Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

ఈ ప్రపంచం అంతా సహజమైన అద్భుతాలతో నిండి ఉంది.

ఇవాళ వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. అద్భుతాలను తెలుసుకోవాలని భావించే మీ మనసును ఇవి ఆకట్టుకోవడం ఖాయం.

1. ది ఫెయిరీ పూల్స్ ఆన్‌ ది ఐసిల్ ఆఫ్ స్కై – స్కాట్‌లాండ్:

వైల్డ్ స్విమ్మింగ్ చేయాలని ఉంటే వెంటనే స్కాంట్‌లాండ్‌లో మంచుగడ్డల మాదిరిగా నీరు ఉండే ఫెయిరీ పూల్స్‌లో దూకేయండి. గ్లెన్‌బ్రిటిల్‌కు సమీపంలో బ్లాక్‌ కలిన్స్ పాద ప్రాంతంలో ఇవి ఉంటాయి. ఇక్కడ పరిశుభ్రమైన స్వచ్ఛంగా ఉండే నీలి రంగు నీరు ప్రకృతి అందాలలో ఒకటి మాత్రమే కాదు.. సాహసాలను ఇష్టపడే వారికి తెగ నచ్చేస్తుంది.

2. రెయిన్‌బో మౌంటెన్స్, చైనా:

2.Rainbow mountains, China

భూమిపై సహజంగా గీసిన కాన్వాస్ మాదిరిగా కనిపించే చైనాలోని రెయిన్‌బో మౌంటెన్స్‌ నుంచి కళాకారులు ఎంతో స్ఫూర్తి పొందవచ్చు. ఝాంగై డాంక్సియా ల్యాండ్‌ఫార్మ్ జియోలాజికల్ పార్క్‌లో ఉన్న ఈ రెయిన్‌బో మౌంటెన్స్‌పై హరివిల్లును పెయింట్ చేసినట్లుగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

3. రైలే బీచ్, థాయ్‌ల్యాండ్:

థాయ్‌ల్యాండ్ టూరిజంకే ప్రత్యేకం రైలే బీచ్. క్రాబీ సిటీ మరియు ఓ నాంగ్ మధ్యలో ఉన్న రైలే, అత్యంత స్వచ్ఛమైన నీటి కింద కనిపించే లైమ్‌స్టోన్‌తో ఎంతో సుందరంగా ఉంటుంది.

4. నార్తరన్ లైట్స్, ఐస్‌ల్యాండ్:

వర్షాకాలంలో ఐస్‌ల్యాండ్‌లో కనిపించే సహజమైన సుందర దృశ్యం నార్తరన్ లైట్స్. దీన్ని అరోరా బొరీలిస్ అని కూడా అంటారు. ఉత్తర ధృవ ప్రాంతంలోని వాతావరణ భాగాలతో, సూర్యుడు రాపిడి చెందడం కారణంగా ఇవి ఏర్పడతాయి. మీ జీవిత కాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది.

ఐస్‌ల్యాండ్ టూర్ ప్యాకేజ్‌లు నార్తరన్ లైట్ టూర్స్‌తో కలిపి ఉంటాయి.

5. మార్బుల్ కావర్న్స్ ఆఫ్ కరెరా లేక్ – చిలీ:

ప్రపంచంలోని అత్యంత సుందరమైన గుహలుగా చిలీలోని మార్బుల్ కావర్న్స్ ఆఫ్ కరెరా లేక్‌ను చెప్పుకోవచ్చు. చిలీ దేశపు అందమైన ప్రదేశాల్లో ఒకటైన కరెరా లేక్ యొక్క నీటితో ఈ గుహల నెట్వర్క్ ఉంటుంది.

6. గాలపగోస్ దీవులు:

లావాతో కారణంగా ఏర్పడిన ద్వీపాల గుంపు అందమైన గాలపగోస్ ద్వీపాలు. ప్రకృతి వైవిధ్యాన్ని ఇవి చూపుతాయి. దక్షిణ అమెరికా ఖండానికి దాదాపు 1000 కిలో మీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రం నడి మధ్యలో ఈ ద్వీపాలు ఉన్నాయి. గాలపగోస్ ద్వీపాలను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తించింది.

7. కప్పాడోసియా, టర్కీ:

తేనె పట్టు లాంటి దట్టమైన కొండలు, కప్పాడోసియాలోని నిలువెత్తు శిఖరాలను చూస్తే.. మీరు మార్స్‌లో ఉన్న భావన కలుగుతుంది. ఇక్కడ హాట్ ఎయిర్ ఎయిర్‌ బెలూన్‌లో ప్రయాణం కప్పాడోసియా అద్భుత అందాలను టాప్ వ్యూ నుంచి చూసే అవకాశం కల్పిస్తుంది.
కప్పాడోసియా అందాలను మీకు చేరువ చేసే టర్కీ టూర్ ప్యాకేజ్‌లు అనేకం ఉన్నాయి.

8. ఆషికగ ఫ్లవర్ పార్క్: ఆషికగ, జపాన్:

ఫుజి పుష్పాలను చూసేందుకు ఉత్తమమైన ప్రాంతం ఆషికగ ఫ్లవర్ పార్క్. నీలం, తెలుపు, లేత గులాబీ రంగుల్లో ఫుజి పుష్పాలు ఇక్కడ దర్శనం ఇస్తాయి. వర్షాకాలంలో ఈ పూల అందాలతో ఈ పార్క్ అంతా వెల్లివిరిస్తుంది.

9. మిల్‌ఫోర్డ్ సౌండ్, న్యూజిలాండ్:

రుడ్‌యార్డ్ కిల్పింగ్ ప్రకారం ప్రపంచపు ఎనిమిదో వింత మిల్‌ఫోర్డ్ సౌండ్. ఈ ప్రాంతాన్ని మీరు ఒకసారి సందర్శిస్తే, ఇది కచ్చితంగా నిజమే అని అనిపిస్తుంది. ఐస్ఏజ్ నాటి గ్లేసియర్ల కారణంగా ఏర్పడిన మిల్‌ఫోర్డ్ సౌండ్, అద్భుతమైన దృశ్యాలతో అలరారుతుంది.

10. ఫోర్ సీజన్స్, బొరా బొరా:

‘ది బెస్ట్ ఐల్యాండ్ ఇన్ ది వరల్డ్’ అవార్డ్‌ను తాజాగా అందుకున్న బొరాబొరాలోని ఫోర్ సీజన్స్.. ప్రపంచంలోని అత్యంత సుందరమైన ప్రాంతాలలో ఒకటి. వివాహం వంటి వేడుకలు జరుపుకునేందుకు, బొరా బొరాలో లగ్జరీ హాలిడే గడిపేందుకు సరైన ప్రాంతం ఇది.

11. ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్, క్రొయేషియా:

స్వచ్ఛమైన నీటిని కలిగి 16 కాలువలు ఒకదానితో ఒకటి కలిసి, ఒక సిరీస్ మాదిరిగా జలపాతాలుగా మారితే ఎలా ఉంటుంది. ఈ దృశ్యం మరిచిపోలేం కదా. అనేక అందమైన కాలువలు, గుహలు మరియు జలపాతాలు కలిగిన క్రొయేషియాలోని ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్.. ప్రపంచంలోని భౌగోళిక అద్భుతాలలో ఒకటి.

12. సంటోరిని, గ్రీస్:

పర్యాటకులలో గ్రీస్‌లోని సంటోరిని గత కొన్నేళ్లుగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. సముద్రంలో అగ్ని పర్వతం పేలడంతో లావా కారణంగా ఏర్పడిన ప్రాంతం ప్రధాన ఆకర్షణ అయితే.. వెనుకవైపు అనేక ద్వీపాలు దర్శనం ఇస్తాయి. ప్రపంచంలోని సుందరమైన ప్రాంతాల్లో సంటోరిని కూడా ఒకటి.
ఐరోపా హాలిడే ప్యాకేజ్‌లలో ప్రధామైన గమ్యస్థానాల్లో సంటోరిని ఎప్పుడూ ఉంటుంది.

13. మున్నార్, ఇండియా:

మున్నార్‌లోని ఏటవాలు కొండలపై కనిపించే తేయాకు తోటలు లక్షల కొద్దీ టూరిస్టులను ఏటా ఆకర్షిస్తున్నాయి. మున్నార్ రోడ్లపై ప్రయాణం చేయడం ఓ అద్భుతమైన అనుభూతి. కేరళ హాలిడే ప్యాకేజ్‌లలో మున్నార్ తప్పకుండా ఒక భాగంగా ఉంటుంది.

14. ఆంటెలొప్ కాన్యన్, యూఎస్ఎ:

ఆంటలొప్ గుహల లోతు, వెడల్పు, పొడవు, రాళ్ల రంగు, తగినంత లైటింగ్.. అన్నీ సమపాళ్లలో ఉన్నాయని అనిపిస్తుంది. అమెరికా నైరుతి ప్రాంతంలో ఉన్న ఆంటెలొప్ కాన్యన్‌ను, యూఎస్ఎ హాలిడే ప్యాకేజ్‌లలో భాగంగా దర్శించండి. నవజో నేషన్ ల్యాండ్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని, యూఎస్ఎ పర్యటనలో తప్పనిసరిగా సందర్శించండి.

15. షేక్ జాయేద్ గ్రాండ్ మాస్క్, యూఏఈ:

1000కి పైగా పిల్లర్లపై ఏర్పాటు చేసిన పైకప్పులో 80 మార్బుల్ డోమ్స్ ఉంటాయి. దుబాయ్ టూరిజంలో అబు దాబిలోని షేక్ జాయేద్ మసీదు ఓ ముఖ్యమైన భాగం. మంచు అంతటి తెల్లగా కనిపించే ఈ మసీదు చుట్టూ పలు అందమైన పూదోటలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అందమైన మసీదులలో ఇది ఒకటిగా చెప్పవచ్చు.

16. కీకెన్‌హాఫ్ పార్క్, నెదర్లాండ్స్(తులిప్ క్షేత్రాలు):

ఆమ్‌స్టర్‌డామ్‌లోని కీకెన్‌హాఫ్ పార్క్.. ‘గార్డెన్ ఆఫ్ యూరోప్’గా ప్రఖ్యాతి చెందింది. వసంత రుతువులో కోట్ల కొద్ది తులిప్ పుష్పాలతో పాటు బ్లూబెల్స్, డాఫోడిల్స్, హాయసింత్స్‌ను దర్శనమిస్తాయి.

17. ది గ్రేట్ బారియర్ రీఫ్, ఆస్ట్రేలియా:

ఈ భూమిపై అత్యధిక జీవాలు ఉన్న ప్రాంతం ది గ్రేట్ బారియర్ రీఫ్. ప్రపంచంలో అతి పెద్ద పగడపు దిబ్బల కళ్లు తిప్పుకోలేని అందాలు టూరిస్టులు, ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

18. లావెండర్ ఫీల్డ్స్: ప్రోవెన్స్, ఫ్రాన్స్:

ప్రోవెన్స్‌లోని లావెండర్ క్షేత్రాలు వెదజల్లే పరిమళాలు, వాటి అందాన్ని చూస్తుంటే.. తప్పనిసరిగా మీలోని ఆర్టిస్ట్ నిద్ర లేవాల్సిందే. విపరీతమైన రద్దీ మధ్యన బ్రతికే మనుషుల మనసులకు ఎంతో ఉల్లాసం కలిగించే ప్రాంతం ఇది.

19. పముకలే, టర్కీ:

తెల్లని ట్రావర్‌టైన్ టెర్రెస్‌లు, లింపిడ్ పూల్స్, ఆకట్టుకునే వాటర్‌ఫాల్స్ వంటివి పముకలేను టర్కీలో తరచుగా పర్యాటకులు సందర్శించే ప్రాంతగా మార్చాయి. దీనికి టర్కిష్ భాషలో దూదితో చేసిన భవనం అని అర్ధం. గ్రీక్-రోమన్‌ నగరం అయిన హీరాపొలిస్‌ను పముకలే భద్రంగా పరిరక్షిస్తోంది.

20. అంకోర్ వాట్, కాంబోడియా:

కాంబోడియాలో అత్యంత సుందర ప్రాంతం అంకోర్ వాట్. అనేక పురాతన ఆలయాలు దర్శనం ఇచ్చే ఈ ప్రాంతాన్ని చూస్తే, కాంబోడియాను శతాబ్దాల క్రితం పరిపాలింంచిన ఖ్మేర్ రాజరిక చిహ్నాలు కనిపిస్తాయి.

21. సలర్ డి ఉయిని, బొలీవియా:

బొలీవియా పురాతన చరిత్రకు చెందిన సరస్సు సలార్ డి ఉయిని. పూర్తిగా ఎండిపోయిన ఈ ప్రాంతం, తెల్లని మెరిసే ఉప్పుతో కప్పవేయబడినట్లుగా ఉంటుంది. రాతి అమరికలు, కాక్టస్‌తో నిండిన ద్వీపాలు చూడముచ్చటగా ఉంటాయి.

22. వైట్ హవెన్ బీచ్, ఆస్ట్రేలియా:

ప్రపంచంలోని సుందరమైన బీచ్‌లలో వైట్ హవెన్ ఒకటి. తెల్లని సిలికా మట్టితో ఉండే ఈ ప్రాంతంలో అత్యంత స్వచ్ఛమైన నీరు కనిపిస్తుంది. ఈ రెండింటి అపురూప కలియిక కారణం అత్యంత శుద్ధమైన బీచ్‌లలో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఈ బీచ్‌ను హెలికాప్టర్‌లోంచి సందర్శించడం ఓ మరచిపోలేని అనుభూతి.
ఎన్నో సహజమైన వింతలను చూసే అవకాశం ఆస్ట్రేలియా టూరిజం కల్పిస్తుంది.

23. మెండెన్‌హల్ ఐస్ కేవ్స్, జెనేవూ, అలాస్కా:

స్వల్పంగా కరిగి పైన నీలంగా కనిపించే గ్లేసియేర్లే మెండెన్‌హల్ ఐస్ గుహలు. గ్లేసియర్లపై ట్రెక్కింగ్ చేసే సమయంలో ఈ ఐస్ కేవ్సస్, గుహ మధ్య ప్రాంతాలు, మంచు ద్వారా ఏర్పడే ఆకట్టుకునే రూపాలు చూడముచ్చటగా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత అందమైన ప్రాంతాల్లో ఇది ఒకటి.

24. లేక్ హిల్లియర్, ఆస్ట్రేలియా:

పింక్‌ లేక్‌గా కూడా పేరొందిన ఆస్ట్రేలియాలోని లేక్ హిల్లర్‌.. బబుల్‌గం పింక్ కలర్‌లో కనువిందు చేస్తుంది. సరస్సు పింక్ కలర్‌లోను, సముద్రం నీలి రంగులోను ఒకేసారి దర్శనం ఇస్తుంటే.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.

ప్రపంచంలోని ఈ అందమైన ప్రాంతాలను మీరు ఇప్పటివరకూ చూసి ఉండకపోతే, మీ టూర్ జాబితాలో ఈ పేర్లు తప్పని సరిగా ఉండాల్సిందే. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ విభాగంలో వెలిబుచ్చండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *