Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

నేపాల్ సందర్శనకు 10 అందమైన ప్రదేశాలు

ప్రాచీన మఠాల భూమి, మంచుతో కప్పబడిన పర్వతాలు, బౌద్ధమతం యొక్క జన్మస్థలం నేపాల్. పర్యాటకులను మంత్రముగ్ధమైన చేసే ప్రదేశం ఇది. అక్టోబర్ నుండి డిసెంబరు వరకు నేపాల్ సందర్శించడానికి ఉత్తమ సమయం అయినా, మీ తదుపరి సెలవుదినాలను ప్లాన్ చేసుకోవటానికి ఏదైనా ఉత్తమ సమయమే. ఈ హిమాలయ స్వర్గాన్ని దర్శించేందుకు ప్లాన్ చేసుకుంటే, నేపాల్ లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల జాబితా ఇవ్వబడినది.

నేపాల్ సందర్శించడానికి ఉత్తమ స్థలాలు

1. ఖాట్మండు:

నేపాల్ యొక్క రాజధాని నగరం అద్భుతమైన నిర్మాణం, పుణ్యక్షేత్రాలు మరియు దర్బార్‌లతో నిండి ఉంటుంది. నేపాల్ సందర్శనలో మీ ఉత్తమ స్థలాల జాబితాలో తప్పక ఉండాలి.

  • పశుపతినాథ్ ఆలయం ఖాట్మండులో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటి.
  • దర్బార్ స్క్వేర్ చుట్టూ నడవండి. ఇక్కడ అంతర్గత మ్యూజియం ఉంది మరియు ఇది కుమారి చోక్‌కు స్థావరం.
  • మీరు సాహసాలను ఇష్టపడేటట్లు అయితే బంగీ జంపింగ్ ప్రయత్నించండి.

2. పటాన్:

నేపాల్ లో మూడవ అతిపెద్ద నగరం పటాన్. రాజరిక నిర్మాణాల మధ్య మీరు గత కాలంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. అధివాస్తవిక నిర్మాణం మరియు నిర్మలమైన వాతావరణం మిమ్మల్ని సుప్రసిద్ధమైన రాజ్యంలోకి తీసుకువెళుతాయి. ఇవి మీకు మంత్రముగ్ధులను చేస్తాయి.

  • బంగారు, వెండి మరియు కాంస్య ఆభరణాలతో చుట్టబడిన గోల్డెన్ టెంపుల్ దగ్గర ఆగండి. ప్రవేశ రుసుముగా రూ. 50 చెల్లించాలి.
  •  ఐదు అంతస్తుల పగోడా, కుంభేశ్వర్ ఆలయం ఆకట్టుకుంటాయి.
  •  నేపాల్ లోని పురాతన మఠాలలో రుద్రవర్ణ మహావిహార్ ఒకటి. మీ నేపాల్ పర్యటనలో దీన్ని తప్పక చూడాలి.

 

3. భక్తపూర్:

సంస్కృతి మరియు వారసత్వంతో నిండి ఉన్న నేపాల్‌లోని ఒక రత్నం లాంటి నగరం భక్తపూర్. కళ, సంబరాలకు మరియు నెవారి సమాజం స్వదేశీ జీవనశైలికి ప్రసిద్ధి చెందింది. ఇది నేపాల్‌లో తప్పక చూడాలి.

  •  రుచికరమైన జుజు ధవు మీగడ పెరుగును అందించే ప్రాంతానికి ఒక ట్రిప్ ప్లాన్ చేయండి.
  • స్థానిక హస్తకళలతో తయారు చేయబడిన కుండల మరియు ఉయ్యాల తోలుబొమ్మలు కనిపిస్తాయి. భక్తపూర్‌లో కొన్ని అద్భుతమైన సావనీర్లు ఉన్నాయి.
  • ఈ స్థలం యొక్క నిజమైన అనుభూతి పొందడానికి కొన్ని ప్రామాణికమైన నెవారి వంటలను ప్రయత్నించండి.

4. పోఖరా:

మీరు ప్రకృతి సౌందర్యం మరియు ప్రశాంతతను చుట్టుముట్టే చోటుకు వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఎదురుచూస్తున్న గమ్యస్థానం పోఖరా. సంపూర్తి ఆకర్షణతో, మంచుతో కప్పబడిన హిమాలయాలు, సహజమైన సరస్సు మరియు ప్రశాంతత.. అన్నీ లభించే ప్రాంతం ఇది.

  •  సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు లేదా వాతావరణం ఆహ్లాదంగా ఉండే మే నెల.
  •  పర్వతారోహణ చరిత్ర మరియు హిమాలయాల ప్రజలను తెలుసుకోవడానికి ఇంటర్నేషనల్ మౌంటైన్ మ్యూజియంకు వెళ్ళండి.
  • నేపాల్‌లో ట్రెక్కింగ్ చేయడానికి ఇది ఉత్తమమైన స్థలాలలో ఒకటి. అన్నపూర్ణ రేంజెస్ పరిసరాల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు.

5. కిర్తిపూర్:

నేపాల్ యొక్క పురాతన నగరాల్లో ఒకటైన కిర్తిపూర్, నేపాల్ చరిత్రలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కిర్తిపూర్ చుట్టుపక్కల ఉన్న స్తూపాలు మరియు దేవాలయాల గురించి స్థానికులు ఎన్నో చెబుతారు.

  • సాంప్రదాయ థాయ్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఒక బౌద్ధ ఆశ్రమం కిర్తి బిహార్. తప్పనిసరిగా సందర్శించాల్సిన స్థలాలలో ఇది ఒకటి.
  • 16వ శతాబ్దం నాటి భగ భైరవ్ టెంపుల్ సందర్శించండి.
  •  అత్యంత పురాతనమైన స్థూపాలలో ఒకటైన చిలాంచో స్తూపం.. కిర్తిపూర్‌ సందర్శన ప్రాంతాలలో ఒకటి.

 

6. సాగర్మాతా నేషనల్ పార్క్:

ఈ నేచర్ పార్క్.. నేపాల్ టూరిజం యొక్క హైలైట్. అనేక కొత్త మొక్కలు మరియు పువ్వులను చూడవచ్చు. మంచు చిరుత కూడా కనిపిస్తుంది. నేపాల్ లో సందర్శించడానికి ఉత్తమ స్థలాల జాబితాలో ఈ పార్క్ ఉండాలి.

  • మార్చ్ నుండి మే వరకు లేదా సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం.
  • భారత పౌరులకు ప్రవేశ రుసుము రూ. 1500.
  • నిజానికి ఈ పార్కుకి వెళ్లడానికి, మీరు ఎక్కడ నుండి ప్రారంభించారనే అంశంపై ఆధారపడి కనీసం 2 రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.

7. హేలాంబు:

నేపాల్ లో సందర్శించడానికి అత్యుత్తమ స్థలాలలో ఒకటి హేలంబు. ప్రాంతీయంగా మారుతున్న టోపోగ్రఫీని, దాని సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపిస్తుంది.

  • హెలంబులో ట్రెక్కింగ్ మీ నేపాల్ హాలిడే ప్యాకేజీలో ఉత్తమమైన వాటిలో ఒకటి.
  • మీరు ఎక్కడ ప్రారంభించారనే అంశంపై ఆధారపడి 5 నుంచి 6 రోజులలో ట్రెక్కింగ్ పూర్తి కాగలదు.
  •  ఇది చల్లగా ఉంటుంది, కాబట్టి మీరు థెర్మల్స్‌ను తీసుకెళ్లాలి.

8. ధరణ్:

సుందరమైన సౌందర్యం మరియు దేవాలయాలకు ప్రసిద్ది చెందిన ధరణ్.. మహాభారత శ్రేణి పర్వత ప్రాంతాలలో ఉంది. ధరణ్ ఇప్పటికీ పవిత్రమైన అందంతో నిండి ఉన్న ప్రదేశాలలో ఒకటి.

  •  ధరణ్ దేవాలయాలకు పేరుగాంచినందున, కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం మీ టూర్‌లో ఉండాలి.
  • నమ్చే వరకు నడుస్తూ, నగరం యొక్క ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.
  •  మీ భాగస్వామితో కలిసి నేపాల్‌లో ఉన్నట్లయితే.. రాజా రాణి సరస్సు చుట్టూ ఒక పిక్నిక్ ప్లాన్ చేసుకోండి.

9. చిత్వాన్ నేషనల్ పార్క్:

సాగర్‌మాతను మీరు సందర్శించకపోతే.. చిత్వాన్ నేషనల్ పార్క్‌కు వెళ్లండి. రాజుల యొక్క వేట ప్రాంతాలు కలిగిన పార్క్.. ఇప్పుడు ఒక రిజర్వ్ మరియు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారిపోయింది.

  • అడవిలో పర్యటన, జంతువులను సందర్శించడం ఇక్కడ చేయదగిన ఉత్తమ విషయాలు.
  •  ఒక కొమ్ముగల రైనోస్ మరియు బెంగాల్ టైగర్స్‌ను మీరు పార్క్ చుట్టూ సఫారి టూర్ చేస్తున్నపుడు గుర్తించండి.
  • ఒక్కో వ్యక్తికి రూ. 750 ఖర్చు అవుతుంది.
  • మీరు పార్కు సమీపంలో ఎలిఫెంట్ బ్రీడింగ్ కేంద్రాలను సందర్శించవచ్చు.

10. జనక్‌పూర్:

సీతాదేవి జన్మ స్థలం ఇది అని భావిస్తారు. జనక్‌పూర్‌లో 500 సంవత్సరాల ప్రాచీ జానకి ఆలయం ఉంది. ఇది నేపాల్‌ సందర్శనలో ఆసక్తికరమైన ప్రదేశాలలో ఒకటి. ప్రధాన కేంద్రాల నుండి రాత్రిపూట పర్యటన కోసం ఈ నగరం ఒక అద్భుతమైన ప్రదేశం.

  • జానక్‌పూర్‌లోని జానకి యొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ద్వారా.. మైథిలి సామ్రాజ్య సంస్కృతి యొక్క మూలాలను అన్వేషించవచ్చు.
  •  చెరువుల నగరం అని కూడా పిలవబడుతుంది, నగరం అంతటా వ్యాపించిన అనేక నీటిమడుగులను చూడండి.
  •  జనక్‌పూర్‌లో ఉన్నపుడు పవిత్రమైన ధనష్ సాగర్ మరియు గంగా సాగర్ ట్యాంకులను కూడా సందర్శించాలి.

One Response
  1. V.VENKATA RAMANA January 31, 2018 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *