Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

రంగుల పండుగకు ఇండియాలో బెస్ట్ ఈ 10 ప్రదేశాలు

భారతదేశ ప్రజలు హోలీ పండుగకు బోలెడంత ప్రాధాన్యం ఇస్తారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరు సంబరాలు జరుపుకునే ఈ పండుగ కోసం ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తుంటారు కూడా. దేశంలో ప్రతీ వీధి, ప్రతీ ప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోలీ జరుపుకోవడంలో ప్రతీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకనే ఉన్నవాటిలో ఉత్తమమైనవి ఏవో తెలుసుకుంటే.. ఈ సారి హోలీని ఎంజాయ్ చేయడానికి ముందుగానే సిద్ధం కావచ్చు. ఇండియాలో హోలీ జరుపుకునేందుకు బెస్ట్ అనిపించుకునే 10 ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

1. బర్సన, మథుర:

Holi

శ్రీకృష్ణుని ప్రేయసి రాధ పుట్టిన ప్రదేశ బర్సన. నందగామ్ నుంచి వచ్చిన పురుషులు, అమ్మాయిలతో ఆటలు ఆడేందుకు ఇక్కడకు చేరతారు. రంగులకు బదులుగా కర్రలతో పలకరించుకోవడం భలే ఉంటుంది. అందుకే ఇక్కడ హోలీ పండుగను ‘లాథ్ మార్ హోలీ’ అని పిలుస్తారు.
మథురకు థామస్ కుక్ అందిస్తున్న ప్రత్యేకమైన హోలీ ట్రిప్‌ను మిస్ చేసుకోకండి.

2. పురులియా, పశ్చిమ బెంగాల్:

రంగులతో పాటు సాంప్రదాయ చఊ నృత్యంతో పురిలియాలో హోలీ పండుగ జరుపుకుంటారు. ఇలాంటి డ్యాన్స్‌ను మీరు ఇప్పటివరకూ చూసి ఉండరు, అసలు మిస్ కాకూడని దృశ్యం కూడా.

3. ఆనంద్‌పూర్ సాహిబ్, పంజాబ్:

ఆనంద్‌పూర్‌లో హోలీ అంటే కేవలం రంగులు మాత్రమే కాదు, భౌతిక కార్యక్రమాలు కూడా. మార్షల్ ఆర్ట్స్, శారీరక సామర్ధ్యం వంటి ప్రదర్శనలతో వేడుకలు జరుగుతాయి. వీటిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు.

4. వారణాసి:

Varanasi

మీ మనసును తాకే వేడుకల కోసం అయితే వారణాసిని విజిట్ చేయాల్సిందే. ఈ ఆధ్యాత్మిక ప్రాంతం హోలీ పండుగకు కరెక్ట్ ఛాయిస్.
మా వారణాసి హోలీ ప్యాకేజ్‌ను ఉపయోగించుకుని ఎన్నో సౌలభ్యాలను పొందవచ్చు.

5. ఉదయపూర్, రాజస్థాన్:

ఉదయపూర్‌లో మీ కోసం రాజరిక హోలీ వేడుకలు ఎదురుచూస్తున్నాయి. ఉదయపూర్‌లో జరిగే మేవార్ రాజ కుటుంబానికి చెందిన గుర్రాల ప్రదర్శన అద్భుతం అనాల్సిందే. హోలీ వేడుకకు సరిగ్గా ముందు ఈ ప్రదర్శన జరగగా, ఆ తర్వాత నుంచి పట్టణం అంతా రంగులమయం అయిపోతుంది.

6. ముంబై, మహరాష్ట్ర:

కలల నగరం అయిన ముంబైలో హోలీ వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. ప్రతీ వీధిలోను రంగులు, సంగీతం హోరెత్తిపోతాయి. ఇక్కడ హోలీ వేడుకలను తెగ ఎంజాయ్ చేయచ్చు.

7. జైపూర్, రాజస్థాన్:

Jaipur, Rajasthan

జైపూర్‌లో హోలీకి ప్రత్యేకత ఉంటుంది. వారి వేడుకలలో ఏనుగులు కూడా ఒక భాగం కావడం విశేషం. రంగురంగుల వస్త్రాలు, అనేక రంగుల అలంకరణలతో ఏనుగులు చూడముచ్చటగా ఉంటాయి. ఏనుగులతో నిర్వహించే టగ్-ఆఫ్-వార్ ఇక్కడి ప్రత్యేకత. హోలీ అంటే ఇష్టపడేవారు, జైపూర్ హోలీ ప్యాకేజ్‌తో సంబరాలను సందర్శించవచ్చు.

8. గోవా:

మీరు వెకేషన్ కోసం గోవా వెళుతున్నట్లు అయితేత, హోలీ వేడుకల సమయంలో సందర్శించడం సూపర్బ్‌గా ఉంటుంది. గోవాలో హోలీని ‘షిగ్మో’ అంటారు.
బాండ్స్, పరేడ్స్, రాత్రివేళల్లో జరిగే మ్యూజికల్ ఈవెంట్స్‌ను గోవా హాలిడే ప్యాకేజ్‌లలో భాగంగా ఎంజాయ్ చేయవచ్చు.

9. హంపి, కర్నాటక:

సాంప్రదాయమైన హోలీని హంపీలో చూడవచ్చు. రంగుల పండుగ హోలీ రోజున చారిత్రక కట్టడాల అలంకరణ అద్భుతంగా ఉంటుంది. రంగులతో పాటు అనేక డోలు శబ్దాలతో 2 రోజుల పాటు ఇక్కడ వేడుకలు జరుగుతాయి.

10. ఇండోర్, మధ్య ప్రదేశ్:

Indore, Madhya Pradesh

హోలీ నాడు మీ మనసులతో కూడా నృత్యం చేయించాలంటే ఇండోర్ వెళ్లాల్సిందే. అంతగా హోలీ వేడుకలు ఇక్కడ జరుగుతాయి. మొత్తం నగరం అంతా ఒక్కచోటకు చేరి డ్యాన్స్ చేసే సన్నివేశం కళ్లనుంచి చెదిరిపోవడం అసాధ్య.

మీకు హోలీ పండుగ అంటే బోలెడంత ఇష్టం అయితే, కచ్చితంగా పై ప్రాంతాలలో ఒకచోటకు మీరు వెళ్లాల్సిందే. మీ హోలీ వేడుకలకు మా ప్రత్యేక ప్యాకేజీలతో మరింత శోభను, సౌలభ్యాన్ని జత చేసుకోవడం మరచిపోకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *