Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం 6 ఉత్తమ స్థలాలు

డైవింగ్ ఔత్సాహికులకు అండమాన్‌లో స్నార్కెలింగ్ చేయడం ఎంతో అనుకూలం. అందుకే అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం ఉత్తమ స్థలాల గురించి తెలుసుకోవడానికి చదవండి.

నోటిలో ప్లాస్టిక్‌ ట్యూబ్‌తో, చేపల సమాజంలో నీటి అడుగున తిరుగాడాలంటే.. అప్పుడు అండమాన్ దీవులు మీ గమ్యస్థానం. బంగాళాఖాతంలో ఉన్న ఈ చిన్న దీవుల ప్రపంచంలో అత్యంత ప్రియమైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ అండమాన్‌లో బీచ్‌లు మాత్రమే అసలైన ఆకర్షణ కాదు. అక్కడ సహజమైన జలాల కింద, నిజమైన మరో ప్రపంచం ఉంది. అద్భుతమైన పగడాలు, జలచరాలు విభిన్న సమూహాలు, ఈ సముద్ర ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అందుకే డైవింగ్ ఔత్సాహికులకు అండమాన్‌లో స్నార్కెలింగ్ చేయడం ఎంతో అనుకూలం. అందుకే అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం ఉత్తమ స్థలాల గురించి తెలుసుకోవడానికి చదవండి.

1. ఎలిఫెంట్ బీచ్, హావ్లోక్ ద్వీపం :

అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం ఉత్తమ స్థలాలలో ఒకటి ఎలిఫెంట్ బీచ్ (హేవ్‌లాక్ ఐలాండ్)

స్నార్కెలింగ్ కోసం అండమాన్‌లో ఉన్న దీవులలో హేవ్‌లాక్ ద్వీపం ఒకటి. ఇక్కడ అనేక బీచ్‌లతో పాటు కొన్ని అద్భుతమైన స్నార్కెలింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో చీఫ్ ఎలిఫెంట్ బీచ్‌ ఒకటి. మీరు ఆనందంగా గడిపేందుకు అనేక అవకాశాలు ఉండడంతోనే.. దీన్ని ఎలిఫెంట్ బీచ్ అంటారు. కానీ ఎలిఫెంట్ బీచ్ వద్ద ప్రధాన ఆకర్షణ స్నార్కెలింగ్. ఇక్కడ స్నార్కెలింగ్ ఔత్సాహికులకు ఉత్తమమైనది. ఇక్కడ నీరు చాలా తక్కువ లోతులోనే ఉంటుంది. 1 మీటర్ లోతు కంటే నీటి లోతు తక్కువ. అయినా సరే సముద్ర జీవితం అద్భుతాలు తప్ప మరేమీ కనిపించవు.

2. దక్షిణ బటన్:

అండమాన్‌లో స్నార్కెలింగ్‌కు ఉత్తమమైన ప్రదేశాలలో సౌత్ బటన్ ఒకటిగా పరిగణిస్తారు. అండమాన్ పర్యాటకం మొత్తం స్నార్కెల్ ప్రియులకు స్వర్గం. ఇది హవేలోక్ నుండి పడవ ప్రయాణ ద్వారా రెండు గంటల దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. అన్ని ఖర్చులు కలుపుకొని రూ. 4000కు స్నార్కెలింగ్ సఫారీ ప్యాకేజీలు సౌత్ బటన్ వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ పగడాలు ఒకింత లోతులో కనిపిస్తాయి.

3. టామరిండ్ క్యాంప్:

స్నార్కెలింగ్ ఔత్సాహికులకు మరొక ఇష్టమైన ప్రాంతం హెన్రీ లారెన్స్ బీచ్ దగ్గర ఉన్న టామరిండ్ క్యాంప్. టామరిండ్ క్యాంప్ దగ్గర అందంగా తీర్చిదిద్దిన పగడాలు, చేపలు, పైపులు, గుల్లలు మరియు క్లామ్స్ వంటి జీవజాలం ఉంటుంది. అనేక చేపలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సముద్ర జీవితం ఒక అద్భుతమైన ఆకర్షణను అందిస్తుంది.

4. నీల్ ఐలాండ్:

జన సమూహం నుంచి దూరంగా ఉంటూ.. రొటీన్‌కు భిన్నంగా పర్యటించాలని అనుకుంటే.. అప్పుడు నీల్ ఐలాండ్‌లో స్నార్కెలింగ్ చేయడం సరైన ప్రదేశం. ఇక్కడ అనేక పేరులేని బీచ్‌లు ఉన్నాయి. మీరు అనేక స్వంత బీచ్‌లను అన్వేషించిన ఆనందం పొందుతారు. ఇక్కడ స్నార్కెలింగ్ చేయడం కోసం కొంత ముందస్తు అనుభవంతో పాటు మంచి స్విమ్మింగ్ నైపుణ్యాలు కూడా అవసరం. అవి ఉంటే అనేక తీరం నుంచి దూరంగా ఉన్న ఆకర్షణీయమైన లోతైన ప్రాంతాలను దర్శించవచ్చు. మీరు అక్కడకు చేరుకున్నప్పుడు, కంటికి ఇంపైన దృశ్యాలు మీకు కనిపిస్తాయి. చీకటి సొరంగాలు, నీటిలో చెక్కబడిన గుహలు, జంతువులు మరియు షిమ్మరి స్కూల్స్‌ మనల్ని ఆకర్షించాయి. అండమాన్‌లో స్నార్కెలింగ్ కొరకు నీల్ ఐలాండ్ కూడా ఒకటి.

5. కాలీపూర్, ఉత్తర అండమాన్:

అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం ఉత్తమ ప్రదేశాలలో కాలిపూర్ ఒకటి. ఇది ఉత్తర అండమాన్‌లో ఉన్న ఒక అద్భుతమైన గ్రామం. వైవిధ్యభరితమైన రంగు పగడపు దిబ్బలను ఇక్కడి నీరు కలిగి ఉంది. మీరు అదృష్టవంతులైతే, సముద్రపు తాబేలు లేదా ఆక్టోపస్‌లను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇతర జంతువులలో జెయింట్ పారట్ ఫిష్, సముద్ర పాములు మరియు స్టింగ్‌రేలు ఉన్నాయి.

6. నార్త్ బే ఐలాండ్, పోర్ట్ బ్లెయిర్:

పోర్ట్ బ్లెయిర్కు చాలా దగ్గరగా ఉండడంతో.. నార్త్ బే ఐలాండ్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ పగడాలు చాలా అందంగా ఉంటాయి మరియు పెద్ద విస్తీర్ణంలో విస్తరించాయి. సముద్రపు జీవనంలో, మీరు లోతుకు వెళ్లినప్పుడు కొన్ని ఎండ్రకాయలు మరియు క్లామ్స్‌లను గుర్తించవచ్చు.

అండమాన్ చాలా ఆకర్షణీయ ప్రదేశం. ప్రతి అండమాన్ బీచ్ ఒక మరపురాని స్నార్కెలింగ్ అనుభవం అందించడమే కాదు.. గొప్ప ఆకర్షణా సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అండమాన్ హాలీడే ప్యాకేజీల నుంచి మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి. మీ స్విమ్‌వేర్‌ను సిద్ధం చేసుకుని.. అండమాన్‌లో స్నార్కెలింగ్ చేస్తూ సముద్ర లోతులను అన్వేషించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *