్టుకుంటుంది.
  •  డ్యాన్స్, మ్యూజిక్ మరియు డ్రామా ఉపయోగించి వివిధ కథలను వర్ణిస్తాయి. టిఫనీ 3 వేళలలో ప్రదర్శింబడుతుంది. సాయంత్రం 6 గంటలు, గం. 7.30 ని., మరియు 9 గం. అల్సజార్ 4 ప్రదర్శనలను కలిగి ఉంటుంది. 5 పీఎం, 6.30 పీఎం, 8 పీఎం మరియు 9.30 పీఎం.

2. సాహసాలతో థ్రిల్లింగ్ అనుభూతి:

 

అత్యుత్తమ సాహస క్రీడల నుండి ప్రత్యేక సాహస అనుభవాల వరకు, మీ థాయిలాండ్ హాలిడే ప్యాకేజీలతో పాటే అద్భుతమైన కార్యకలాపాలను కలిగి ఉంది.

  •  కాయో ఖేవ్ ఓపెన్ జూ దగ్గర 3 కిలోమీటర్ల విస్తీర్ణం గల గిబ్బాన్ జిప్ లైన్ ఫ్లైట్ అంతటా తిరుగుతూ.. ఆనందకరమైన కానోపీ టూర్‌లో పాల్గొనండి. ఇది ఉదయం 6 గంటల నుండి తెరిచి ఉంటుంది.
  •  ఉక్కు బంతిలో ఉండగా గాలిలో విసిరివేయబడితే ఎలా ఉంటుంది? వాకింగ్ స్ట్రీట్లో ప్రసిద్ధ స్కై పట్టాయా రాకెట్ బాల్ రైడ్ వద్ద ఈ అనుభూతి పొందవచ్చు. సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు తెరచి ఉంటుంది.

 

  •  గాలిలో ఎగురుతున్నట్లుగా ఎల్లప్పుడూ కలలు కంటున్నారా? నాంగ్ ఖో వద్ద ఆకాశంలో డైవింగ్ ఆనందించండి మరియు ఒక పక్షి మాదిరిగా ఎగరండి!

3. థీమ్ పార్కులలో మీ భావాలను ఆనందించండి:

 

మీరు ప్రపంచవ్యాప్తంగా పలు థీమ్ పార్కులను సందర్శించి ఉండవచ్చు. కానీ పట్టాయాలోని థీమ్ పార్కుల యొక్క ప్రత్యేకమైన అనుభవాన్ని ఏదీ ఎప్పుడూ ఓడించలేదు.

  •  పట్టాయా సందర్శించడానికి ఉత్తమ స్థలాలలో ఒకటి మినీ సియామ్. ఇది ప్రపంచంలోని థాయ్ స్మారకాలు మరియు అద్భుతాల చిన్న ప్రతిరూపాలను కలిగి ఉంది. ఉదయం 8.30 నుండి ప్రారంభమయ్యే అర్ధ రోజు పర్యటనలు ఉన్నాయి.
  •  మీరు మీ పిల్లలతో ఒక థాయిలాండ్ పర్యటన ప్యాకేజీలో ఉంటే, ప్రపంచం యొక్క మొట్టమొదటి కార్టూన్ నెట్వర్క్ థీమ్ పార్క్ అయిన కార్టూన్ నెట్వర్క్ అమెజాన్‌లో.. ప్రత్యేక సరదా-సవారీలు మరియు స్లైడ్స్‌ను ఎంజాయ్ చేయండి. సందర్శన వేళలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గం.
  •  ఆగ్నేయ ఆసియా యొక్క అతి పెద్ద నీటి ఉద్యానవనం రామాయణ వాటర్ పార్కు, వివిధ రకాల సవారీలు, స్లైడ్స్, కొలనులు, గీసర్స్ మరియు బబుల్స్. సందర్శన వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది తెరిచి ఉంటుంది.

4. అలసిపోయే వరకు షాపింగ్ – పట్టాయాలో చేయాల్సిందే:

 

అధికస్థాయి ఫ్యాషన్‌తో పాటు చవక బేరాలు పొందండి. ఇక్కడ షాపింగ్ సైట్లకు ఎటువంటి కొరత లేదు. వాకింగ్ స్ట్రీట్ లేదా ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గర షాపింగ్ ఓ కొత్త అనుభవం అందిస్తుంది.

  •  అద్భుతమైన నైట్‌లైఫ్ కాకుండా, వాకింగ్ స్ట్రీట్‌లో డిజైనర్ దుస్తులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, మరియు కాస్మెటిక్స్ పొందవచ్చు.
  •  థెప్రాసిట్ మార్కెట్ మరియు పట్టాయా నైట్ బజార్ల వద్ద అనేక మాల్స్ ఉన్నాయి.
  •  ఫ్లోటింగ్ మార్కెట్ ఓ కొత్త షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. నీటిపై తేలే 114 షాపులు ఇక్కడ ఉన్నాయి. 

 

5. హృదయాన్ని తాకే తినుబండారాలు:

 

రుచికరమైన థాయ్ ఆహారం తీసుకోకుండా థాయ్‌ల్యాండ్ టూర్ పూర్తి చేయలేము. ముఖ్యంగా సీఫుడ్ తినాల్సిందే.

  •  గ్లాస్ హౌస్ మరియు మమ్ అరోయి వద్ద సముద్రపు అలలతో సేద తీరుతూ.. కొన్ని రుచికరమైన సముద్ర ఆహారాలను తినవచ్చు.
  • రింపా లాపిన్లో ఒక టేబుల్ బుక్ చేసుకుని.. ఒక కొండపై ఉండి చక్కటి భోజన అనుభవాన్ని ఆనందించండి.
  • వాకింగ్ స్ట్రీట్ మరియు థెప్రాసిట్ మార్కెట్‌లో నడవండి. అక్కడ వీధి దుకాణాల్లో కొన్ని అద్భుతమైన రుచికరమైన పదార్ధాలను తగిన ధరలలోనే ఆస్వాదించండి.

 

6. ఎంతెంత ఆనందమో!

 

పట్టాయా బీచ్‌లు, ద్వీపాలు మరియు ఒక ప్రత్యేకమైన సముద్ర ఉద్యానవనం .. అత్యంత ఉత్కంఠభరితమైన నీటి ప్రపంచానికి నివాసంగా ఉంది.

  •  సహజమైన కోహ్ సమెట్ ద్వీపం మరియు కోహ్‌లర్న్ ద్వీపం లేదా జామ్‌టీన్, నికోలా మరియు వాంగ్ బీచ్‌లలో.. ఈత, సన్ బాత్ మాత్రమే కాకుండా ఎంతో సమయం గడిపి ఆనందించండి.
  •  స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, డైవింగ్, జెట్ స్కీయింగ్, పారాసైలింగ్, బనానా బోటింగ్ వంటి నీటి క్రీడలను కూడా మీరు ఈ స్థలాలలో అనుభవించవచ్చు.
  • అండర్‌వాటర్ వరల్డ్ మెరైన్ పార్క్ అంటే ఒక అక్వేరియం మాత్రమే కాదు. మీరు సొరచేపలతో ఈత కొట్టవచ్చు మరియు ఇక్కడ చేపలకు ఆహారం తినిపించవచ్చు. సందర్శన వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.

 

7. సహజ అద్భుతాలు సందర్శించండి:

 

పట్టాయాలోని ప్రతిచోటా అందం ఉంటుంది. కొన్ని సహజ అద్భుతాలలో పర్యటన కోసం జాబితా సిద్ధంగా ఉంది.

  •  మొక్కలు మరియు పువ్వుల అద్భుతమైన సేకరణను కలిగి ఉన్న నాంగ్‌నూచ్ బొటానికల్ గార్డెన్‌లో.. మీ పట్టాయా సందర్శనా స్థలాన్ని ప్రారంభించండి. సమీపంలో ఒక జూ ఉంటుంది. దీని సందర్శన వేళలు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటలు.
  • పట్టాయా క్రెసెంట్ బే యొక్క అద్భుతమైన దృశ్యాన్ని పట్టాయా వ్యూ పాయింట్ అందిస్తుంది. ఇది ఉదయం 7.30 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.

8. అంతర్గత శక్తి కనుగొనడం:

 

కేవలం మనోహరమైన నైట్‌లైఫ్‌ మాత్రమే కాదు, పట్టాయా థాయిలాండ్ పర్యాటక ఆకర్షణలలో ఒక ప్రశాంతమైన మరియు నిర్మలమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది.

  •  మీరు పట్టాయాలోని శాంక్చురీ ఆఫ్ ట్రూత్ శాంక్చురీ దగ్గర అత్యంత అద్భుతమైన శిల్పాలు చూడవచ్చు. ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది తెరిచి ఉంటుంది.

 

  • వట్‌ఫ్రాఖయోయి అని కూడా పిలువబడే పెద్ద బుద్ధుని కొండపై బంగారు బుద్ధ విగ్రహాన్ని కలిగిన ఆలయం ఉంది. ఇది జోంటియన్ బీచ్ సమీపంలో ఉంది. ఉదయం 6.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.
  •  స్థానికంగా ఖావో చి చాన్ అని పిలవబడే బుద్ధ పర్వతం 130 మీటర్ల ఎత్తు మరియు 70 మీటర్ల వెడల్పు బంగారం పూత పూసి ఉంటుంది. ప్రపంచంలో అతి పెద్ద చెక్కబడిన బుద్ధుని స్థూపం సమీపంలో ఉత్కంఠభరితమైన సిల్వర్‌లేక్ ఉంది. ఈ ప్రాంతం ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.

9. చరిత్ర మరియు వారసత్వం:

 

థాయిలాండ్‌లో మీరు చూడగలిగే ప్రతిచోటా, అన్వేషించే ప్రతిచోటా చరిత్ర మూలాలు ఉంటాయి.

  •  ఒక అందమైన దేవాలయము మరియు చారిత్రాత్మక కళాఖండాల సేకరణకు ప్రసిద్ధి చెందిన మ్యూజియం అనెక్కుసలా సాలా లేదా విహార్న్‌సియెన్. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.
  •  థాయ్‌లో ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతున్న పాస్టెల్ రంగులలో నిండిన భారీ భవనం సుఖవేడీ మాన్షన్. ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.

10. జంతువుల రాజ్యం:

 

మీరు ఒక వన్యప్రాణి ఔత్సాహికుడు అయితే, పట్టాయా చుట్టూ ఉన్న కొన్ని వన్యప్రాణి వనరులను అన్వేషించటానికి వెళ్ళినపు గొప్ప జీవవైవిధ్యాన్ని చూసి మంత్రముగ్ధులు కావడం ఖాయం.

  •  ఖావోఖేవ్ ఓపెన్ జూ ప్రపంచంలోని అతి పెద్ద జంతుప్రదర్శన శాల. ​​దాదాపు 8000 జంతువులు మరియు 300 రకాల జాతులకు వాటి సహజ నివాసాలు ఉంటాయి. ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది తెరిచి ఉంటుంది.
  •  శ్రీరాచా టైగర్ జూలో 200 బెంగాల్ పులులు మరియు 10,000 మొసళ్ళు ఉన్నాయి. ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది తెరిచి ఉంటుంది.
  •  ఎలిఫెంట్ విలేజ్ వద్ద, మీరు ఏనుగులతో ఆడుకోవడం, వాటికి స్నానం చేయించడం, వాటిపై రైడ్ చేయవచ్చు. ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది.

 

ఇప్పుడు థాయ్ యాత్రను ఎలా నిర్వహించాలో అనే అంశంపై, పట్టాయాలో చేయాల్సిన అంశాలపై మీకు అవగాహన వచ్చింది కదా. ఉత్తమ టాప్ థాయిలాండ్ టూర్ ప్యాకేజీలను చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *