Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

అద్భుత దృశ్యమాలిక శాంటోరినిలో యాల్సిన 10 విషయాలు

గ్రీస్ ద్వీపంలో అత్యంత అందమైన ద్వీప సమూహాలలో శాంటోరిని ఒకటి. ప్రకాశవంతమైన నీరు, మహోన్నత శిఖరాలు, తెల్లగా తళతళలాడే గ్రామం మరియు గ్రీకు నిర్మాణ శైలి మిశ్రమం. మీ కలల్లో మాత్రమే దర్శనం ఇచ్చే అందమైన స్థలం. మీ కల వాస్తవంగా మారే ముందు, మీరు శాంటోరినిలో చేయదగిన అద్భుతమైన విషయాలు తెలుసుకోండి.

15,000 కంటే ఎక్కువ మంది నివాసం ఉంటున్న ఏకైక అతిపెద్ద ద్వీపం. అంతేకాదు, ఇక్కడి స్థానికుల కంటే పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వాస్తవానికి, గ్రీస్ దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు గ్రీస్ కీలక అంశం. ఈ ద్వీపాల యొక్క అపారమైన శిఖరాలు అక్కడి అగ్నిపర్వతం కారణంగా ఏర్పడ్డాయి. భూమిపై ఏ ఇతర అగ్నిపర్వతాన్ని శాంటోరిని అందంతో పోల్చలేము. కేవలం వాకింగ్ మరియు ఫోటోలను తీసుకోవడం ద్వారానే ఎంతో ఆనందం అనుభవించవచ్చు. బాల్కనీ నుంచి కనిపించే అద్భుతమైన వీక్షణ మనసులను ఆకట్టుకుంటుంది. మీకు శాంటరోనిలో మాత్రమే చేయదగిన పలు అంశాలను ఇక్కడ జాబితాగా ఇస్తున్నాము.

శాంటోరినిలో చేయవలసిన ఉత్తమ విషయాలు

1. చిన్న గ్రామాల్లో నడక:

 

మీరు జనసమ్మర్దాన్ని నివారించాలని కోరుకుంటే, మీరు శాంటోరినిలోని చిన్న సుందరమైన గ్రామాలకు వెళ్ళాలి. ఈ చిన్న గ్రామాలలో చేయవలసినది పెద్దగా ఏమీ ఉండదు. కానీ మీరు ఇమెరోవిగ్లి, ఫిరోస్టీఫని మరియు ఓయా గ్రామాల యొక్క పరిపూర్ణ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రతి గ్రామంలోను ప్రత్యేకమైన సొంత ఆకర్షణ ఉంటుంది.

2. ఓయా:

 

మీరు వాల్‌పేపర్లలో అందమైన తెల్లని బిల్డింగులు, వాటి పైకప్పుపై నీలి గోపురం దృశ్యాలను చూసి ఉండవచ్చు. వాటిని చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారు? అది అద్భుతమైన ఓయా. ఇక్కడ అనేకమంది ఫోటోలను తీసుకుంటారు. ఇది శాంటోరినిలోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటి.

కాబట్టి, మీరు మీ గ్రీస్ సెలవు రోజులను ఉత్తమంగా గడపాలని అనుకుంటే, అప్పుడు మీరు ఓయా రావాల్సిందే. అద్భుతమైన సూర్యాస్తమయం చూసి ఓయాను ఆస్వాదించండి. అయితే ఉదయానికే లేదా మధ్యాహ్నం సమయానికే అక్కడకు చేరుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం తరువాత అక్కడ జనాలు గుమికూడతారు.

3. ఫిరా:

 

మీరు కొంచెం సాహసం కోరుకుంటున్నారా? అప్పుడు ఫిరాకు వెళ్లండి. థ్రిల్ మరియు అడ్వెంచర్ ప్రేమించే వ్యక్తి అయి ఉండి, కొంతవరకు ఫిట్‌గా ఉన్నట్లయితే, అపుడు మీరు ఖచ్చితంగా హైకింగ్ కోసం ఇక్కడ వెళ్లాలి. ఫిరా నుంచి ఓయాకి మూడు గంటల పాటు హైకింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు శాంటోరినిలో చేయవలసిన విషయాల జాబితాకు దీన్ని జోడించాలి. కొన్ని ప్రాంతాలలో ఇది కొంచెం కఠినమైనది మరియు కష్టతరమైనది. అందుకే అందరికీ ఇది సిఫార్సు చేయబడదు. మీరు సుదీర్ఘంగా నడిచేందుకు సిద్ధంగా ఉండి, ఈ స్థలం యొక్క మంత్రముగ్ధమైన అందాన్ని ఆస్వాదించాలని అనుకుంటే, ఖచ్చితంగా ఫిరా కాలిబాట పట్టాలి. మీరు సాహస ప్రేమికులు కాకుంటే, ఓ మోటార్ బైక్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ఫిరా, ఓయా మరియు ఇమెరోలను అన్వేషించవచ్చు.

4. శాంటోరినిలో వైన్ రుచి చూడడం- శాంటోరినిలో అత్యంత సిఫార్సు చేయబడిన అంశాలలో ఒకటి:

 

శాంటోరినిలో ఉన్న అంశాల విషయానికి వస్తే, ఈ స్థలం సందర్శకులకు చాలా అవకాశాలు ఇస్తుంది. శాంటోరిని బ్రహ్మాండమైన హనీమూన్ గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందింది. కానీ చాలామందికి ఈ ప్రాంతం వైన్.. దాని ప్రత్యేక రుచి కోసం ప్రసిద్ధి చెందిందనే విషయం తెలియదు. విన్సంటో, మెజ్జో మరియు నైచెట్రీలు శాంటోరినిలో మీరు ప్రయత్నించవలసిన ప్రసిద్ధ స్థానిక వైన్ రకాలు. వైన్ ప్రేమికులకు ఇది స్వర్గం. మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు కనీసం ఒక వైనరీని సందర్శించనట్లయితే, మీరు ద్వీపం యొక్క రహస్యాలను కోల్పోతారు.

5. బీచ్ ప్రియుల కోసం ఎరుపు మరియు నలుపు బీచ్‌లు:

 

ద్వీపం యొక్క ఆగ్నేయ దిశలో ఒక పొడవైన నల్లని ఇసుక బీచ్ పేరు పెరిస్సా. మీరు సముద్రతీరంలో, తక్కువ జనసాంద్రత గల ప్రాంతంలో కూర్చుని.. ఓ పుస్తకాన్ని చదువుకోవచ్చు. లేదా మీరు కొంచెం బీర్ తీసుకుని సరసమైన ధరకే విలాసవంతమైన అనుభవాన్ని పొందవచ్చు. శాంటోరిని యొక్క ప్రధాన పర్యాటక కేంద్రాల కంటే పెరిస్సాలో తక్కువ ఖర్చు అవుతుంది. మీరు సముద్రపు ఒడ్డున ఉంటే దాని ముందు మీ అద్దెకు తీసుకున్న మోటార్‌బైక్‌ను పార్క్ చేయవచ్చు. మరియు పెరిస్సా బీచ్‌లోని స్పష్టమైన నీటిలో మునిగితేలవచ్చు.

ఆకట్టుకునే ఎరుపు బీచ్ సందర్శించండి. ఈ బీచ్ చుట్టూ ఎత్తైన శిఖరాలు ఎర్రగా ఉంటాయి. సముద్రపు ఇసుక కూడా ఎరుపు రంగులో ఉంటుంది. ఇది చాలా అరుదైన దృశ్యం. ఎర్రని గులకరాళ్ళు, ఎరుపు మరియు నలుపు నేపథ్యంతో కనిపించే నీరు సందర్శకులను ఆకట్టుకుంటాయి.

6. పూర్వ చరిత్రను చూపే థిరా మ్యూజియం:

 

పూర్వ చరిత్రను తెలిపే థిరా మ్యూజియం ద్వీపంలోని ప్రధాన పట్టణంలో ఉంది. ఇది గ్రీస్‌లోని అతి ముఖ్యమైన మ్యూజియంలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి సిఫారసు చేస్తాము. ఇక్కడ అక్రోటీరిలో దొరికిన ఫ్రెస్కోలను కనుగొనవచ్చు. మ్యూజియం వద్ద ఒక అగ్నిపర్వత విస్పోటనచే నాశనం చేయబడిన మినోయన్ నాగరికత మీరు చూడవచ్చు. ఇక్కడ రెండు మ్యూజియంలు ఒకదాని ఎదుట ఒకటి ఉన్నాయి. మరొకటి ఆర్కియాలజికల్ మ్యూజియం. చరిత్రపూర్వ థిరా యొక్క మ్యూజియంలోని ఫ్రెస్కోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇది నాగరికత యొక్క ఆడంబరం గురించి మీకు ఒక ఆలోచన అందిస్తుంది. మీరు చరిత్రా ప్రేమికుడు అయితే శాంటోరిని సందర్శనలో దీన్ని తప్పక చూడాలి.

7. కాల్డెరాలో పడవ ప్రయాణం – శాంటోరినిలో అత్యంత సిఫార్సు చేయబడిన విషయాలు:

 

పర్యాటకులకు ప్రముఖ గమ్యస్థానాలలో ఒకటిగా ఉండడంతో శాంటోరినిలో పర్యాటక రంగం అనేక కొత్త అంశాలను జోడిస్తోంది. గ్రీస్ సెలవులో కొద్దిగా విలాసవంతమైన అనుభవం పొందాలని కోరుకునే ఎవరైనా సరే, వారు ఖచ్చితంగా కాల్డెరా పడవ ప్రయాణం చేయాలి. మంచి ఆహారాన్ని, పానీయాలను మాత్రమే కాదు.. ఈత కొట్టి మరీ శాంటోరిని అద్భుతమైన అందాన్ని ఆనందించవచ్చు. ఇక్కడ దాదాపు అన్ని ప్రధాన ప్రదేశాలను క్రూయిజ్ కవర్ చేస్తుంది. రెడ్ బీచ్‌లు, బ్లాక్ బీచ్‌లు, మెసా వోనో మరియు హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. మీరు శాంటోరిని అందాన్ని సముద్ర మట్టం నుండి ఆనందించవచ్చు. మీరు కాల్డెరాకు ఎదురుగా ఒక రొమాంటిక్ డిన్నర్ చేయవచ్చు.

8. శాంటోరిని యొక్క హాట్ స్ప్రింగ్స్ లో ఈత:

 

అగ్నిపర్వత విస్ఫోటనాలలో ఒకదాని నుండి ఏర్పడిన నియా కమెని యొక్క వేడి నీటి బుగ్గలు సంవత్సరం పొడవునా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అగ్నిపర్వత విస్ఫోటం ద్వారా ఏర్పడిన నియా కమెని వద్ద ఉన్న నీరు.. సాంద్రంగా మరియు వెచ్చగా ఉంటుంది. నీటిలో ఇనుము మరియు మాంగనీస్ మూలకాలు.. రోగాలను నయం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయి. అలసటతో కూడిన రోజు గడిపిన తర్వాత మీరు ఇక్కడకు చేరుకోవడం సిఫారసు చేయబడుతుంది. మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కోసం వెచ్చని నీటిలో స్నానం చేయవచ్చు. నియా కమెనీ థర్మల్ స్ప్రింగ్స్‌ను ఖచ్చితంగా తప్పక ప్రయత్నించాలి.

9. ఓపెన్-ఎయిర్ థియేటర్‌లో ఒక మూవీ:

ఓపెన్ థియేటర్ భావన ఈ రోజుల్లో చాలా సాధారణం అయినా అయినప్పటికీ, శాంటోరిని అద్భుతమైన వాతావరణంతో ఒక మూవీని ఆస్వాదించడం ఊహించుకోండి. దీన్ని అద్భుతమైన సాయంత్రం అని చెప్పవచ్చు. ద్వీపంలోని దక్షిణ భాగంలో ఉన్న కమారీ గ్రామంలో ఉన్న థియేటర్.. ప్రపంచంలోని ఉత్తమ ఓపెన్-ఎయిర్ థియేటర్లలో ఒకటి. ఇక్కడ మీరు అద్భుతమైన కాక్‌టెయిల్స్‌ మరియు పాప్‌కార్న్‌ను ఆస్వాదించవచ్చు.

10. అక్రోటిరి లైట్‌హౌస్ నుండి అద్భుతమైన దృశ్య వీక్షణం:

 

ప్రశాంతమైన గ్రామం అక్రోటిరిలో మీరు ప్రసిద్ధమైన లైట్‌హౌస్‌ను చూడవచ్చు. ద్వీపం యొక్క నైరుతీ భాగంలో ఉన్న ఈ లైట్‌హౌస్.. గ్రీస్‌లోని అతి పురాతన వాటిలో ఒకటి. నిజానికి సందర్శకులకు ఆకర్షణ లైట్‌హస్ కాదు.. ఇక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యం. లైట్‌హౌస్ నుండి కనిపించే దృశ్యం ఆకట్టుకుంటుంది. వైన్ బాటిల్ చేతిలో పట్టుకుని అందమైన సూర్యాస్తమయం చూడటానికి ఇది అద్భుతమైన ప్రదేశం.

శాంటోరిని యొక్క అందాన్ని మాటలలో వివరించడం సాధ్యం కాదు. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ఎన్నో అందాలు ఇక్కడ ఉన్నాయి. ఇది పర్యాటకుల హడావిడి నుంచి దూరంగా ఉంచేందుకు సహకరిస్తుంది. ఇక్కడ కనిపించే ప్రతి అంశాన్ని ఫోటోలు తీసేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అంత అందగా ప్రతి దృశ్యం కనిపిస్తుంది. అంతే కాదు.. ఇంతటి అందాన్ని మరెక్కడా చూడలేరని అనిపిస్తుంది.

ఇంకా ఎందుకోసం ఎదురుచూస్తున్నారు? శాంటోరినిలో చేయదగిన అంశాలపై సుదీర్ఘ జాబితా మీకు అందించాము. ఇప్పుడే మీ గ్రీస్ పర్యటన ప్యాకేజీని బుక్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *