Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

ఐరోపాలో ప్రయాణం చేయడానికి చవకైన ఉత్తమ ప్రాంతాలు

విదేశాలలో మీ మొదటి పర్యటన గురించి కలలు కంటూ ఉంటే, యూరోప్ ట్రిప్‌లో మీకోసం ఎన్నో ఎదురుచూస్తున్నాయి. యూరప్ టూర్ అంటే కచ్చితంగా ఖరీదైన వ్యవహారం అని మీరు అనుకుంటూ ఉండచ్చు. మీకు ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాం. మీ జేబుకు భారం కాకుండానే.. ఉత్కంఠభరితంగా అందమైన మరియు స్నేహపూర్వకమైన ప్రయాణాన్ని యూరోప్ మీకు అందించగలదు. మీ ఆస్తులను అమ్మేసుకోవాల్సిన స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని కచ్చితంగా చెబుతున్నాం. ఐరోపాలో ప్రయాణించడానికి ఉత్తమమైన కొన్ని చౌక స్థలాలను ఎంపిక చేసి కింద జాబితాలో ఇవ్వబడినవి:

1. బెర్లిన్‌లో సంస్కృతి అనుభవం పొందండి:

ఐరోపాలో ఉన్న జర్మనీ రాజధాని బెర్లిన్‌ అంటే.. అత్యంత సంతోషకరమైన సాంస్కృతిక గమ్యస్థానం. సృజనాత్మకత, ప్రకాశవంతమైన గ్యాలరీలు, మ్యూజియంలు, సంగీతం, కళ వంటి ఎన్నిటినో అనుభూతి చెంచవచ్చు. అద్భుతమైన సాంప్రదాయ రుచికర ఆహారం సరసమైన ధరలకే లభిస్తుంది. ఇప్పటికే మీ సంచులను ప్యాక్ చేసుకున్నారా, అయితే బయల్దేరండి!

2. ప్రేగ్‌లో దైవం బీర్:

ప్రేగ్ ఎంతో అందంగా ఉంది, మీరు కలలు కంటున్న.. నివసించాలని తపన పడుతున్న ప్రాంతం మాదిరిగా ఉంటుంది. చీకటి వారసత్వం, స్థితిస్థాపకంగా గడిపిన మనోజ్ఞతలను ఇది కలిగి ఉంటుంది. ప్రేగ్ లో దేవుడు బీర్. ప్రపంచంలోనే ఉత్తమమైన బీర్ ఇక్కడ లభిస్తుంది. అంతేకాకుండా, ఐరోపాలో ప్రేగ్ రెండవ ఉత్తమమైన చవకైన గమ్యస్థానం.

3. అన్ని రకాల లావాదేవీల కేంద్రం – ఇస్తాంబుల్:

సందర్శకులను ఆకర్షించే అనే రకాలు ఇస్తాంబుల్‌లో సిద్ధంగా ఉంటాయి. చవకైనస మరియు ఆహారం సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇస్తాంబుల్‌లో మీ బసను పొడిగించకుండా ఉండలేరు. ప్రపంచంలోని అత్యంత అందమైన ఆకాశహర్మ్యం ఇక్కడే ఉంది.

4. నైట్ కింగ్ – క్రాకోవ్, పోలాండ్:

క్రొకవ్ లో పార్టీ మీలోని అసలైన వ్యక్తి కోసమే! అతి సమీపంలోనే అనేక ప్రసిద్ధ పబ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్రత్యక్ష-సంగీతం మరియు వోడ్కా ప్రవాహం విపరీతంగా ఉంటుంది. క్రాకోవ్ లో వసతి , ఆహారం మరియు మద్యం అన్నీ చవక మాత్రమే కాదు.. టూరిస్టుల కోసం ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

5. చెక్ రిపబ్లిక్: రొమాంటిక్ మూడ్:

చెక్ రిపబ్లిక్లో సౌందర్యాన్ని కలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి. క్లాసిక్ అద్భుత కోటలు, చారిత్రాత్మక స్పా పట్టణాలు, రెస్టారెంట్లు మరియు విస్తృత నదులు, ఈ యూరోపియన్ దేశం మీలో శృంగార భావాలను రెట్టింపు చేస్తుంది. మీ ప్రియమైనవారికి నచ్చడమే కాదు.. మీ జేబుకు ఏ మాత్రం కష్టం కలిగించదు.

6. సన్షైన్ – టెనెరిఫే, కానరీ ద్వీపాలు:

ఐరోపాలోని దేశాలు చలికాలంలో చలితో పోరాడుతున్నా, కానరీ ద్వీపాలు ఏడాది పొడుగునా వెచ్చని ఉష్ణోగ్రతలతో ఉంటాయి. టెనెరిఫే అద్భుతమైన ద్వీపములు, టెనెరిఫే ఆర్ట్స్ స్పేస్, అకంటిలాడోస్ డి లాస్ గిగాంటెస్ మరియు పార్క్ నాచురల్ డెల్ టెయిడ్లతో అన్ని దీవులకు ఉత్తమ విలువ ఉంటుంది. ఈ ద్వీపాలు ఎల్లప్పుడూ అన్నీ కలిసిన ఒప్పందాలతో బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఉంటాయి. ప్రయాణించడానికి ఇటువంటి అద్భుతమైన చౌక స్థలం మరెక్కడా ఉండదు.

7. అడవి – టాట్రా పర్వతాలు, స్లొవేకియా దర్శనం:

గోధుమ రంగులో ఎలుగుబంట్లు చూడడానికి.. టాట్రా పర్వతాలు, కార్పాతియన్ పర్వత శ్రేణి ప్రపంచంలో అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటి. గ్రానైట్ శిఖరాలు, హిమానీనదాల మరియు పచ్చిక మైదానాల మనోహరమైన ప్రకృతి దృశ్యాల మధ్య, మీరు ఒక తోడేలు, లింక్స్, అడవి పంది మరియు బంగారు గద్దలను చూడవచ్చు. టాట్రా పర్వతాలకు చౌక విమానాలు అందుబాటులో ఉన్నాయి.

8. స్కీయింగ్ మీకు ఇష్టమా! – బల్గేరియా:

బల్గేరియా యూరోప్ యొక్క స్కీయింగ్ గమ్యస్థానాలకు ప్రసిద్ధి చెందింది. ప్రారంభకులకు మరియు నిపుణులకు కూడా తగిన స్కీయింగ్ అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ, మీరు ఖరీదు తక్కువ ధరలలో ఆహారం మరియు బీర్ లు అందుబాటులో ఉంటాయి.

9. ఉత్సాహం రెట్టింపు చేసే ప్రాంతాలు – ట్రాన్సిల్వానియా, రొమేనియా:

ట్రాన్సిల్వేనియా బహుళ కార్యకలాపాలు కోసం ఒక బడ్జెట్ గమ్యస్థానం. హైకింగ్, గుర్రపు స్వారీ, రాక్ క్లైంబింగ్, నది-రాఫ్టింగ్ మరియు అడవిలో క్యాంపుల కోసం ఆనందకరమైన వేదికగా ఉన్న అనేక పర్వత శ్రేణులలో ట్రాన్సిల్వేనియా ఆల్ప్స్ ఒకటి. ట్రాన్సిల్వేనియా మరియు బడ్జెట్ హోటళ్ళకు బడ్జెట్ విమానాలు అందుబాటులో ఉన్నాయి.

10. మసాజ్ మేజిక్ – బుడాపెస్ట్:

బుడాపెస్ట్ అనేక మంచి విలువ స్పాలు కలిగి ఉంది. మీరు లగ్జరీ అనుభవాలను పక్కన పెట్టి, పురాతన స్నానపు గృహాలకు ఎంపిక చేసుకోవచ్చు. ఇవి సాంస్కృతిక అనుభవం. బుడాపెస్ట్ ప్రపంచంలోని చౌకైన సెలవుదినంగా చెప్పబడుతుంది; ఇది అన్ని అంశాలలో సరసమైనది.

ఐరోపా పవిత్రతతో మీరు మంత్రముగ్ధులు కావచ్చు. అది కూడా అతి తక్కువ ఖర్చుతోనే. ఇది కల కాదు.. నిజంగా నిజం. అంతే కాదు. ఐరోపా హాలిడే ప్యాకేజీల ద్వారా ఐరోపా మేజిక్ లైవ్ అనే మీ కలను నిజం చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా.. తక్కువ బడ్జెట్లోనే అంటే ఆశ్చర్యంగా లేదూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *