Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

థాయిలాండ్‌లో 10 ఉత్తమ బీచ్‌లు

మీరు 2000 మైళ్ళ తీరప్రాంతాల గురించి ఆలోచించినప్పుడు, మీ ఆఖరిని రూపాయిని కూడా ఖర్చు పెట్టేసి సంతోషం అనుభవించేందుకు వీలుగా కొన్ని అందమైన బీచ్‌లు ఉండాలని మీరు అనుకోవచ్చు. మెరిసే నీళ్లు, తెల్లని ఇసుక బీచ్‌లతో స్వర్గం మాదిరిగా థాయిల్యాండ్ ఉంటుది. ఇక్కడ ప్రతి బీచ్ ఇతర బీచ్‌లతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఇక్కడ పార్టీలను చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు, వాటర్ స్పోర్ట్స్‌తో థ్రిల్ అనుభూతి చెందుతారు. థాయిలాండ్‌లో మీ విశ్రాంతి సమయాన్ని ఆనందించండి. అయితే, మీరు చిన్న పర్యటన కోసం థాయిలాండ్‌లో ఉన్నట్లయితే, ఇక్కడ ఉత్తమ బీచ్‌లను సందర్శించాల్సిందే.

థాయిలాండ్‌లో ఉత్తమ బీచ్‌లు

1. ఫ్రా నాంగ్ బీచ్:

Phra Nang Beach

ఫ్రా నంగ్ బీచ్ ఇప్పటికీ చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతంగా ఉండడానికి కారణం, దాని సహజ సౌందర్యం నిలుపుకోవడమే. అందమైన సున్నపురాయి శిఖరాలతో చుట్టుముట్టిన సముద్రంలో సహజమైన తెల్లని ఇసుకతో నిండి ఉంటుంది. ఇది కలకాలం నిలిచిపోయే పెయింటింగ్ మాదిరిగా ఉంటుంది. మీరు బీచ్ వద్ద ఒక ఆహ్లాదకరమైన సమయం గడపవచ్చు. మీరు కొండ శిఖరానికి ఒక గైడెడ్ ట్రెక్కింగ్ చేయవచ్చు.

 

2. పటోంగ్ బీచ్:

ఫుకెట్ బీచ్‌లలో అతిపెద్దది మరియు ఎంతో గుర్తింపు ఉన్న బీచ్ ఇది. ఫుకెట్ యొక్క పార్టీ రాజధానిగా దీన్ని పిలుస్తారు. సుదీర్ఘ తీరరేఖ మృదువైన తెల్లని ఇసుకతో ఈ ప్రాంతం నిండిపోయింది. వెచ్చని నీరు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రలోభపెడుతుంది. మీరు వాటర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడితే, ఇక్కడ జెట్ స్కీయింగ్ మరియు పారాసైలింగ్ చేయవచ్చు. బీచ్ చుట్టూ సందడిగా ఉన్న ప్రాంతంలో నైట్‌ క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లు మరియు షాపింగ్ దుకాణాలు ఉంటాయి. అందుకే థాయిలాండ్‌లో ఉన్న ఉత్తమ బీచ్‌లలో పటాంగ్ బీచ్ ఒకటిగా పరిగణిస్తారు.

 

3. రైలే బీచ్:

రైలే బీచ్‌లో ఒక సెలవుదినం గడపడం అంటే కేవలం బీచ్ కార్యకలాపాలకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది కచ్చితంగా బీచ్ గురించే. మీరు పడవలో సముద్ర తీరానికి వచ్చిన తర్వాత, నీలి నీళ్ళు, గంభీరమైన శిఖరాలు మరియు ద్వీప సమూహాలను చూసి మంత్రముగ్ధులు అవుతారు. ఇది ఒక ఎడారి లాంటి అనుభూతిని కలిగించే బీచ్. మీరు హాయిగా విశ్రాంతిగా కూర్చుని సహజ అందం ఆరాధించవచ్చు. రాక్ క్లైంబింగ్, స్విమ్మింగ్ లేదా స్నార్కెలింగ్ చేయవచ్చు.

 

4. మయ బే:

లియోనార్డో డికాప్రియో నటించిన ‘ది బీచ్’ చూస్తున్నప్పుడు పొడవాటి సున్నపురాయి శిఖరాల మధ్యలో కనిపించే అందమైన చిన్న బీచ్‌ మిమ్ములను ఆకర్షించింద? అయితే, మీరు మయ బే వద్ద ఆ ఆహ్లాదకరమైన అనుభూతి చెందుతారు. ఫి ఫి లేహ్ జాతీయ పార్కులో భాగమైన ఈ ప్రాంతంలో అఢుగు పెట్టేందుకు మీరు ఎంట్రీ ఫీజును చెల్లించాలి. అక్కడ వసతి లేకపోవడంతో కచ్చితంగా సాయంత్రం తిరిగి బయలుదేరాలి. అందుకే ఉదయం ఒక పడవ రైడ్ తీసుకోవడం ఉత్తమం.

 

5. జోమ్టియన్ బీచ్:

మీరు సందడిగల నైట్‌ లైఫ్‌ కోసం పట్టాయాకి వచ్చి ఉండవచ్చు. కానీ ఈ అందమైన పట్టాయా బీచ్ మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. పామ్ చెట్ల మధ్యలో సూర్యుడు ముద్దాడినట్లుగా ఉండే సముద్రతీరంలో ఉన్న బీచ్‌లో సెలవుదినం గడపవచ్చు. సాంప్రదాయ థాయ్ మసాజ్‌ మిమ్మల్ని విలాసపరుస్తుంది. మీరు ఈత, డైవింగ్, విండ్ సర్ఫింగ్, కైట్ బోర్డింగ్, కతమరన్ సెయిలింగ్ చేసి ఆనందించవచ్చు.

 

6. హువా హీన్ బీచ్:

బ్యాంకాక్ లో చాలా బీచ్‌లు ఉన్నా, హువా హిన్ బీచ్ యొక్క రాజసాన్ని మరేదీ ఓడించలేదు. ఈ బీచ్ కింగ్ రామ VIIకి విశ్రాంతి ప్రదేశంగా ఉండగా, ఇది ఇప్పుడు ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. పిల్లలతో ఇక్కడ నీటిలో మీరు చాలా సరదాగా ఆడవచ్చు. నేటికి కూడా థాయ్ రాయల్టీ ద్వారా ఉపయోగించే క్లై కంగ్వాన్ ప్యాలెస్‌ను సమీపంలో చూడవచ్చు. ఈ బీచ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి.

థామస్ కుక్ అందించే ఉత్తమ థాయిలాండ్ హాలిడే ప్యాకేజీలను చూడండి.

 

7. లామై బీచ్:

స్యామ్యూలో అనిర్వచనీయమైన అనుభూతి కలిగించే బీచ్ లామై. విభిన్న అనుభవాలను ఇది అందిస్తుంది. నిర్మలమైన తెల్లని ఇసుకలో బీచ్‌లో కూర్చుని కెరటాలను ఆస్వాదిస్తూ రోజంతా గడిపేయవచ్చు. రాత్రులలో ఈ ప్రాంతంలోని బార్లు మరియు రెస్టారెంట్‌ల నుంచి వచ్చే శబ్దాలతో ఇది ఓ భారీ పార్టీ ప్రాంతంగా మారిపోతుంది.

 

8. హాడ్ రిన్:

Haad Rin

థాయిలాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటిగా మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ఫుల్ మూన్ పార్టీలకు వేదికగా హాడ్ రిన్ బీచ్ నిలుస్తోంది. పౌర్ణమి రాత్రులలో ఇక్కడ వినిపించే రాకింగ్ మ్యూజిక్‌కు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఫుడ్, డ్రింగ్స్ ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా సముద్రతీరంలో ఏడాది పొడవునా పార్టీలు జరుగుతాయి. పార్టీలంటే ఇష్టపడేవారికి ఇది స్వర్గం. అందమైన సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలు ఈ బీచ్ బాగా ప్రసిద్ధి చెందింది.

 

9. కటా బీచ్, ఫుకెట్:

ఫాస్ట్-పేస్డ్ బీచ్‌లను కాకుండా మీరు ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే, మీరు తప్పనిసరిగా కటా బీచ్‌కు వెళ్లాల్సిందే. సూర్యుడు ముద్దాడే ఈ బీచ్ వెచ్చని నీటితో, తాటి చెట్లతో శాంతముగా ఉంటుంది. విశ్రాంతితో కూడిన సెలవు దినం కోసం ఇక్కడకు రావాల్సిందే. లో సీజన్లో సర్ఫింగ్ కోసం ఇది ఒక గొప్ప ప్రదేశం. ఇలాంటి సమయంలో సముద్రం చాలా తీవ్రంగా ఉండడంతో మీ పిల్లలను సముద్ర తీరానికి తేవడం సరైన ఆలోచన కాదు.

 

10. సాయిరీ బీచ్:

సూర్యకాంతి, సముద్రం, బూడిదరంగు రాళ్ళు, తాటి చెట్లతో సాయిరీ బీచ్ అందంగానే కాదు సుందరమైన దృశ్యంగా నిలుస్తుంది. కేవలం ఒక మైలు మాత్రమే ఉన్నా సరే, ఇది సుందరమైన కో టావో ద్వీపంలో ఇది అతిపెద్ద బీచ్. స్నార్కెలింగ్ మరియు స్కూబా డైవింగ్ కోసం ప్రసిద్ధి. ఇక్కడ జీవితం కొంత వెనుకబడినట్లు ఉన్నా, కొన్ని నైట్‌క్లబ్స్, బార్లలో ఇక్కడ మీరు పార్టీలు చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *