Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

ముంబైలో స్ట్రీట్ షాపింగ్ కోసం ఉత్తమ స్థలాలు

ముంబై గురించి ఆలోచించడం మొదలుపెడితే గ్లామర్, బాలీవుడ్ వంటి ఎన్నో మనసులోకి వచ్చేస్తాయి. మహారాష్ట్ర రాజధాని నగరమైన ముంబైలోని భారతదేశ గ్లామర్ పరిశ్రమకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఈ మెట్రోపాలిటన్ నగరంలో సందడిగా ఉండే వీధులలో రోడ్డు పక్కన దుకాణాలలో షాపింగ్ అనుభూతి అనిర్వచనీయం. పలు ఉత్పత్తులను విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. మీరు ముంబైలో షాపింగ్ చేయడానికి ఈ ప్రసిద్ధ స్థలాలను సందర్శించకపోతే.. మీ పర్యటన అసంపూర్ణంగానే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా షాపింగ్‌ని అనుభవించండి. పారిస్ తరువాత ముంబైను ఫ్యాషన్‌కు రెండవ రాజధానిగా పరిగణిస్తారని గుర్తుంచుకోండి.

భారతదేశానికి హాలిడే యాత్రను ఎవరైనా ప్రణాళిక చేసుకుంటే ముంబై ఖచ్చితంగా హాట్ స్పాట్లలో ఒకటి. మీ ఇంటిని అలంకరించే ఉపకరణాల నుంచి ముంబై స్ట్రీట్ షాపింగ్‌లో అనేక వస్తువులు లభిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక షాపింగ్ స్వర్గం. ఈ ప్రదేశాలలో షాపింగ్ చేయడం మనసుకు ఆహ్లాదం కలిగించే అనుభవం అనడంలో సందేహం లేదు. ముంబైలోని అత్యంత ప్రసిద్ది చెందిన మార్కెట్ల నుంచి షాపింగ్ చేసేవారు శ్రద్ధగా బేరం చేయాల్సిందే. విసిగించాల్సిందే. మీ జీవితాంతం గుర్తిండిపోయేలా, మనస్సును హత్తుకునే అనుభూతిని పొందుతారు. అనేక ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాక చవగా డీల్స్ లభిస్తున్నాయి. మరోవైపు సూపర్‌మార్కెట్లలో షాపింగ్ సులభంగా సౌకర్యవంతంగా మారింది. కానీ ఇప్పటికీ ఈ పాత స్ట్రీట్ మార్కెట్లకు ఆకర్షణ కొనసాగుతూనే ఉంది.

కలల నగరం ముంబైలో సందర్శించేటపుడు కింది మార్కెట్లు సందర్శించండి మరియు షాపింగ్ అనుభూతిని ఆస్వాదించండి:

1. చోర్ బజార్:

1. Chor Bazaar

ప్రపంచంలోని ప్రసిద్ధ మార్కెట్లు ఏవీ “దొంగల మార్కెట్”గా పేరుపొందలేదు, కానీ ముంబైలో చోర్ మార్కెట్ మాత్రం ఈ గుర్తింపును పొందింది. నగరంలో ఉన్న చోర్ బజార్ ప్రేమికుల స్వర్గం. పేరు మాదిరిగానే ఇక్కడ విక్రయించే వస్తువులు ప్రత్యేకమైనవి. మీరు బేరం బాగా చేయగలిగితే, ఈ మార్కెట్‌లో అనేక హస్తకళా వస్తువులను ఇంటికి తీసుకువెళ్లేందుకు అద్భుతమైన ప్రదేశం. మీరు మీ ముంబై పర్యటనకు గుర్తుగా ఎన్నో వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు.

ప్రాంతం: మటన్ స్టాండ్, కుంబర్వాడ

2. జవేరి బజార్:

పేరు మాదిరిగానే ఇక్కడ ఉన్న దుకాణాలలో చాలానే వెలుగులు ఉంటాయి. మీరు ఆభరణాల కోసం చూస్తుంటే, అపుడు మీ సందర్శన ప్రాంతాలలో జవేరి బజార్ ఉండాల్సిందే. వెండి, బంగారం మరియు వజ్రాల ఆభరణాలు లేదా చవకైన వస్త్రాలు వంటివి అన్నీ ఈ మార్కెట్లో లభిస్తాయి. భారీగా అలంకరించిన నగల ప్రదర్శనను మీరు చూడవచ్చు. టీబీజెడ్ , తనిష్క్ వంటి బ్రాండ్ దుకాణాలు ఇక్కడ తమ దుకాణాలను ఏర్పాటు చేశాయి. ఏ సందర్భంలోనైనా మీరు ఆభరణాల కొనుగోలు చేయాలనుకుంటే, ముంబైలో షాపింగ్ కోసం జవేరి బజార్ మీ కోసమే.

ప్రాంతం: షేక్ మీనన్ సెయింట్, లోహార్ చాల్, కల్బదేవి

3. ఫ్యాషన్ స్ట్రీట్:

పాశ్చాత్య నుండి సాంప్రదాయ దుస్తులు.. చొక్కాల నుంచి టి-షర్టులు.. పిల్లల కోసం బట్టలు, మీకు ఏది అవసరం అయినా వాటిని ముంబైలోని ఫ్యాషన్ స్ట్రీట్‌లో వాటిని చూడవచ్చు. ముంబై వాసుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ స్ట్రీట్.. అత్యంత అనుకూలమైన ధరల్లోనే షాపింగ్ చేయటానికి అనువైన ప్రదేశం. మీకు బ్రాండ్లపై మోజు లేకుంటే, ముంబైలో ఫ్యాషన్ స్ట్రీట్‌ను సందర్శించాలి. ఫ్యాషన్ స్ట్రీట్ ముంబైలో బడ్జెట్ షాపింగ్ యొక్క ఉత్తమ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

ప్రాంతం: మహాత్మా గాంధీ రోడ్, మెరైన్ లైన్స్

4. లింకింగ్ రోడ్:

బాంద్రాలో ఉన్న లింకింగ్ రోడ్ బేరసారాలను ఇష్టపడే షాపిగ్ ప్రియులకు కేంద్రం. బేరాలు ఇక్కడ కూడా ఉంటాయి కానీ.. మీరు లింకింగ్ రోడ్ వద్ద సరసమైన ధరలలో ట్రెండీగా ఉన్న ఫ్యాషన్ వస్తువులను వెతుక్కోవచ్చు. తాజా దుస్తులు, బూట్లు, ఉపకరణాలు నుండి లింకింగ్ రోడ్ అన్నింటినీ కలిగి ఉంది. చిల్లర దుకాణాల నుండి రోడ్లు పక్కన ఉన్న స్టాల్స్ వరకు లింకింగ్ రోడ్డు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. మీరు షాపింగ్ చేసి అలసిపోతే స్పా లేదా కేఫ్ లేదా రెస్టారెంట్లలో విశ్రాంతి తీసుకోవచ్చు. ముంబైలో షాపింగ్ పూర్తి కావాలంటే ప్రతి షాపింగ్ ప్రియులకి లింకింగ్ రోడ్ సందర్శన తప్పనిసరి.

ప్రాంతం: ఆర్.డి. నేషనల్ కాలేజ్‌కు సరిగ్గా ఎదురుగా, బాద్రా వెస్ట్

5. కొలాబా కాజ్‌వే:

కోలాబా కాజ్‌వే ఫాషన్ మరియు ఆహార ప్రియులకు స్వర్గం. హ్యాండీక్రాఫ్ట్స్‌, పుస్తకాలు, బట్టలు, పాదరక్షలు, ఉపకరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ స్ట్రీట్ మార్కెట్ అందరికీ ఆనందం పంచుతుంది. బ్యాగులు, పర్సులు, బూట్లు, కళాఖండాలతో పాటు ఈ వీధి దుకాణాలలో బోహేమియన్ స్టైల్ దుస్తులు, కోల్డ్ షోల్డర్ టాప్స్ వంటివి మీరు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. మీరు బేరసారాలతో అలసిలపోతే అప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించండి. మీరు మీ షాపింగ్ తర్వాత కూర్చుని విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, మీరు ప్రముఖ లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్ళవచ్చు.

ప్రాంతం: షాహిద్ భగత్ సింగ్ రోడ్, కొలాబా కాజ్‌వే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *