Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

పాస్‌పోర్ట్‌లు 4 రంగుల్లోనే ఎందుకుంటాయో తెలుసా?

పాస్‌పోర్ట్ ఇప్పుడు చాలా మంది చెంత ఉంటోంది. అయితే.. అదే రూపం, రంగులో ఎందుకు ఉంటోందని ఎప్పుడైనా ఆలోచించారా? మీ గుర్తింపునకు, జాతీయతకు అధికారిక ధృవీకరణ అయిన పాస్‌పోర్ట్ కేవలం నాలుగు రంగుల్లోనే ఉంటుందని తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అన్ని పాస్‌పోర్ట్‌లు ఉండే ఆ నాలుగు రంగులు ఏవంటే.. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నలుపు. ఈ నాలుగు రంగుల్లోనే పాస్‌పోర్టులు ఎందుకు ఉంటాయో తెలిస్తే మీరు కచ్చితంగా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు.

ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు రంగు, రూపాలపై నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. అయితే ఈ నాలుగు రంగులకు సంబంధించి వివిధ షేడ్స్‌తో ప్రయోగాలు చేసేందుకు ఆయా దేశాలకు స్వేచ్ఛ ఉంది. భౌగోళికం మరియు విధానాల మేరకు కూడా పాస్‌పోర్ట్ రంగులు ఉంటాయి. ఇంటరాక్టివ్ పాస్‌పోర్ట్ డేటాబేస్‌ను అందించే సంస్థ, ఆర్టన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ హ్రంట్ భోగోసియన్ చెప్పిన పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం,, ఆయా దేశాలు పాస్‌పోర్ట్ రంగులను ఎంచుకోవడంలో కొన్ని తార్కికమైన కారణాలు ఉన్నాయి.

1. గ్రీన్ పాస్‌పోర్టులు:

కొన్ని దేశాలలో అత్యధికంగా ఉండే మతస్తుల ప్రకారం పాస్‌పోర్టు రంగు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇస్లాం మతంను అధికంగా ఆచరించే దేశాల్లో గ్రీన్ పాస్‌పోర్టులు కనిపిస్తాయి. మహమ్మద్ ప్రవక్తకు అత్యంత ఇష్టమైన ఆకుపచ్చని రంగులో పాస్‌పోర్టులు దర్శనం ఇస్తాయి. పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలు గ్రీన్ పాస్‌పోర్టులను కలిగి ఉంటాయి. బుర్కినా ఫాసో, ఐవరీ కోస్ట్, సెనెగల్, నైజీరియా, నైగర్ వంటి మరికొన్ని ఆఫ్రికా దేశాలు కూడా గ్రీన్ పాస్‌పోర్టులు కలిగి ఉంటాయి. ఇందుకు కారణం ఈ దేశాలు ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్‌లో సభ్యులు కావడమే.

2. రెడ్ పాస్‌పోర్టులు:

కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ప్రతీకగా ఎరుపు రంగు. హ్రంట్ భొగోసియన్ ప్రకారం కమ్యూనిస్టుల గతం లేదా వర్తమానం అనుసరించి రెడ్ కలర్ పాస్‌పోర్టులు ఉంటాయి. చైనా, సెర్బియా, లాత్వియా, రొమేనియా, జార్జియా, పోలండ్ దేశాలు రెడ్ పాస్‌పోర్టులు కలిగి ఉంటాయి. అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలలో బార్గండీ షేడ్స్‌లో పాస్‌పోర్టులు దర్శనం ఇస్తాయి.

3. బ్లూ పాస్‌పోర్టులు:

ఇండియా, నార్త్ అమెరికా దేశాలతో సహా న్యూ లీగ్ దేశాల్లో నీలం రంగులో పాస్‌పోర్టులు ఉంటాయి. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాలలో కూడా బ్లూ పాస్‌పోర్టులే కనిపిస్తాయి. కరేబియన్ కమ్యూనిటీ సభ్యదేశాల్లో కూడా ఇదే రంగులో పాస్‌పోర్టులు ఉంటాయి, ఇందుకు కారణం ఆయా దేశాలు సముద్రాల మధ్యలో ఉండడం, లేదా తీర ప్రాంతాలలో ఉండడమే.

4. బ్లాక్‌ పాస్‌పోర్టులు:

నలుపు రంగులో పాస్‌పోర్టులు అరుదుగా కనిపిస్తాయి. జాంబియా, బోట్స్‌వానా, బురుంది, గాబోన్, అంగోలా, మలావి, చాడ్ మరియు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలతో పాటు మరికొన్ని దేశాలు బ్లూ పాస్‌పోర్టులను అందిస్తాయి. బ్లాక్ కలర్‌లో పాస్‌పోర్టు ఇచ్చే ప్రముఖ దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. వారి జాతీయ రంగుతో సరిపోల్చేందుకే ఇలా ఉంటుంది.

మీరు ఇతర దేశాలకు హాలిడే టూర్ లేదా వ్యాపారం లేదా విద్య కోసం వెళుతున్నపుడు, ప్రధానమైన ప్రయాణ డాక్యుమెంట్స్‌ గురించి తెలుసుకోవడం మంచిది. పాస్‌పోర్ట్, వీసా, ఇన్సూరెన్స్ వంటి వాటి గురించి తెలుసుకోవడం ఎంతో సహాకరంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *