Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

జంటలకు స్వర్గాన్ని దరికి చేర్చే 7 రొమాంటిక్ స్పాలు

మీ జీవిత భాగస్వామితో అనుబంధం కాస్త వెనుకబడిందనే భావన మీకు కలుగుతోందా? మీరు ఈ విషయంలో ఏమైనా చింతిస్తుంటే.. మరీ ఎక్కువగా బాధ పడిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో చాలామందే ఉంటారు. మనకు అవసరమైన సమయాన్ని అందించి, మనుసులను ఓలలాండిచే కొన్ని పట్టణాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మళఅలీ వెనక్కు తెచ్చుకునేందుకు సులువైన చిట్కా ఉంది. స్పా సందర్శనకు మించిన ఉత్తమమైన మార్గం మరేముంటుంది చెప్పండి. ముందుగా ఏర్పాటు చేసుకోగలిగితే మీరు, మీ పార్ట్‌నర్ ఓ అద్భుతమైన అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరు రిలాక్స్ అవడమే కాదు, మరింత ఉత్తేజం పొంది మీ అనుబంధానికి, ప్రేమకు కొత్తదనాన్ని అందించగల సత్తా ఉన్న స్పాలు కొన్ని ఉన్నాయి.

1. అమన్‌వానా రిసార్ట్, కూర్గ్:

పరుగులు పెట్టే నగర జీవితానికి దూరంగా ఉన్న అమన్‌వానా రిసార్ట్‌లో గల అద్భుతమైన సౌందర్యం, మీ మనసును ప్రశాంతపరుస్తుంది. కావేరీ నదీ జలాల నుంచి వినిపిస్తున్న వినసొంపైన శబ్దాల మధ్య మీ భాగస్వామితో ఎంతో ఆనందంగా గడపవచ్చు. మీకే ప్రత్యేకించిన ప్రైవేట్ ప్రాంతంలో సూర్యుడి సౌందర్యాన్నే కాదు, నక్షత్రాల అద్భుతాలను ఆస్వాదించవచ్చు. అమన్‌వానాలో ఉన్న బంగ్లాలను చూసి ఆనందించడమే కాదు, ఇక్కడ ఉన్న లగ్జరీ స్పాను కాదనుకోవడం చాలా కష్టం సుమా?

2. కుమారకోం లేక్ రిసార్ట్, కేరళ:

కేరళ రాష్ట్ర సంస్కృతీ, కళాకృతుల సరైన మిశ్రమం కుమారకోం రిసార్ట్. 16వ శతాబ్దానికి చెందిన సాంప్రదాయ నిర్మాణాలు అయిన మనస్‌ను ఈ రిసార్ట్‌లో పునర్‌నిర్మించారు. ప్రైవేట్ పూల్స్, లగ్జరీ పెవిలియన్ రూమ్స్‌తో కూడిన ప్రెసిడెన్షియల్ సూట్స్, హెరిటేజ్ లేక్ విల్లాలలో మీ ప్రియమైన వ్యక్తులతో గడపడం అద్భుతమైన అనుభవం. మరే రిసార్ట్‌లోను లభించనటువంటి ఆయుర్వేద పద్ధతులు, ప్యాకేజీలతో నూతనమైన అనుభూతిని ఈ స్పా అందిస్తుంది. వీటి ద్వారా మీ శరీర భాగాలకు పలు చికిత్సలు అందుతాయి. కేరళలోని బ్యాక్‌వాటర్స్‌ను ఎంజాయ్ చేయడమే కాదు.. అక్కడి స్పాలలో లభించే రొమాంటిక్ అనుభూతులను ఆస్వాదించండి.

3. లె పాండీ రిసార్ట్, పాండిచ్చేరి(తమిళనాడు):

కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఉన్న లె పాండీ రిసార్ట్‌.. సుందరమైన ఫ్రెంచ్ పుష్పాలతో నిండి ఉంటుంది. చున్నాంబర్ నది, బంగాళాఖాతం మధ్యలో ఉన్న లెపాండీలో.. పాండిచ్చెరి నిజమైన అందాలను అనుభవించవచ్చు. లేక్ వ్యూతో స్పా సౌకర్యాన్ని అందించడం ఇక్కడి ప్రత్యేకత. మీ రొమాన్స్‌కు ఇది అదనపు ఆకర్షణ అవుతుంది.

4. పార్క్ హయత్ రిసార్ట్ అండ్ స్పా, గోవా:

గోవాలోని పార్క్ హయత్ రిసార్ట్‌లో ఉంటే మీ ఆలోచనలకు లగ్జరీలను అందిచవచ్చు. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆనందానుభూతులను అందించే స్వర్గధామం ఇది. గోవాలో ఉన్న ఉత్తమమైన 5 స్టార్ హోటల్స్‌‍లో పార్క్ హయత్ కూడా ఒకటి. మీ జీవిత భాగస్వామితో కలిసి లగ్జరీ కలగలిసిన, సుందరమైన సెరెనో స్పాలో సేద తీరవచ్చు. గోవా టూర్‌లో ది పార్క్ హయత్ రిసార్ట్ తప్పనిసరిగా విజిట్ చేయాల్సిందే.

5. ట్రీ ఆఫ్ లైఫ్ రిసార్ట్ & స్పా, జైపూర్:

జైపూర్ నగర రణగొణ ధ్వనులకు దూరంగా ఉన్న ట్రీ ఆఫ్ లైఫ్ రిసార్ట్ అండ్ స్పా, బెస్ట్ బొటిక్ రిసార్ట్‌లలో ఒకటి. మీరు ఆశిస్తున్న ప్రశాంతతను తప్పనిసరిగా అందించగల సమర్ధత దీని సొంతం. పాత ఆరావళి పర్వతాల మధ్య ఉండడంతో, అటు విశ్రాంతితో పాటు ఇటు అందాలను కూడా ఆస్వాదించవచ్చు. ఈ రిసార్ట్‌లో 13 లగ్జరీ విల్లాలు ఉంటాయి. ఇక్కడ గల ఏకమ్-కపుల్ స్పాలో సేద తీరితే ప్రాపంచిక బాధల నుంచి దూరమైన భావన తప్పనిసరిగా కలుగుతుంది. రాజస్థాన్‌లోని అత్యంత సుందరమైన అంశాల్లో ఇది కూడా ఒకటి.

6. ది ఖైబర్ హిమాలయన్ రిసార్ట్ & స్పా, గుల్‌మార్గ్ (కశ్మీర్):

భూతల స్వర్గం అంటే అచ్చంగా ఇలాగే ఉంటుంది అనిపించే ప్రాంతం ఇది. మీరు అసలు మిస్ చేసుకోకూడని అద్భుతమైన జంటల స్వర్గం. కశ్మీర్‌కు చెందిన సుందరమైన జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ప్రపంచస్థాయి రిసార్ట్‌గా ఖైబర్ హిమాలయన్ రిసార్ట్‌కు గుర్తింపు ఉంది. దేశం మొత్తంలో మీకు అత్యంత లగ్జరీ అనుభూతులను అందించగల స్పాలలో ఖైబర్ స్పా కూడా ఒకటి. ఇక్కడ ప్రియమైన వ్యక్తితో ఒకసారి గడిపితే, అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు మనస్కరించదు!

7. టైగర్ హెవెన్ రిసార్ట్, రణథంబోర్:

రణథంబోర్ నేషనల్ పార్క్‌ అంచున టైగర్ హెవెన్ రిసార్ట్ మరియు స్పా ఉంటుంది. ఇక్కడ కేవలం ఆతిథ్యం మాత్రమే కాదు, ఓ అద్భుతమైన అనుభవం చిక్కుతుంది. రాజ్‌పుత్, రాజస్థానీ నిర్మాణ శైలితో కనిపించే నిర్మాణాలు మిమ్ములను అసలు ఊపిరి తీసుకోనివవ్వవు. పురాతన నిర్మాణాల మధ్య లగ్జరీ, డైనింగ్, లాంజ్‌లను అందించే టైగర్ హెవెన్ స్పా అద్భుతమైన అనుభవం. రాజస్థాన్‌ టూరిజంకే తలమానికగా ఉన్న ఈ రిసార్ట్ అండ్ స్పా, ప్రతీ జంటకు స్వర్గం లాంటి ఆనందాన్ని పంచుతుంది.

ఈ 7 రొమాంటిక్ స్పాలలో ఓ చిన్నపాటి వెకేషన్ ప్లాన్ చేసుకున్నా.. ఎంతగానో ఎంజాయ్ చేయవచ్చు. మీ ప్రియమైన వ్యక్తితో మళ్లీ మళ్లీ ప్రేమలో పడేసేంతటి అందం, అనుభవాలను ఇవి అందిస్తాయి. ఇలాంటి వాటి గురించి చాలామంది కేవలం కలలు మాత్రమే కంటారు, కానీ మీరు వాటిని నిజంగానే ఆస్వాదించగలరు. ఇంకెందుకు ఎదురుచూస్తున్నారు? మీ సామాగ్రిని ప్యాక్ చేసుకుని, మీకు నచ్చిన వ్యక్తితో ఆనందం అనుభవించేందుకు బయల్దేరవచ్చు కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *